మానవ నివాసానికి మరో గ్రహం దొరికిందా..!

మనుషులు జీవించేందుకు సౌర కుటుంబంలో భూమిని పోలిన గ్రహం ఏదైనా ఉందేమోనని కొన్ని సంవత్సరాలుగా శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. ఈ ప్రయోగంలో వారు విజయవంతం అయ్యారు. మనుషులు జీవించేందుకు అణువుగా ఉండే సరికొత్త గ్రహాన్ని నాసా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. సౌర వ్యవస్థ ఆవల ఓ మరుగుజ్జు నక్షత్రం చుట్టూ పరిభ్రమిస్తున్న ఆ గ్రహంపై జీవం, ద్రవరూప నీరు ఉన్నట్లు నిర్ధారించకపోయినప్పటికీ.. వాటి ఉనికికి పుష్కల అవకాశాలున్నాయని వారు అభిప్రాయపడుతున్నారు. భూమికి దాదాపు 31 కాంతి సంవత్సరాల […]

మానవ నివాసానికి మరో గ్రహం దొరికిందా..!
Follow us

| Edited By:

Updated on: Aug 02, 2019 | 8:04 AM

మనుషులు జీవించేందుకు సౌర కుటుంబంలో భూమిని పోలిన గ్రహం ఏదైనా ఉందేమోనని కొన్ని సంవత్సరాలుగా శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. ఈ ప్రయోగంలో వారు విజయవంతం అయ్యారు. మనుషులు జీవించేందుకు అణువుగా ఉండే సరికొత్త గ్రహాన్ని నాసా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. సౌర వ్యవస్థ ఆవల ఓ మరుగుజ్జు నక్షత్రం చుట్టూ పరిభ్రమిస్తున్న ఆ గ్రహంపై జీవం, ద్రవరూప నీరు ఉన్నట్లు నిర్ధారించకపోయినప్పటికీ.. వాటి ఉనికికి పుష్కల అవకాశాలున్నాయని వారు అభిప్రాయపడుతున్నారు.

భూమికి దాదాపు 31 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఈ గ్రహానికి జీజే 357 డీ అనే నామకరణం చేశారు. దీన్ని నాసాకు చెందిన ట్రాన్సిటింగ్ ఎక్సోప్లానెట్ సర్వే ఉపగ్రహం(టెస్)ఈ ఏడాది ఫిబ్రవరిలో గుర్తించింది. సూర్యుడిలో మూడో వంతు పరిమాణంలో ఉండే ఓ మరుగుజ్జు నక్షత్రం చుట్టూ జీజే 357 డీతో పాటు జీజే 357 బీ, జీజే 357 సీ అనే మరో రెండు ఉపగ్రహాలు తిరుగుతున్నాయి. భూమితో పోలిస్తే జీజే 357 డీ ద్రవ్యరాశి ఎక్కువ కాగా.. దీన్ని సూపర్ ఎర్త్‌గా పరిగణిస్తున్నారు. ఈ గ్రహంపై వాతావరణం చాలా బావుందని.. భూమిలాగే అక్కడ ద్రవరూప నీరు ఉండేందుకు అవకాశాలున్నాయని శాస్త్రవేత్తలు తెలిపారు. త్వరలో అందుబాటులోకి వచ్చే అత్యాధునిక టెలిస్కోపులతో ఈ గ్రహంపై జీవం ఉనికిని గుర్తించవచ్చని శాస్త్రవేత్తలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.

Latest Articles
వృద్దాప్య పెన్షన్లు, కూటమి మేనిఫెస్టోపై వైఎస్ భారతి స్పందన..
వృద్దాప్య పెన్షన్లు, కూటమి మేనిఫెస్టోపై వైఎస్ భారతి స్పందన..
'చంద్రబాబు సూపర్6 అంతా మోసం'.. ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్ కౌంటర్
'చంద్రబాబు సూపర్6 అంతా మోసం'.. ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్ కౌంటర్
దేశంలో డబుల్ ఏ ట్యాక్స్.. ప్రధాని విమర్శలకు తెలంగాణ మంత్రి కౌంటర్
దేశంలో డబుల్ ఏ ట్యాక్స్.. ప్రధాని విమర్శలకు తెలంగాణ మంత్రి కౌంటర్
సీఎం రేవంత్‎కు సవాల్ విసిరిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..
సీఎం రేవంత్‎కు సవాల్ విసిరిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..
ఖమ్మం జిల్లాలో భానుడి భగభగలు.. పెట్రోల్ బంక్‌లో కూలర్స్ ఏర్పాటు
ఖమ్మం జిల్లాలో భానుడి భగభగలు.. పెట్రోల్ బంక్‌లో కూలర్స్ ఏర్పాటు
STP అంటే ఏమిటి? ఇది ఎలా పని చేస్తుంది?
STP అంటే ఏమిటి? ఇది ఎలా పని చేస్తుంది?
బీఆర్ఎస్‌పై అవినీతి ఆరోపణలు.. ప్రధాని మోదీ వ్యాఖ్యలకు నామా కౌంటర్
బీఆర్ఎస్‌పై అవినీతి ఆరోపణలు.. ప్రధాని మోదీ వ్యాఖ్యలకు నామా కౌంటర్
ప్రిడ్జ్‌ నీరు తాగుతున్నారా ఎన్ని వ్యాధులకు వెల్కం చెబుతున్నారంటే
ప్రిడ్జ్‌ నీరు తాగుతున్నారా ఎన్ని వ్యాధులకు వెల్కం చెబుతున్నారంటే
వారెవ్వా.. ఏం ఐడియా గురూ.. ఎండల నుంచి వాహనదారులకు రిలీఫ్..
వారెవ్వా.. ఏం ఐడియా గురూ.. ఎండల నుంచి వాహనదారులకు రిలీఫ్..
తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై కుండబద్దలు కొట్టిన ప్రధాని మోదీ..
తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై కుండబద్దలు కొట్టిన ప్రధాని మోదీ..