AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గేమింగ్​ లవర్స్‌ కోసం ఎమ్‌ఎస్‌ఐ నుంచి కొత్త ల్యాప్‌టాప్​లు.. ఏ మోడల్​లో ఏ ఫీచర్లు ఉన్నాయి

MSI Cyborg 15 Max C2W vs C13W.. గేమింగ్ ల్యాప్‌టాప్ కొనాలని చూస్తున్న వారికి MSI కొత్త ఎంపికలను తీసుకొచ్చింది. Cyborg 15 Max సిరీస్‌లో C2W, C13W మోడళ్లను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. సైబర్‌పంక్ డిజైన్‌తో వచ్చిన ఈ ల్యాప్‌టాప్‌లు గేమింగ్‌తో పాటు వీడియో ఎడిటింగ్, గ్రాఫిక్స్ పనులు, మల్టీటాస్కింగ్‌కు అనుగుణంగా రూపొందించారు.

గేమింగ్​ లవర్స్‌ కోసం ఎమ్‌ఎస్‌ఐ నుంచి కొత్త ల్యాప్‌టాప్​లు.. ఏ మోడల్​లో ఏ ఫీచర్లు ఉన్నాయి
Msi Cyborg 15 Max C2w Vs C13w
Nikhil
|

Updated on: Sep 16, 2026 | 6:30 AM

Share

అధిక గ్రాఫిక్స్ పనితీరు కోరుకునే గేమర్లను టార్గెట్ చేస్తూ MSI తన కొత్త Cyborg 15 Max సిరీస్‌ను తీసుకొచ్చింది. ఇందులో C2W, C13W మోడళ్లు ఉన్నాయి. 144Hz డిస్‌ప్లే, RTX 50 సిరీస్ GPU, 96GB వరకు RAM సపోర్ట్ వంటి ఫీచర్లతో వచ్చిన ఈ ల్యాప్‌టాప్‌లలో ఏ మోడల్ ప్రత్యేకమో తెలుసుకోవాలంటే స్పెసిఫికేషన్లను గమనించాలి.

C2Wలో RTX 50 సిరీస్ GPUలు

MSI Cyborg 15 Max C2Wలో Intel Core 7 240H ప్రాసెసర్ అందించారు. గ్రాఫిక్స్ కోసం NVIDIA GeForce RTX 5060 Laptop GPU, 8GB GDDR7 లేదా NVIDIA GeForce RTX 5050 Laptop GPU, 8GB GDDR7 ఆప్షన్లు ఉన్నాయి. GPU 100W TGP వరకు, CPU-GPU కలిపి మొత్తం సిస్టమ్ పవర్ 130W వరకు ఉంటుంది. గత తరంతో పోలిస్తే TGP 122 శాతం పెరిగిందని MSI తెలిపింది. 15.6 అంగుళాల FHD IPS డిస్‌ప్లే, 1920×1080 రిజల్యూషన్, 144Hz రిఫ్రెష్ రేట్, 100 శాతం sRGB కవరేజ్ ఉన్నాయి. 16GB DDR5-5600 RAMను 96GB వరకు పెంచుకోవచ్చు. 512GB NVMe SSD, రెండు M.2 స్లాట్లు ఉన్నాయి.

C13Wలో Core i7 ప్రాసెసర్

MSI Cyborg 15 Max C13Wలో 13th Gen Intel Core i7-13620H ప్రాసెసర్, NVIDIA GeForce RTX 5050 Laptop GPU, 8GB GDDR7 గ్రాఫిక్స్ మెమరీ ఉన్నాయి. ఇందులో 16GB DDR5-5200 RAMను 96GB వరకు పెంచుకోవచ్చు. 512GB NVMe SSD, రెండు M.2 స్లాట్లు అందించారు. రెండు మోడళ్లలోనూ 15.6 అంగుళాల FHD IPS 144Hz డిస్‌ప్లే, 100 శాతం sRGB కవరేజ్, రెండు 2W స్పీకర్లు, DTS ఆడియో, అరే మైక్రోఫోన్ ఉన్నాయి. USB 3.2 Gen 1 Type-A, రెండు USB 3.2 Gen 2 Type-A, USB 3.2 Gen 2 Type-C పోర్టులు లభిస్తాయి. Windows 11 Home ఆపరేటింగ్ సిస్టమ్‌తో ఇవి పనిచేస్తాయి.

Follow Us