ChatGPT: అచ్చం మనిషిలా ఆలోచించే కృత్రిమ మేధ ‘చాట్‌ జీపీటీ’.. ఆవకాయ నుంచి అణ్వాస్త్రాల వరకు..

|

Feb 11, 2023 | 11:01 AM

చాట్ జీపీటీ.. టెక్నాలజీలో వచ్చిన అతిపెద్ద సంచలనం. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌తో పనిచేసే ఈ వెబ్‌‌సైట్‌.. చేసే వింతలు అన్నీ విన్నీ కావు. మనిషిలానే ఆలోచించి మనుషులతో చాట్ చేయడం దీని ప్రత్యేకత. ఆవకాయ నుంచి అణ్వాస్త్రాల వరకు ఏ అంశాన్ని అడిగినా ఇట్టే సమాధానమిస్తుంది.

ChatGPT: అచ్చం మనిషిలా ఆలోచించే కృత్రిమ మేధ ‘చాట్‌ జీపీటీ’.. ఆవకాయ నుంచి అణ్వాస్త్రాల వరకు..
Chatgpt
Follow us on

చాట్ జీపీటీ.. టెక్నాలజీలో వచ్చిన అతిపెద్ద సంచలనం. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌ టెక్నాలజీతో పనిచేసే ఈ వెబ్‌‌సైట్‌.. చేసే వింతలు అన్నీ విన్నీ కావు. మనిషిలానే ఆలోచించి మనుషులతో చాట్ చేయడం దీని ప్రత్యేకత. ఆవకాయ నుంచి అణ్వాస్త్రాల వరకు ఏ అంశాన్ని అడిగినా ఇట్టే సమాధానమిస్తుంది.

మారుతున్న టెక్నాలజీతో.. అరచేతిలోకి ప్రపంచం వచ్చేసింది. ప్రపంచంలో ఏం కావాలన్నా ఒక్క క్లిక్‌లో వచ్చేస్తోంది. రోజు రోజుకూ కొత్త కొత్త సాఫ్ట్‌వేర్లు, సరికొత్త యాప్‌లు, వెబ్‌సైట్లు అందుబాటులోకి వస్తూనే ఉన్నాయి. కానీ ఈ వెబ్‌సైట్ మాత్రం వాటన్నిటికీ బాప్ అనే రేంజ్‌లో ఉంది. అదే ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌తో డెవలప్ చేసిన.. చాట్‌ జీపీటీ’ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతోంది.

ఈ వెబ్‌సైట్లోకి వెళ్లి ఏ ప్రశ్న అడిగినా.. క్షణాల్లోనే సమాధాన్ని ఇస్తోంది. తప్పుగా అడిగితే తప్పనీ చెప్తోంది. పిల్లల పాఠాలకు సంబంధించిన డౌట్ల దగ్గర నుంచి పెద్దలకు కావాల్సిన సమాచారం వరకూ అన్నీ ఇక్కడ రెడీ. అచ్చం మనిషిలా ఆలోచించి, స్పందించే కృత్రిమ మేధ కోసం జరుగుతున్న ప్రయత్నాలకు ఫలితమే చాట్‌ జీపీటీ. గతేడాది నవంబర్‌లోనే విడుదలైంది. ఓపెన్‌ఏఐ డాట్ కామ్‌ అనే వెబ్‌సైట్లో రిజిస్టర్‌ చేసుకుని మీరూ దీని సేవలు పొందొచ్చు. ఆవకాయ నుంచి అణ్వాస్త్రాల వరకు, స్టాక్‌ మార్కెట్‌ నుంచి ఖగోళపు అంచుల వరకూ ఏ అంశాన్ని అడిగినా ఇట్టే సమాధానమిస్తుంది.

ఇవి కూడా చదవండి

ఒక్క ముక్కలో చెప్పాలంటే చాటింగ్‌ చేయగల కృత్రిమ మేధ రోబో. కంప్యూటర్‌ ప్రోగ్రాములు రాయడం, వాటిలోని బగ్స్‌ను గుర్తించి తొలగించడం లాంటి పనులు కూడా చాట్‌ జీపీటీ చేయగలదు. సంగీతాన్ని వినిపించడం, కల్పిత కథలు రాయడం వంటివీ అలవోకగా చేసేస్తుంది.

విద్యార్థులకు వ్యాసాలు రాయడమే కాకుండా పరీక్షల్లో ప్రశ్నలకూ జవాబులిస్తుంది. పాటలు రాయడం, కంప్యూటర్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ డేటా అనలిటిక్స్‌ను తయారు చేయడం దగ్గర నుంచి గేమ్స్ ఆడటం వరకూ అన్నీ సౌకర్యాలూ ఉన్నాయిక్కడ. తప్పుడు ప్రశ్నలు అడిగినా వాటిని సరిచేసి సమాధానం ఇవ్వడం దీని ప్రత్యేకతల్లో ఒకటి.

డైరెక్టర్ రామ్‌గోపాల్‌ వర్మ ఇటీవలే చాట్‌ జీపీటీతో చాటింగ్‌ చేశారు. అక్కడ జరిగిన సంభాషణపై 17 ట్వీట్లు చేశారు. దాని ద్వారా భవిష్యత్తులో జరిగే పరిణామాలపై తన అభిప్రాయాలను చెప్పారు ఆర్జీవీ.

ఇన్ని ప్రత్యేకతలు ఉన్న ఈ చాట్ జీపీటీకి కూడా ఎన్నో పరిమితులు ఉన్నాయి. ప్రస్తుతానికి ఇది ప్రయోగాత్మకంగా విడుదల చేసిన బీటా వెర్షన్‌ మాత్రమే. అయితే ఇన్‌స్ట్రక్ట్‌ జీపీటీ పేరుతో సిద్ధం చేసిన ఏఐ సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్ చేయడం ద్వారా.. ప్రమాదకరమైన, మోసపూరితమైన సమాధానాలు తగ్గాయని నిపుణులు చెప్తున్నారు. ఇక జాతి విద్వేషాలు, ఉగ్రవాదం వంటి అంశాలకు సంబంధించిన సమాచారం చాట్‌జీపీటీకి దక్కకుండా ఓపెన్‌ ఏఐ సంస్థ జాగ్రత్తలు తీసుకుంటోంది.

దీనివల్ల దుష్ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఒక్కోసారి తప్పుడు సమాధానాలు ఇస్తోంది. అంతే కాకుండా పిల్లలు ఈ జీపీటీకి అలవాటు పడి.. సొంతంగా నేర్చుకోవడం మానేస్తున్నారు. సియాటెల్‌లోని కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో నిషేధం విధించారు కూడా. ఈ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మున్ముందు ఇంకెలాంటి పరిణామాలు, మార్పులు వస్తాయో అనేది ఆసక్తి రేకెత్తిస్తోంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం..