Jio Recharge Offer: జియో రీఛార్జి పై అదిరిపోయే క్యాష్ బ్యాక్ ఆఫర్.. పొందాలంటే ఏం చేయాలంటే..

ఎప్పటికప్పుడు వినియోగదారులకు మంచి మంచి ఆఫర్లను అందించే రిలయన్స్ జియో మరో కొత్త ఆఫర్ తీసుకువచ్చింది. ఈసారి రిలయన్స్ జియో తన ప్రీపెయిడ్ ప్లాన్‌లో క్యాష్‌బ్యాక్ ఆఫర్‌తో ముందుకు వచ్చింది.

Jio Recharge Offer: జియో రీఛార్జి పై అదిరిపోయే క్యాష్ బ్యాక్ ఆఫర్.. పొందాలంటే ఏం చేయాలంటే..
Jio Recharge Offers

Updated on: Sep 28, 2021 | 8:19 PM

Jio Recharge Offer: ఎప్పటికప్పుడు వినియోగదారులకు మంచి మంచి ఆఫర్లను అందించే రిలయన్స్ జియో మరో కొత్త ఆఫర్ తీసుకువచ్చింది. ఈసారి రిలయన్స్ జియో తన ప్రీపెయిడ్ ప్లాన్‌లో క్యాష్‌బ్యాక్ ఆఫర్‌తో ముందుకు వచ్చింది. 3 ప్లాన్లలో కంపెనీ ఈ క్యాష్‌బ్యాక్‌ను అందిస్తోంది. ఈ ఆఫర్ కారణంగా, వినియోగదారునికి 20% క్యాష్‌బ్యాక్ వస్తుంది. మీరు మై జియో యాప్ (My Jio) లేదా జియో అధికారిక వెబ్‌సైట్ ద్వారా రీఛార్జ్ చేసినప్పుడు మాత్రమే ఈ క్యాష్‌బ్యాక్ అందుబాటులో ఉంటుంది. జియో ఈ క్యాష్‌బ్యాక్‌ను వినియోగదారుల జియో ఖాతాలో జమ చేస్తుంది. దీనిని భవిష్యత్తులో రీఛార్జ్ చేయడానికి ఉపయోగించవచ్చు.

జియో క్యాష్‌బ్యాక్ అందిస్తున్న ప్రీపెయిడ్ ప్లాన్‌లలో రూ.249, రూ.555, రూ.599 ప్లాన్‌లు ఉన్నాయి. ఈ ప్లాన్‌లు, వాటిపై అందుబాటులో ఉన్న క్యాష్‌బ్యాక్ ఆఫర్ల గురించి తెలుసుకుందాం.

రూ .249 ప్లాన్: ఈ ప్లాన్‌లో, రోజువారీ 2GB డేటాతో అన్ని నెట్‌వర్క్‌లలో అపరిమిత వాయిస్ కాలింగ్ అందుబాటులో ఉంటుంది. ప్లాన్‌లో ప్రతిరోజూ 100 SMS లు ఇస్తారు. అదే సమయంలో, ప్లాన్ చెల్లుబాటు 28 రోజులు. ప్లాన్‌లో అన్ని జియో యాప్‌లకు ఉచిత యాక్సెస్ ఉంటుంది.

రూ. 555 ప్లాన్: ఈ ప్లాన్‌లో రోజువారీ 1.5GB డేటాతో అన్ని నెట్‌వర్క్‌లలో అపరిమిత వాయిస్ కాలింగ్ అందుబాటులో ఉంటుంది. ప్లాన్‌లో ప్రతిరోజూ 100 SMS లు ఉంటాయి. అదే సమయంలో, ప్లాన్ చెల్లుబాటు 84 రోజులు. ప్లాన్‌లో అన్ని జియో యాప్‌లకు ఉచిత యాక్సెస్ ఉంటుంది.

రూ .599 ప్లాన్: ఈ ప్లాన్‌లో, రోజువారీ 2GB డేటాతో అన్ని నెట్‌వర్క్‌లలో అపరిమిత వాయిస్ కాలింగ్ అందుబాటులో ఉంటుంది. ప్లాన్‌లో ప్రతిరోజూ 100 SMS లు చేసుకునే వీలుంది. అదే సమయంలో, ప్లాన్ చెల్లుబాటు 84 రోజులు. ప్లాన్‌లో అన్ని జియో యాప్‌లకు ఉచిత యాక్సెస్ ఉంటుంది.

క్యాష్ బ్యాక్ ఈవిధంగా..

  • ముందుగా మైజియో యాప్ లేదా కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి.
  • ఇక్కడ రూ .249, 555 లేదా రూ.599 నుండి ఏదైనా ఒక ప్లాన్‌ను ఎంచుకోండి.
  • ప్లాన్ సొమ్ము చెల్లించండి. మీకు 20% లేదా 200 క్యాష్‌బ్యాక్ లభిస్తుంది.
  • వినియోగదారులు అక్టోబర్ 2 నుండి అందుకున్న క్యాష్‌బ్యాక్‌ను రీడీమ్ చేయగలరు.

Also Read: Viral News: ‘ఎనర్జీ డ్రింక్స్’ తాగిన కొద్ది గంటల్లోనే స్పృహ తప్పింది.. తీరా స్కాన్ చేసి చూడగా గట్టి షాక్!

Punjab Politics: ఢిల్లీకి పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్.. బీజేపీతో జట్టు కట్టడానికేనా?