Infinix Zero Flip 5G: బడ్జెట్‌ ధరలో ఫ్లిప్‌ ఫోన్‌… ఫీచర్లు తెలిస్తే వావ్‌ అనాల్సిందే..

|

Oct 18, 2024 | 11:37 AM

చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ ఇన్‌ఫినిక్స్‌.. జీరో ఫ్లిప్‌ 5జీ పేరుతో కొత్త ఫోన్ ను తీసుకొచ్చింది. భారత్ లో లాంచ్ చేసిన ఈ ఫ్లిప్ ఫోన్ అక్టోబర్ 24వ తేదీ నుంచి అందుబాటులోకి రానుంది. ఇంతకీ ఈ ఫోన్ లో ఎలాంటి ఫీచర్లు ఉండనున్నాయి.? ధర ఎంత ఉండనుంది.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

Infinix Zero Flip 5G: బడ్జెట్‌ ధరలో ఫ్లిప్‌ ఫోన్‌... ఫీచర్లు తెలిస్తే వావ్‌ అనాల్సిందే..
Infinix Zero Flip 5g
Follow us on

ప్రస్తుతం మార్కెట్లో ఫ్లిప్‌ ఫోన్స్‌, ఫోల్డబుల్ ఫోన్స్‌ హవా నడుస్తోంది. మారిన కాలంతో పాటు స్మార్ట్‌ఫోన్స్‌ అధునాతన ఫీచర్లతో అందుబాటులోకి వస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు మార్కెట్లో అందుబాటులో ఉన్న ఫోల్డబుల్‌, ఫ్లిప్‌ ఫోన్స్‌ ధర ఎక్కువగా ఉన్నాయి. అయితే తాజాగా చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ ఫోన్ తయారీ సంస్థ ఇన్‌ఫినిక్స్‌ భారత మార్కెట్లోకి కొత్త ఫ్లిప్‌ ఫోన్‌ను తీసుకొచ్చింది. ఇన్‌ఫినిక్స్‌ జీరో ఫ్లిప్‌ పేరుతో తీసుకొచ్చిన ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉండనున్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

ఇన్‌ఫినిక్స్‌ జీరో ఫ్లిప్‌ 5జీ ఫోన్‌లో రెండు స్క్రీన్స్‌ను అందించారు. ఈ ఫోన్‌లో 6.9 ఇంచెస్‌తో కూడిన LTPO AMOLED మెయిన్‌ స్క్రీన్‌ను అందించారు. ఈ స్క్రీన్‌ను మధ్యకి ఫోల్డ్‌ చేయొచ్చు. 120Hz రిఫ్రెష్ రేట్ FHD+ రిజల్యూషన్, 1400 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ ఈ స్క్రీన్‌ సొంతం. అలాగే గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 సెక్యూరిటీతో ఈ స్క్రీన్‌ను తీసుకొచ్చారు.

ఇక ఈ ఫోన్‌లో 3.64 ఇంచెస్‌తో కూడిన సెకండరీ స్క్రీన్‌ను ఇచ్చారు. ఈ ఫోన్‌ను ఫోల్డ్‌ చేసిన తర్వాత సెకండీ స్క్రీన్‌ను ఉపయోగించుకోవచ్చు. ఇక ఈ ఫోన్‌ డైమెన్సిటీ 8020 5G ప్రోసెసర్‌తో పనిచేస్తుంది. ఈ ఫోన్‌లో 8 జీబీ ర్యామ్‌, 512 స్టోరేజ్‌ వేరియంట్‌తో తీసుకొచ్చారు. అలాగే ఇందులో హై రెసో ఆడియోకు సపోర్ట్‌ చేసే జేబీఎల్‌ డ్యూయల్‌ స్పీకర్లను ప్రత్యేకంగా అందించారు. కెమెరా విషయానికొస్తే ఇందులో 50MP + 50MPతో కూడిన డ్యూయల్‌ రెయిర్‌ కెమెరా సెటప్‌ను అందించారు.

అలాగే సెల్పీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 50 ఎంపీతో కూడిన ఫ్రంట్‌ కెమెరాను అందించారు. ఈ రెండు కెమెరాలతో 4కే రిజల్యూషన్‌తో కూడిన వీడియోలను రికార్డ్‌ చేసుకోవచ్చు. ఇక ఈ ఫోన్‌లో 70 వాట్స్‌ సూపర్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 4270 ఎమ్‌ఏహెచ్‌ కెపాసిటీతో కూడిన బ్యాటరీని అందించారు. ధర విషయానికొస్తే ఈ ఫోన్‌ రూ. 49,999కి అందుబాటులో ఉంది. లాంచింగ్ ఆఫర్‌లో భాగంగా ఈ ఫోన్‌ను ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డు, డెబిట్ కార్డుతో కొనుగోలు చేసే రూ. 5000 ఇన్‌స్టాంట్ డిస్కౌంట్‌ను పొందొచ్చు. అక్టోబర్‌ 24వ తేదీ నుంచి ఫ్లిప్‌కార్ట్‌ వేదికగా అందుబాటులోకి రానుంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..