iPhone 16: ఆ దేశంలో ఐఫోన్‌ 16పై నిషేధం.. కారణం ఏంటో తెలుసా.?

|

Oct 26, 2024 | 10:40 AM

ఇటీవల యాపిల్ నుంచి వచ్చిన ఐఫోన్ 16కి ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఓ దేశంలో మాత్రం ఈ ఫోన్ పై నిషేధం విధించారు. ఐఫోన్ 16పై నిషేధం విధించడానికి అసలు కారణం ఏంటి.? ఇంతకీ ఆ దేశం ఏంటో తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే..

iPhone 16: ఆ దేశంలో ఐఫోన్‌ 16పై నిషేధం.. కారణం ఏంటో తెలుసా.?
Iphone 16
Follow us on

ప్రపంచవ్యాప్తంగా యాపిల్‌ బ్రాండ్‌కు ఉన్న క్రేజ్‌ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా ఐఫోన్‌కు భారీ డిమాండ్‌ ఉంటుంది. ఐఫోన్‌ నుంచి కొత్త ఫోన్‌ వస్తుందంటే చాలు ఎక్కడ లేని క్యూరియాసిటీ నెలకొంటుంది. ఐఫోన్‌ సిరీస్‌ నుంచి కొత్త ఫోన్‌ వస్తుందంటే చాలు టెక్‌ మార్కెట్లో సందడి నెలకొంటుంది. ఈ క్రమంలోనే తాజాగా ఐఫోన్‌ నుంచి వచ్చిన 16 సిరీస్‌కు పెద్ద ఎత్తున ఆదరణ లభించింది. ఈ ఫోన్‌ అమ్మకాలు ఓ రేంజ్‌లో సాగాయి.

ఇదిలా ఉంటే ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకున్న ఐఫోన్‌ 16పై ఇండోనేషియా నిషేధం విధించింది. తమ దేశంలో ఐఫోన్‌ 16 విక్రయాలు మాత్రమే కాకుండా వినియోగంపై కూడా నిషేధం విధించింది. దీంతో ఇతర దేశాలకు చెందిన వారు కూడా ఇండోనేషియాలో ఐఫోన్‌ 16ని ఉపయోగించకూడదనే ఆంక్షలను ఆ దేశం పెట్టింది. ఇంతకీ ఐఫోన్‌ 16పై ఇండోనేషియా నిషేధం విధించడానికి కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఇండోనేషియాలో ఐఫోన్‌ 16 ఫోన్‌ వాడడానికి ఐఎంఈఐ సర్టిఫికేషన్‌ లేదన్న కారణంతో నిషేధం విధించారు. ఈ విషయాన్ని ఇండోనేషియా పరిశ్రమలశాఖ మంత్రి గుమివాంగ్ కర్తసస్మిత ఇటీవల ప్రకటించారు. ఒకవేళ ఎవరైనా వాడితే అది అక్రమమే అవుతుందని ఆయన తేల్చి చెప్పారు. ఎవరైనా ఐఫోన్‌16ని ఉపయోగిస్తుంటే ప్రభుత్వానికి తెలియజేయాలని అక్కడి ప్రజలను కోరడం గమనార్హం.

ఇదిలా ఉంటే ఇండోనేషియాలో పెట్టుబడికి ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో యాపిల్‌ విఫలమవ్వడంతోనే అక్కడి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. గతంలో యాపిల్‌.. ఇండోనేషియలో 1.71 మిలియన్‌ పెట్టుబడులు పెడుతామని హామీ ఇచ్చింది. అయితే కేవలం 1.48 మిలియన్‌ రూపాయాలను మాత్రమే పెట్టుబడి పెట్టింది. దీంతో ఈ కారణంగానే ఐఫోన్‌ 16పై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. ఇండోనేషియా తీసుకున్న ఈ నిర్ణయం పర్యాటకులపై కూడా ప్రభావం పడుతోంది. ఆ దేశానికి వస్తున్న పర్యాటకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..