చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్గజం హువావే మార్కెట్లోకి మరో ఇంట్రెస్టింగ్ ఫోన్‌ను తీసుకొచ్చింది. హువావే పురా 70 సిరీస్‌తో పేరుతో ఈ ఫోన్‌ను లాంచ్ చేశారు. ఈ సిరీస్‌లో భాగంగా పురా 70, పురా 70 ప్రో, పురా 70 ప్రో+ మోడల్స్‌ను తీసుకురానుంది. ఈ ఫోన్‌ను అదిరే లుక్స్‌తో రూపొందించారు. ఇంతకీ ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత ఉండనుంది.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
హువావే పురా 70లో కెమెరాకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. ఇందులో అల్ట్రా మోడల్ కెమరాతో గంటకు 300 కి.మీల వేగంతో దూసుకెళ్లే వస్తువును కూడా స్పష్టంగా రికార్డ్ చేయొచ్చని కంపెనీ చెబుతోంది. ఇక ఈ కెమెరా విషయానికొస్తే ఇందులో.. 48మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరాను అందించారు. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 13 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించనున్నారు.
ఈ స్మార్ట్ ఫోన్ కిరిన్ 9010 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఇందులో గ్రాఫిక్స్ కోసం మెలోన్ 910 జీపీయూ సెటప్‌ను అందించారు. దీంతో గేమింగ్‌కు ఈ ఫోన్ బెస్ట్ ఆప్షన్‌గా ఉపయోగపడుతుంది. హువావే పురా 70 సిరీస్ XMAGE ఇమేజ్ సిస్టమ్‌తో అందుబాటులోకి వచ్చింది. ఇక ఈ ఫోన్‌లో ప్రధాన కెమెరా OIS ఫీచర్‌ను అందించారు.
అలాగే ఇందులో ఆక్టా పీడీ ఆటోఫోకస్ అనే ప్రత్యేక ఫీచర్‌ను అందించారు. 1/1.28-inch అల్ట్రా విజన్ సెన్సార్ ఈ ఫోన్ ప్రత్యేకతగా చెప్పొచ్చు.ఇక ఈ ఫోన్‌లో 6.8 ఇంచెస్‌తో కూడిన ఎల్‌టీపీఓ ఓఎల్‌ఈడీ డిస్‌ప్లేను ఇవ్వనున్నారు. 120 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో కూడిన ఫుల్ హెచ్‌డీ+ స్క్రీన్‌ను అందించారు. 2500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ఈ ఫోన్ సొంతం. అలాగే ఈ ఫోన్‌లో ప్రత్యేకంగా యూడీ ఫింగర్ ప్రింట్ స్కానర్‌ను ఇచ్చారు.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..