Laptop
ల్యాప్‌టాప్, పర్సనల్ కంప్యూటర్ లేదా ఆఫీస్ డెస్క్‌టాప్‌లో పని చేస్తున్నప్పుడు డేటాను నిర్వహించడానికి.. వాటిని వేరు వేరు ఫోల్డర్‌లలో దాచుకోవచ్చు. ఈ ఫోల్డర్‌లలో కొన్ని సున్నితమైన డేటాను కలిగి ఉంటాయి. మీరు కాకుండా మరెవరూ ఫోల్డర్‌లోని డేటాను చూడకూడదనుకుంటే.. మీరు దానిని పాస్‌వర్డ్‌తో లాక్ చేయవచ్చు లేదా స్క్రీన్ నుంచి దాచవచ్చు.
ఫోల్డర్‌లో పాస్‌వర్డ్‌ను ఎలా ఉంచాలి ?
Windows 7 (Windows 7)
- ఫోల్డర్‌పై కుడి క్లిక్ చేసి, మెను నుంచి ‘Properties’ ఎంచుకోండి.
- డైలాగ్ బాక్స్‌లో, జనరల్ ట్యాబ్‌ను నొక్కి, అధునాతన బటన్‌పై క్లిక్ చేయండి.
- ఆపై‘Encrypt content to secure data’ని ఎంచుకుని, సరే క్లిక్ చేయండి.
- ప్రధాన పేజీకి తిరిగి వెళ్లి, “Apply”పై క్లిక్ చేయండి
- ఇప్పుడు Confirm Attribute Changesపై క్లిక్ చేసి, మీ అవసరానికి అనుగుణంగా‘Apply changes to this folder only’ లేదా ‘Apply changes to this folder, subfolders and files.’ ఎంచుకోండి. నొక్కండి
- మీరు మీ Windows వినియోగదారు పేరు, పాస్‌వర్డ్‌తో ఫోల్డర్‌ను మళ్లీ తెరవవచ్చు.
Windows 8 , Windows 10 లో ఫోల్డర్‌ని లాక్ చేయడం ఎలా ?
రెండింటిలో ఫోల్డర్‌లను లాక్ చేయడానికి మీరు యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి. మీరు దీన్ని చేయకూడదనుకుంటే కానీ డేటాను ప్రైవేట్‌గా ఉంచాలనుకుంటే మీ ల్యాప్‌టాప్, PCలో అతిథి వినియోగదారు IDని సృష్టించండి. అలాగే, ఇతరులు మీ డేటాను యాక్సెస్ చేయలేని విధంగా అతిథి వినియోగదారు అనుమతిని సెట్ చేయండి. మీ కంప్యూటర్ని ఉపయోగించడానికి మీరు ఎవరినైనా అనుమతించినప్పుడల్లా అతిథి IDతో లాగిన్ చేయమని వారిని అడగండి.