Tech Tips: ఎయిర్‌పాడ్స్‌లో అదిరిపోయే సీక్రెట్ ఫీచర్.. 99శాతం యూజర్స్‌కు అస్సలు తెలీదు

ఈ రోజుల్లో చాలా మంది ఎయిర్‌పాడ్స్‌ను వాడుతున్నారు. కానీ వారిలో దాదాపు 90 శాతం మందికి వాటిలో ఉండే పూర్తి ఫీచర్ల గురించి తెలియదు. అలాంటి ఒక స్పెషల్ ఫీచర్‌ గురించే ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఫీచర్ గురించి విన్న తర్వాత.. "అరెరే! ఇన్నాళ్లూ ఇది ఎలా మిస్సయ్యాం" అని మీరు కచ్చితంగా అనుకుంటారు.

Tech Tips: ఎయిర్‌పాడ్స్‌లో అదిరిపోయే సీక్రెట్ ఫీచర్.. 99శాతం యూజర్స్‌కు అస్సలు తెలీదు
Hidden Airpods Feature

Updated on: Oct 20, 2026 | 4:18 PM

ఈ రోజుల్లో చాలామంది ఎయిర్‌పాడ్స్‌ను ఉపయోగిస్తున్నారు. బైక్‌పై వెళ్తున్నా, ఇంట్లో ఉన్నా, జిమ్‌లో ఉన్నా, ఆఫీసులో ఉన్నా.. ఎక్కడికెళ్లినా ఇవి చెవుల్లో ఉండాల్సిందే. అయితే వీటిని వాడుతున్నప్పుడు చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చాలామంది గమనించరు. పక్కవాళ్లు పిలిచినా కూడా పట్టించుకోరు; ఎందుకంటే ఆ శబ్దాలు వారికి వినిపించవు. కానీ ఇకపై ఆ సమస్య ఉండదు. ఎందుకంటే ఎవరైనా మిమ్మల్ని పేరు పెట్టి పిలిస్తే.. మీ ఫోనే ఆ విషయాన్ని మీకు తెలియజేస్తుంది.

ఐఫోన్, ఎయిర్‌పాడ్స్ వినియోగదారుల కోసం ఒక రహస్య ఫీచర్ ఉంది. అది మీ పేరును గుర్తించి మీకు నోటిఫికేషన్ ద్వారా అలర్ట్ చేస్తుంది. అదే ‘నేమ్ రికగ్నిషన్’  ఫీచర్. మీరు దీన్ని ఎనేబుల్ చేసి పెట్టుకుంటే చాలు.. ఎవరైనా మీ పేరుతో పిలిచిన వెంటనే అది మిమ్మల్ని అప్రమత్తం చేస్తుంది. మరి ఈ ఫీచర్‌ను ఎలా సెటప్ చేయాలో ఇప్పుడు చూద్దాం.. అది చాలా సులభం:

నేమ్ రికగ్నిషన్ ఫీచర్‌ను ఎలా సెట్ చేయాలి?

  • మీ ఐఫోన్‌లో సెట్టింగ్స్  ఓపెన్ చేయండి.
  • యాక్సెసిబిలిటీ ఆప్షన్‌ను ఎంచుకోండి.
  • కిందికి స్క్రోల్ చేసి సౌండ్ అండ్ నేమ్ రికగ్నిషన్ పై నొక్కండి.
  • అక్కడ కనిపించే నేమ్ రికగ్నిషన్ పై క్లిక్ చేసి సెటప్ ప్రాసెస్‌ను ప్రారంభించండి.
  • అక్కడ మీ పేరును ఎంటర్ చేసి సేవ్ చేయండి.
  • అంతేకాదు అక్కడ మీ వాయిస్‌ ను కూడా సెచ్‌ చేసుకోవచ్చు.
  • ఇలా మీరు ఒకే పేరు కాకుండా మల్టిపుల్ నేమ్స్ కూడా ఇవ్వొచ్చు.

ఈ ఫీచర్ ఎయిర్‌పాడ్స్‌లో చాలా రోజుల నుంచే అందుబాటులో ఉన్నప్పటికీ, ఇప్పటికీ చాలా మంది యూజర్లకు దీనిపై అవగాహన లేదు. ఎయిర్‌పాడ్స్, ఐఫోన్ వాడేవారికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా బయట తిరుగుతున్నప్పుడు లేదా పాటలు వింటున్నప్పుడు ఎవరైనా మీ పేరు పెట్టి పిలిస్తే ఆ పిలుపును మీరు ఏమాత్రం మిస్ అవ్వరు.

మరిన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us