Smart Phone Charging: నిమిషాల్లోనే స్మార్ట్ ఫోన్ ఫుల్ ఛార్జింగ్.. ఎంఐ కంపెనీ సన్నాహాలు..

స్మార్ట్ ఫోన్ ను కొనుగోలు చేసేముందు దాని బ్యాటరీ సామర్థ్యం గురించి ఎక్కువగా ఆలోచిస్తాం. ఎందుకంటే ఫోన్ అవసరం నేటి కాలంలో చాలా పెరిగింది. కేవలం మాట్లాడుకోవడానికే కాదు అనేక రకాల పనులకు, ఆర్థిక లావాదేవీలకు ఫోన్ అవసరం. ఉదయం లేచిన దగ్గరి నుంచి రాత్రి పడుకునే వరకూ ప్రతి పనిలోనూ ఫోన్ సాయం కావాల్సిందే. ఈ పనులన్నీ సక్రమంగా జరగాలంటే దానిలో బ్యాటరీ సామర్థ్యం మెరుగ్గా ఉండాలి.

Smart Phone Charging: నిమిషాల్లోనే స్మార్ట్ ఫోన్ ఫుల్ ఛార్జింగ్.. ఎంఐ కంపెనీ సన్నాహాలు..
Mobile Charging
Follow us

|

Updated on: Aug 10, 2024 | 8:30 PM

స్మార్ట్ ఫోన్ ను కొనుగోలు చేసేముందు దాని బ్యాటరీ సామర్థ్యం గురించి ఎక్కువగా ఆలోచిస్తాం. ఎందుకంటే ఫోన్ అవసరం నేటి కాలంలో చాలా పెరిగింది. కేవలం మాట్లాడుకోవడానికే కాదు అనేక రకాల పనులకు, ఆర్థిక లావాదేవీలకు ఫోన్ అవసరం. ఉదయం లేచిన దగ్గరి నుంచి రాత్రి పడుకునే వరకూ ప్రతి పనిలోనూ ఫోన్ సాయం కావాల్సిందే. ఈ పనులన్నీ సక్రమంగా జరగాలంటే దానిలో బ్యాటరీ సామర్థ్యం మెరుగ్గా ఉండాలి. ఎక్కువ గంటలు ఫోన్ పనిచేయగలగాలి. ఫోన్ ను తొందరంగా ఛార్జింగ్ చేసుకునే వీలుండాలి. ఇందుకోసం వివిధ కంపెనీలు వేగంగా ఛార్జింగ్ అయ్యే ఫోన్లను రూపొందిస్తున్నాయి. ముఖ్యంగా ఎమ్ఐ కంపెనీ 100 డబ్ల్యూ చార్జింగ్ కు సపోర్టు చేస్తే 7500 ఎంఏహెచ్ బ్యాటరీని అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపింది.

ఫాస్ట్ ఛార్జింగ్ కు మద్దతు

ఎమ్ఐ తన సబ్ బ్రాండ్ రెడ్ మీ కె70 ఎక్స్ ట్రీమ్ ఎడిషన్ ను గత నెలలో ఆవిష్కరించింది. 120 డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇచ్చే 5,500 ఎంఏహెచ్ బ్యాటరీతో దాన్ని విడుదల చేసింది. ఇప్పుడు మరింత సామర్థ్యం కలిగిన బ్యాటరీలను రూపొందించే పనిలో ఉంది. ప్రధానంగా 120 డబ్ల్యూ చార్జింగ్ కు మద్దతు ఇచ్చే 7000 ఎంఏహెచ్, అలాగే 100 డబ్ల్యూ చార్జింగ్ కు మద్దతు ఇచ్చే 7500 ఎంఏహెచ్ బ్యాటరీలను సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఎమ్ఐతో పాటు ఇతర స్మార్ట్‌ఫోన్ తయారీదారులు కూడా తమ రాబోయే ఫోన్‌లలో అధిక శక్తి సాంద్రత కలిగిన బ్యాటరీలను ప్యాక్ చేయడానికి చూస్తున్నారు.

అధిక శక్తి కలిగిన బ్యాటరీలు

ఎమ్ఐ తన ఫోన్ల కోసం 5,500, 6,000, 6,500, 7,000, 7,500ఎంఏహెచ్ బ్యాటరీలకు ఫాస్ట్ ఛార్జింగ్ సొల్యూషన్‌లను పరిశీలిస్తోందని వైబోలోని టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ తెలిపింది. ముఖ్యంగా 120 డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ మద్దతుతో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీని, 100డబ్ల్యూ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,500 ఎంఏహెచ్ బ్యాటరీని రూపొందిస్తుందని సమాచారం.

ఇవి కూడా చదవండి

అత్యంత వేగంగా..

ఎమ్ఐ 120 డబ్ల్యూ ఫాస్ చార్జింగ్ కు మద్దతు ఇచ్చే 6,000 బ్యాటరీని పరీక్షిస్తోంది, ఇది 34 నిమిషాల్లోనే పరికరాన్ని పూర్తిగా చార్జింగ్ చేస్తుంది. అలాగే 100 డబ్ల్యూ మద్దతు కలిగిన 6,500 బ్యాటరీ కేవలం 30 నిమిషాల్లోనే చార్జింగ్ అవుతుంది. వీటితో పాటు 100 డబ్ల్యూ సపోర్టు చేసే 7,500, 120 డబ్ల్యూ ఛార్జింగ్ సొల్యూషన్‌తో 7,000 బ్యాటరీలు కంపెనీ పరిశీలలో ఉన్నట్టు సమాచారం. మునుపటి వేరియంట్ లో 63 నిమిషాల్లో పూర్తిగా ఛార్జ్ చేయగలిగితే, రెండోది కేవలం 49 నిమిషాల్లో ఛార్జ్ చేయగలదు.

మరికొన్ని కంపెనీలు కూడా..

మొబైల్ మార్కెట్ లో ఎమ్ఐ ప్రధాన ప్రత్యర్థులైన వన్ ప్లస్, ఒప్పో కూడా పెద్ద బ్యాటరీలతో హ్యాండ్‌సెట్‌లను ఆవిష్కరించే అవకాశం ఎక్కువగా ఉంది. వారు కొత్త తరం సిలికాన్ పదార్థాలను ఉపయోగించే బ్యాటరీలతో ప్రోటోటైప్‌లను పరీక్షిస్తున్నారని సమాచారం. 6100 ఎంఏహెచ్ బ్యాటరీతో వన్ ప్లస్ ఏస్ 3 ప్రో జూన్ లో విడుదలైంది. ఎమ్ఐలోని పోర్ట్‌ఫోలియోలోని చాలా హ్యాండ్‌సెట్‌లు 5,000 ఎంఏహెచ్ బ్యాటరీలను కలిగి ఉన్నాయి. ఇటీవల విడుదల చేసిన రెడ్ మీ నోట్ 13 ప్రో ప్లస్, రెడ్ మి కె70 అల్ట్రా 120 డబ్ల్యూ స్ట్ ఛార్జింగ్‌ కు మద్దతు పలికే 5,500 ఎంఏహెచ్ బ్యాటరీలను ఏర్పాటు చేశారు. ఈ టెక్నాలజీతో కేవలం 24 నిమిషాల్లో బ్యాటరీని సున్నా నుంచి వంద శాతం ఫాస్ట్ ఛార్జింగ్ చేయవచ్చు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..

వర్షాకాలంలో కాల్చిన మొక్కజొన్న పొత్తులు తింటున్నారా? ఇది మీ కోసమే
వర్షాకాలంలో కాల్చిన మొక్కజొన్న పొత్తులు తింటున్నారా? ఇది మీ కోసమే
పెరుగు, వేయించిన జీలకర్ర పొడి కలిపి తీసుకోండి.. ఫలితం మీరే చూడండి
పెరుగు, వేయించిన జీలకర్ర పొడి కలిపి తీసుకోండి.. ఫలితం మీరే చూడండి
73 లక్షల మొబైల్ క‌నెక్షన్ల ర‌ద్దు.! రీవెరిఫికేష‌న‌ల్‌లో విఫ‌లంతో
73 లక్షల మొబైల్ క‌నెక్షన్ల ర‌ద్దు.! రీవెరిఫికేష‌న‌ల్‌లో విఫ‌లంతో
జపాన్‌లో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ.!
జపాన్‌లో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ.!
హిజాబ్ ధరించనందుకు అరెస్టు.. ఆ వెంటనే మిస్సింగ్‌ కూడా.!
హిజాబ్ ధరించనందుకు అరెస్టు.. ఆ వెంటనే మిస్సింగ్‌ కూడా.!
సొంత నానమ్మ ఇంటినే కూల్చేసిన కిమ్‌.! సవతి సోదరుడిపై విషప్రయోగం.!
సొంత నానమ్మ ఇంటినే కూల్చేసిన కిమ్‌.! సవతి సోదరుడిపై విషప్రయోగం.!
బంగ్లాదేశ్‌ సంక్షోభం.. భారత్ పై ఎఫెక్ట్ ఎంత.? వీడియో..
బంగ్లాదేశ్‌ సంక్షోభం.. భారత్ పై ఎఫెక్ట్ ఎంత.? వీడియో..
రూటు మార్చిన స్మగ్లర్లు.! సముద్ర మార్గంలో సినిమా తరహాలో ఛేజింగ్..
రూటు మార్చిన స్మగ్లర్లు.! సముద్ర మార్గంలో సినిమా తరహాలో ఛేజింగ్..
సోదరితో కలిసి షాపింగ్‌ చేసిన షేక్‌ హసీనా.! తీవ్ర షాక్‌లో బృందం..
సోదరితో కలిసి షాపింగ్‌ చేసిన షేక్‌ హసీనా.! తీవ్ర షాక్‌లో బృందం..
వారికి తాము చనిపోతామని ముందే తెలిసిపోయిందా.? విషాద ప్రయాణం..
వారికి తాము చనిపోతామని ముందే తెలిసిపోయిందా.? విషాద ప్రయాణం..