చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్గజం ఇన్‌ఫినిక్స్ భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్ చేసింది. ఇన్‌ఫినిక్స్ నోట్ 40 ఎక్స్ పేరుతో ఈ ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చారు.
కెమెరా విషయంలో ఈ ఫోన్‌ను అధిక ప్రాధాన్య ఇచ్చారు. అచ్చంగా ఐఫోన్‌ను పోలిన విధంగా కెమెరాను డిజైన్ చేశారు. కేవలం కెమెరా సెట్ మాత్రమే కాకుండా స్క్రీన్ మీద నాచ్ ఫీచర్‌ను యాడ్ చేశారు.
ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 108 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరాను అందించారు. అలాగే ఇందులో సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 8 ఎంపీతో కూడిన ఫ్రంట్ కెమెరాను ఇచ్చారు.
ఇక ఈ ఫోన్ ధర విషయానికొస్తే 8జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.14,999, 12 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.15,999లకు లభిస్తాయి.
పలు బ్యాంకులకు చెందిన కార్డులతో కొనుగోలు చేస్తే ఈ ఫోన్‌పై అదనంగా రూ. 1000 వరకు డిస్కౌంట్‌ను అందిస్తున్నారు. దీంతో ఈ ఫోన్ బేసిక్ వేరియంట్ రూ. 14వేలకే సొంతం చేసుకోవచ్చు.
ఇన్‌ఫినిక్స్ నోట్ 40 ఎక్స్ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 14 బేస్డ్ ఎక్స్ఓఎస్ 14 వర్షన్ పై పని చేస్తుంది. ఇందులో బ్లూటూత్ 5.2 వైఫై 5.0 కనెక్టివిటీ వంటి ఫీచర్లను అందించారు.
ఇక ఈ ఫోన్‌లో 120 హెర్ట్జ్ డైనమిక్ రీఫ్రెష్ రేటు, 500 నిట్స్ పీక్ బ్రైట్ నెస్ తోపాటు 6.78 అంగుళాల ఫుల్ హెచ్డీ+ స్క్రీన్‌ను అందించారు. 1080 x 2436 పిక్సెల్స్ రిజల్యూషన్ స్క్రీన్ సొంతం.