ఈ రోజుల్లో బైక్ ప్రతి ఒక్కరికి ఉంటుంది. బైక్ నడపడంలో కొన్ని ట్రిక్స్ పాటించడం వల్ల మైలేజీని పెంచుకోవచ్చంటున్నారు టెక్ నిపుణులు. అయితే చాలా మంది బైక్ మైలేజీ రావడం లేదంటూ చెబుతుంటారు. బైక్ నడిపే విధానం బట్టి మైలేజీ ఉంటుందని గుర్తించుకోవాలి. కొన్ని పొరపాట్లు చేయడం వల్ల మైలేజీ తక్కువగా ఇస్తుంటుంది. ఏదైనా బైక్ మైలేజ్ దాని ఇంజిన్ స్థితిపై ఆధారపడి ఉంటుంది. మీరు ప్రయాణించే విధానం కూడా మైలేజీని ప్రభావితం చేస్తుందని గుర్తుంచుకోవాలి. బైక్ నడపడం విధానంలోనూ తేడా ఉంటే మైలేజీ తక్కువగా ఇస్తుంది. కొన్ని ట్రిక్స్ పాటిస్తే మైలేజీని మెరుగు పర్చుకోవచ్చు. బైక్‌ను సరైన వేగంతో, ఆర్‌పీఎమ్‌లో నడపడం ద్వారా మాత్రమే కంపెనీ క్లెయిమ్ చేసిన మైలేజీని వస్తుంది. అలాగే బైక్‌ను స్పీడ్‌గా పోనిచ్చినా, లేదా మెల్లగా నడిపినా మైలేజీ రాదు.
చాలా మంది చాలా నెమ్మదిగా లేదా చాలా వేగంగా బైక్ నడుపుతారు. ఈ పొరపాటు వల్ల బైక్‌లు, స్కూటర్‌లకు ఎప్పుడూ తక్కువ మైలేజీ వస్తుంది. ఇది ఇంజన్‌కి ఎక్కువ పనిని ఇస్తుంది. ఈ కారణంగా మైలేజీని తగ్గిపోతుంది. సురక్షితమైన బైక్ వేగం 40-60. ఈ వేగాన్ని పాటిస్తే బైక్ ఇంజిన్ ఉత్తమంగా పనిచేస్తుంది. వాహనాన్ని సరైన వేగంతో నడపడం వల్ల ఇంజిన్‌పై ఎక్కువ ఒత్తిడి పడదు. దాని జీవితకాలం కూడా పెరుగుతుంది.
సేఫ్ స్పీడ్ మెయింటెయిన్:
వాహనదారులు బైక్ నడిపేటప్పుడు సేఫ్ స్పీడ్ మెయింటెయిన్ చేయడం అలవాటు చేసుకోవాలి. ఇలా చేస్తే మంచి మైలేజీ వస్తుంది. చాలా బైక్‌లకు, సురక్షితమైన వేగం గరిష్ట వేగంలో 40-60 శాతంగా ఉంటాయి. ఉదాహరణకు బైక్ గరిష్ట వేగం 100 kmph అనుకుంటే.. వేగం 40-60 kmphగా ఉండాలని గుర్తించుకోండి. ఈ వేగంతో బైక్ నడపడం వల్ల ఇంధనం ఆదా అవడమే కాకుండా ప్రమాదాలు కూడా తగ్గుతాయి.
గేర్లు మార్చడం:
గేర్లను మార్చేటప్పుడు ఎల్లప్పుడూ వేగం గురించి చూసుకోవాలి. చాలా మంది చాలా వేగంగా ఉన్నా గేర్లను వెంటవెంటనే మారుస్తూ ఉంటారు. బైక్‌ను అధిక వేగంతో నడిపే సమయంలో గేర్లను మారిస్తే.. ఇంజిన్‌పై ఒత్తిడి పెరుగుతుంది. ఇంధన వినియోగం కూడా పెరుగుతుంది. లాంగ్ రైడ్ కోసం బయలుదేరే ముందు, బైక్ మాన్యువల్ బుక్‌లో ఇచ్చిన విధంగా మీ బైక్ గరిష్ట వేగం, సురక్షిత వేగాన్ని తెలుసుకోవాలి.
నాణ్యమైన పెట్రోల్:
అంతేకాదు.. క్వాలిటీ కలిగిన పెట్రోల్‌ను వాడాలి. ఈ మధ్య కాలంలో పెట్రోల్ బంకుల్లో పెట్రోల్‌ను కల్తీ చేస్తున్న సంఘటనలు ఎన్నో చూస్తున్నాం. ఇంజిన్ ఆయిల్ కూడా రెగ్యూలర్‌గా మార్చడం కూడా ముఖ్యమని గుర్తించుకోండి. ఎయిర్ ఫిల్టర్‌లను క్లీన్ చేయించాలి.
మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి