Flipkart: దసరాకు షాపింగ్ ప్లాన్‌ చేస్తున్నారా.? ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ బిలియన్‌ డేస్‌ వచ్చేస్తోంది.. ఆఫర్లే, ఆఫర్లు..

Flipkart Big billion days: దసరా వచ్చిందంటే ఇంట్లో ఏదో కొత్త వస్తువు కొనుగోలు చేయాలని ప్లాన్‌ చేసే వారు మనలో చాలా మంది ఉంటారు. దీనినే క్యాష్ చేసుకోవడానికి ఈ కామర్స్‌ సైట్స్‌ సేల్స్‌ను నిర్వహిస్తుంటాయి. ఈ క్రమంలోనే ప్రముఖ ఈకామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌..

Flipkart: దసరాకు షాపింగ్ ప్లాన్‌ చేస్తున్నారా.? ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ బిలియన్‌ డేస్‌ వచ్చేస్తోంది.. ఆఫర్లే, ఆఫర్లు..
Flipkart Sale

Updated on: Sep 15, 2022 | 2:22 PM

Flipkart Big billion days: దసరా వచ్చిందంటే ఇంట్లో ఏదో కొత్త వస్తువు కొనుగోలు చేయాలని ప్లాన్‌ చేసే వారు మనలో చాలా మంది ఉంటారు. దీనినే క్యాష్ చేసుకోవడానికి ఈ కామర్స్‌ సైట్స్‌ సేల్స్‌ను నిర్వహిస్తుంటాయి. ఈ క్రమంలోనే ప్రముఖ ఈకామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌ ‘బిగ్‌ బిలియన్‌ డేస్‌ సేల్‌’కు తెర తీసింది. సెప్టెంబర్‌ 23 నుంచి ఈ సేల్ ప్రారంభం కానుంది. ఈ సేల్‌ 8 రోజుల పాటు (సెప్టెంబర్‌ 30 తేదీ వరకు) జరగనుంది. ఈ సేల్‌లో భాగంగా స్మార్ట్‌ఫోన్‌లు, మొదలు ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌వాచ్‌లు, గ్యాడ్జెట్లపై భారీ డిస్కౌంట్‌లను అందించేందుకు సిద్ధమవుతోంది ఫ్లిప్‌కార్ట్‌.

అయితే ఇప్పటి వరకు ఏయే ప్రొడెక్ట్‌పై ఎంత డిస్కౌంట్‌ రానుందన్న విషయాన్ని అధికారికంగా ప్రకటించని ఫ్లిప్‌కార్ట్‌.. ఐసీఐసీఐ, యాక్సిస్‌ బ్యాంక్‌ క్రెడిట్‌, డెబిట్‌ కార్డులపై 10 శాతం ఇన్‌స్టంట్‌ డిస్కౌంట్‌ ఇవ్వనున్నట్లు మాత్రం ప్రకటించింది. అలాగే పేటీఎం, వ్యాలెట్‌తో కొనుగోలు చేసిన వారికి 10 శాతం డిస్కౌంట్‌ అందించనున్నారు. అంతేకాకుండా ఫ్లిప్‌కార్ట్ పే లేటర్‌ ఆప్షన్‌ ద్వారా రూ. లక్ష వరకు కొనుగోలు చేసి ఆ తర్వాత దానిని ఈఎమ్‌ఐ లేదా తర్వాతి నెలలో చెల్లించే వెసులుబాటు కల్పించనున్నారు.

ఇక వినియోగదారులకు కోసం ప్రత్యేకంగా అర్థరాత్రి 12 గంటలకు, ఉదయం గంటలకు, సాయంత్రం 4 గంటలకు రష్‌ అవర్స్‌ పేరుతో క్రీజీ డీల్స్‌ను నిర్వహించనుంది. ఇందులో భాగంగా పలు స్మార్ట్ ఫోన్‌లపై భారీగా డిస్కౌంట్‌ లభించనుంది. ఇదిలా ఉంటే సెప్టెంబర్‌ 23 రోజునే మరో ఆన్‌లైన్‌ సంస్థ అమెజాన్‌ కూడా ‘గ్రేట్‌ ఇండియన్‌ సేల్‌’ పేరుతో సేల్‌ను ప్రారంభించనున్న విషయం తెలిసిందే.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us