Find Fake Sim Card: మీ పేరుపై ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయో తెలుసుకోవాల‌నుకుంటున్నారా? ఈ టెక్నిక్ ట్రై చేయండి..

|

May 27, 2021 | 8:12 PM

Find Fake Sim Card: మారుతోన్న కాలానికి అనుగుణంగా నేరాలు కూడా మారుతున్నాయి. పెరిగిన సాంకేతిక‌తో పాటు నేరాల తీరు కూడా మారిపోయింది. ఇంట‌ర్నెట్ వినియోగం పెరిగిన‌ప్ప‌టి నుంచి సైబ‌ర్ నేరాలు...

Find Fake Sim Card: మీ పేరుపై ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయో తెలుసుకోవాల‌నుకుంటున్నారా? ఈ టెక్నిక్ ట్రై చేయండి..
Fake Sim Cards
Follow us on

Find Fake Sim Card: మారుతోన్న కాలానికి అనుగుణంగా నేరాలు కూడా మారుతున్నాయి. పెరిగిన సాంకేతిక‌తో పాటు నేరాల తీరు కూడా మారిపోయింది. ఇంట‌ర్నెట్ వినియోగం పెరిగిన‌ప్ప‌టి నుంచి సైబ‌ర్ నేరాలు ఎక్కువ‌వుతున్నాయి. ప్ర‌స్తుతం రోజుల్లో ప్ర‌తీ ప‌నికి ఆధార్ కార్డును ఉప‌యోగిస్తున్నాం. మ‌రి మ‌న ఆధార్‌ను ఎవ‌రైనా ఉప‌యోగించుకొని సిమ్ కార్డ్ తీసుకుంటే ఎలా.? ఇలా తీసుకున్న సిమ్ కార్డును ఏదైనా అసాంఘిక‌ కార్య‌క్ర‌మానికి ఉప‌యోగిస్తే మీరు ఇరుక్కునే అవ‌కాశం ఉంటుంది. ఈ తరుణంలో మీ ఐడీపై ఎవ‌రైనా సిమ్ కార్డ్ తీసుకున్నారో తెలుసుకోవాల‌నుకుంటున్నారా. మీ పేరుపై ఎన్ని సిమ్‌కార్డులు ఉన్నాయో తెలుసుకోవ‌డానికి కేంద్ర టెలికాం సంస్థ ఒక ఆప్ష‌న్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. కొన్ని సింపుల్ స్టెప్స్‌తో మీ పేరుపై ఏవైనా ఫేక్ సిమ్స్ ఉన్నాయో ఇలా చెక్ చేసుకోండి..

* ఇందుకోసం ముందుంగా https://tafcop.dgtelecom.gov.in/ వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి.

* అనంత‌రం ఓపెన్ అయిన పేజీలో మీ మొబైల్ నెంబ‌ర్ ఎంట‌ర్ చేయండి అనే బాక్స్ ఉంటుంది.

* మొబైల్ నెంబ‌ర్ ఎంట‌ర్ చేసిన గెట్ ఓటీపీ అనే ఆప్ష‌న్‌పై క్లిక్ చేయాలి.

* మొబైల్‌కు వ‌చ్చిన ఓటీపీని ఎంట‌ర్ చేయ‌గానే మీ పేరు మీద యాక్టివ్‌గా ఉన్న మొబైల్ నెంబ‌ర్లు క‌నిపిస్తాయి.

* స‌ద‌రు నెంబ‌ర్ల‌లో మీకు అవ‌స‌రం లేకపోయినా, తెలియ‌ని నెంబ‌ర్ ఏదైనా ఉన్నా.. దానిపై క్లిక్ చేసి నెంబ‌ర్ బ్లాక్ చేయాలి.

* ఇలా చేయగానే మీ మొబైల్ నెంబ‌ర్‌కు రిక్వెస్ట్ ఐడీ వెళుతుంది.

* రిక్వెస్ట్‌ను ట్రాక్ చేసుకోవ‌డానికి భ‌విష్య‌త్తులో ఈ ఐడీ ఉయోగ‌ప‌డుతుంది.

Also Read: ఒడిశాలో పుట్టిన బిడ్డలకు ఇప్పుడు ఆ పేరు ట్రెండింగ్…ఏం పేరో తెలుసా?

TS Inter Exams: ఇంటర్ పరీక్షల నిర్వహణపై కేంద్రానికి లేఖ రాసిన తెలంగాణ సర్కార్.. పరీక్ష విధానంలో కీలక మార్పులు..!

Hyderabad Mayor: హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఆసక్మిక తనిఖీలు నిర్వహించిన మేయర్ విజయ లక్ష్మి.. పారిశుద్ధ్యం, నాళాలు పరిశీలన..