పాత కెమెరా, Claude AIతో అద్భుతం.. 9 రోజుల్లో తయారైన AI రాడార్‌కు 3.17 లక్షల డాలర్ల డీల్!

AI Speed Radar: చైనాకు చెందిన 20 ఏళ్ల విద్యార్థి లీ హావో ఝంగ్ వీ కేవలం 9 రోజుల్లో, సుమారు $20 ఖర్చుతో Claude AI సహాయంతో AI స్పీడ్ రాడార్ వ్యవస్థను రూపొందించాడు. ట్రాఫిక్‌ను ఆటోమేటిక్‌గా పర్యవేక్షించి, నంబర్ ప్లేట్లను గుర్తించి చలాన్లు పంపగల ఈ వ్యవస్థను స్థానిక అధికారులు ఏకంగా $3,17,000కు కొనుగోలు చేయడం టెక్ ప్రపంచంలో సంచలనంగా మారింది.

పాత కెమెరా, Claude AIతో అద్భుతం.. 9 రోజుల్లో తయారైన AI రాడార్‌కు 3.17 లక్షల డాలర్ల డీల్!
AI Speed Radar

Edited By:

Updated on: Jul 28, 2026 | 6:17 PM

చైనాకు చెందిన 20 ఏళ్ల విద్యార్థి లీ హావో ఝంగ్ వీ (Li Hao Zhang Wei) ఏఐ టెక్నాలజీతో అద్భుతం సృష్టించాడు. కేవలం 9 రోజుల్లో, దాదాపు 20 డాలర్ల అతి తక్కువ ఖర్చుతో ఏఐ స్పీడ్ రాడార్ వ్యవస్థను అభివృద్ధి చేసి ఏకంగా 3,17,000 డాలర్లకు విక్రయించాడు. తన ఇంట్లో ఉన్న ఒక పాత కెమెరా, క్లాడ్ (Claude) ఏఐ మోడల్ సాయంతో రూపొందించిన ఈ వినూత్న ఆవిష్కరణ ఇప్పుడు టెక్ ప్రపంచంలో సంచలనంగా మారింది. ట్రాఫిక్ నిర్వహణ, అతివేగం నియంత్రణ కోసం ప్రభుత్వాలు కోట్లు ఖర్చు చేస్తుంటాయి. కానీ ఈ యువకుడు ఎంతో సులభంగా, అత్యంత చౌకైన, సమర్థవంతమైన రాడార్ వ్యవస్థను తీర్చిదిద్దాడు. దీనికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోడవడంతో మనుషుల అవసరం లేకుండానే ఇది పనిచేస్తుంది. క్లాడ్ (Claude) ఏఐ ఏపీఐ (API) కాల్స్ వినియోగం ద్వారా ఈ ప్రాజెక్టును కేవలం 20 డాలర్ల బడ్జెట్‌లోనే పూర్తి చేయడం గమనార్హం.

ఈ ఏఐ స్పీడ్ రాడార్ వ్యవస్థ రియల్ టైమ్‌లో ట్రాఫిక్‌ను నిశితంగా గమనిస్తుంది. రోడ్లపై పరిమితికి మించి అతివేగంగా వెళ్లే వాహనాలను కచ్చితంగా గుర్తిస్తుంది. క్షణాల్లో వాటి నంబర్ ప్లేట్లను స్కాన్ చేస్తుంది. అంతేకాకుండా, పక్కా సాక్ష్యంగా వీడియోలను రికార్డ్ చేసి సిస్టమ్‌లో భద్రపరుస్తుంది. ఎలాంటి హ్యూమన్ ఆపరేటర్ ప్రమేయం లేకుండానే నేరుగా వాహనదారులకు ఆటోమెటిక్‌గా ఫైన్లు (చలాన్లు) పంపుతుంది. ప్రాజెక్టు పూర్తి చేసిన తర్వాత, ఈ కుర్రాడు నేరుగా స్థానిక సిటీ డిస్ట్రిక్ట్ అధికారులను సంప్రదించాడు. ఈ ఏఐ సిస్టమ్ పనితీరును వారికి ప్రదర్శించాడు. దీని ఖచ్చితత్వం, నిర్వహణ వ్యయం దాదాపు శూన్యం కావడాన్ని గమనించిన అధికారులు తక్షణమే స్పందించారు. ఈ ప్రాజెక్టును ఏకంగా 3,17,000 డాలర్ల భారీ ధరకు కొనుగోలు చేశారు. ఈ సంఘటన ఏఐ టెక్నాలజీ సామాన్యుల చేతిలో ఎంతటి అద్భుతాలు చేయగలదో మరోసారి నిరూపించింది.

భారీ బడ్జెట్, పెద్ద పెద్ద సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ టీమ్‌లు అవసరం లేకుండానే.. సరైన నైపుణ్యం ఉంటే కోట్లు విలువ చేసే వ్యవస్థలను నిర్మించవచ్చని ఈ యువకుడు నిరూపించాడు. భవిష్యత్తులో ప్రభుత్వాలు సైతం భారీ టెండర్లకు బదులు ఇలాంటి స్వదేశీ, ఏఐ ఆధారిత సిస్టమ్స్ వైపు మొగ్గుచూపే అవకాశం ఉంది.

నిపుణుల అభిప్రాయం ప్రకారం, క్లాడ్ (Claude), లాంటి లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ (LLMs) డెవలపర్ల పనితీరును సమూలంగా మార్చేశాయి. గంటల తరబడి కోడింగ్ రాయాల్సిన అవసరం లేకుండా లాజిక్ ద్వారా సమస్యలను పరిష్కరించే దశకు మనం చేరుకున్నాం. ఏఐ సహాయంతో ఒక సాధారణ విద్యార్థి కూడా గ్లోబల్ టెక్ కంపెనీలకు దీటుగా ప్రోడక్ట్‌లను తయారు చేయగలగడం ఏఐ విప్లవానికి ప్రత్యక్ష నిదర్శనం.

టెక్నాలజీ అనేది కేవలం పెద్ద బహుళజాతి కంపెనీల సొత్తు కాదని, సరైన ఆలోచన ఉంటే సామాన్యుడు కూడా సంచలనాలు సృష్టించవచ్చని ఈ సంఘటన స్పష్టం చేస్తోంది. మరి మన దేశంలోనూ ఇలాంటి ఏఐ ఆవిష్కరణలను ప్రోత్సహించే దిశగా ప్రభుత్వాలు అడుగులు వేస్తాయా?.

Loading...
Unable to load recommendations.
Follow Us