త్వరలో హైదరాబాద్‌కు బుల్లెట్ ట్రైన్..!

| Edited By:

Jun 11, 2019 | 10:23 AM

అభివృద్ధిలో దూసుకెళ్తున్న హైదరాబాద్‌కు త్వరలోనే బుల్లెట్ ట్రైన్ వచ్చే అవకాశముంది. హైదరాబాద్‌తో పాటు ఢిల్లీ, చెన్నై, బెంగళూరు, కోల్‌కత్తా నగరాల్లో కూతపెట్టే ఛాన్స్ ఉంది. ముందుగా ముంబై-అహ్మదాబాద్‌లో ఈ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టును చేపట్టిన జేఆర్ సెంట్రల్ సంస్థ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. ఈ ఐదు నగరాల్లో బుల్లెట్ ట్రైన్ ఏర్పాటుకు ఆలోచిస్తున్నామని, చర్చలింకా మొదలవ్వలేదని పేర్కొంది. కాగా.. ముంబై-అహ్మాదాబాద్ మ‌ధ్య మొత్తం 12 స్టేష‌న్లు ఉంటాయి. మ‌హారాష్ట్రలో 155 కిలోమీట‌ర్లు, గుజ‌రాత్‌లో 350 కిలోమీట‌ర్ల […]

త్వరలో హైదరాబాద్‌కు బుల్లెట్ ట్రైన్..!
Follow us on

అభివృద్ధిలో దూసుకెళ్తున్న హైదరాబాద్‌కు త్వరలోనే బుల్లెట్ ట్రైన్ వచ్చే అవకాశముంది. హైదరాబాద్‌తో పాటు ఢిల్లీ, చెన్నై, బెంగళూరు, కోల్‌కత్తా నగరాల్లో కూతపెట్టే ఛాన్స్ ఉంది. ముందుగా ముంబై-అహ్మదాబాద్‌లో ఈ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టును చేపట్టిన జేఆర్ సెంట్రల్ సంస్థ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. ఈ ఐదు నగరాల్లో బుల్లెట్ ట్రైన్ ఏర్పాటుకు ఆలోచిస్తున్నామని, చర్చలింకా మొదలవ్వలేదని పేర్కొంది. కాగా.. ముంబై-అహ్మాదాబాద్ మ‌ధ్య మొత్తం 12 స్టేష‌న్లు ఉంటాయి. మ‌హారాష్ట్రలో 155 కిలోమీట‌ర్లు, గుజ‌రాత్‌లో 350 కిలోమీట‌ర్ల మేర హై స్పీడ్ ట్రాక్ ఉంటుంది. ఈ ప్రాజెక్టులో భాగంగా 21 కిలోమీట‌ర్ల మేర ట‌న్నెల్స్ కూడా ఉంటాయి.