AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సింగర్​ కాకపోయినా సూపర్‌‌గా పాడేయవచ్చు! అదిరిపోయే ఫీచర్‌‌తో బోట్‌ కొత్త స్పీకర్‌‌

boAt PartyPal 390 Plus Party Speaker Price and Features: Auto-Tuner, Wireless Mic, Powerful Bass, LED Lights and Multiple Connectivity Options ఇంట్లో చిన్న పార్టీ అయినా, స్నేహితులతో భారీ గెట్-టు-గెదర్ అయినా మ్యూజిక్ ఉంటేనే అసలైన సందడి మొదలవుతుంది. ఈ అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని boAt కొత్త పార్టీ స్పీకర్‌ను తీసుకొచ్చింది. PartyPal 390 Plus పేరుతో వచ్చిన ఈ స్పీకర్‌లో పవర్‌ఫుల్ సౌండ్‌తో పాటు పాటలు పాడేవారిని ఆకట్టుకునే ప్రత్యేక Auto-Tuner ఫీచర్‌ను అందించారు.

సింగర్​ కాకపోయినా సూపర్‌‌గా పాడేయవచ్చు! అదిరిపోయే ఫీచర్‌‌తో బోట్‌ కొత్త స్పీకర్‌‌
Boat Partypal 390 Plus Party Speaker
Nikhil
|

Updated on: Sep 13, 2026 | 8:50 PM

Share

పాటలు పాడటం ఇష్టమే కానీ గొంతు, ట్యూన్ విషయంలో కాస్త భయపడేవారికి boAt కొత్త గ్యాడ్జెట్ ఆసక్తికరంగా మారనుంది. సాధారణ పార్టీ స్పీకర్లకు భిన్నంగా ఇందులో పాడే సమయంలో వాయిస్‌ను మెరుగ్గా వినిపించే Auto-Tuner టెక్నాలజీ ఉంది. LED లైట్స్, వైర్‌లెస్ మైక్, భారీ బేస్ వంటి ఫీచర్లు పార్టీ మూడ్‌ను మరింత పెంచుతాయి.

LED లైట్స్‌తో అదిరిపోయే డిజైన్!

boAt PartyPal 390 Plusను పెద్ద రూమ్‌లు, హాళ్లు, అవుట్‌డోర్ పార్టీలకు అనువుగా రూపొందించారు. స్టైలిష్ డిజైన్‌తో కనిపించే ఈ స్పీకర్ చుట్టూ Dynamic LED Lights ఉంటాయి. మ్యూజిక్ బీట్స్‌కు అనుగుణంగా లైటింగ్ మారుతూ ఉండటంతో పార్టీ వాతావరణాన్ని మరింత ఉత్సాహంగా మార్చేలా పనిచేస్తాయి.

సౌండ్ విషయానికి వస్తే పవర్‌ఫుల్ బేస్, క్రిస్టల్ క్లియర్ ఆడియోను అందించేలా స్పీకర్‌ను రూపొందించారు. ముఖ్యంగా Deep Bassను ఇష్టపడేవారికి ఇది ఆకట్టుకునేలా ఉంటుంది. పెద్ద హాల్‌లోనూ మ్యూజిక్ స్పష్టంగా వినిపించేలా దీని ఆడియో అవుట్‌పుట్‌ను తీర్చిదిద్దారు. అయితే ఈ స్పీకర్‌లో అసలు హైలైట్ మాత్రం Kacche Auto-Tuner. యూజర్ పాట పాడుతున్నప్పుడు వాయిస్‌లో ఉండే కొన్ని లోపాలను ఆటోమేటిక్‌గా సరిచేసి మెరుగ్గా వినిపించేలా ఈ టెక్నాలజీ పనిచేస్తుందని కంపెనీ చెబుతోంది.

కనెక్టివిటీకి కొదవే లేదు!

PartyPal 390 Plusలో Wireless Mic Support కూడా ఉంది. దీంతో స్నేహితులతో కలిసి కరాకే తరహాలో పాటలు పాడుకోవచ్చు. Voice Effects మార్చుకునేందుకు ప్రత్యేక కంట్రోల్స్ కూడా అందించారు. స్మార్ట్‌ఫోన్, ట్యాబ్లెట్, ల్యాప్‌టాప్ వంటి పరికరాలను కనెక్ట్ చేసుకునేందుకు Bluetooth Connectivity సపోర్ట్ ఉంది.

Bluetoothతో పాటు USB Drive, AUX Cable, Micro SD Card వంటి ఆప్షన్లు కూడా ఉన్నాయి. FM Radio ఫీచర్‌ను సైతం అందించారు. బ్యాటరీ పరంగా ఒకసారి ఛార్జ్ చేస్తే సుదీర్ఘ సమయం మ్యూజిక్ ప్లేబ్యాక్ అందించేలా రూపొందించారు. Fast Charging Support కారణంగా తక్కువ సమయంలోనే ఛార్జింగ్ పూర్తి చేసుకోవచ్చు.

భారత మార్కెట్లో దీని అంచనా ధర సుమారు రూ.8,999 నుంచి రూ.10,999 వరకు ఉండొచ్చని సమాచారం. ఈ ధరలో Kacche Auto-Tuner, Wireless Mic, Powerful Bass వంటి ఫీచర్లు అందిస్తుండటంతో వీకెండ్ పార్టీలు, పుట్టినరోజు వేడుకలు, హోమ్ ఎంటర్‌టైన్‌మెంట్ కోసం చూస్తున్న యువతకు ఇది ఆసక్తికరమైన ఎంపికగా మారనుంది.

Follow Us