AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అరచేతిలో ఆరోగ్య రహస్యాలు.. Apple కొత్త వాచ్‌లో ఈ ఫీచర్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే

Apple Watch Series 12.. స్మార్ట్‌వాచ్ కేవలం సమయం చూసుకునే డివైజ్‌గా కాకుండా ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షించే గ్యాజెట్‌గా మారిపోయింది. ఈ ట్రెండ్‌కు మరింత ఊతమిస్తూ Apple కొత్త Apple Watch Series 12ను తీసుకొచ్చింది. శక్తివంతమైన S11 చిప్, అడ్వాన్స్‌డ్ హెల్త్ సెన్సార్లు, AI సపోర్ట్ వంటి ఫీచర్లతో ఈ ప్రీమియం స్మార్ట్‌వాచ్ టెక్ ప్రియుల దృష్టిని ఆకర్షిస్తోంది.

అరచేతిలో ఆరోగ్య రహస్యాలు.. Apple కొత్త వాచ్‌లో ఈ ఫీచర్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే
Apple Watch Series 12
Nikhil
|

Updated on: Sep 12, 2026 | 8:50 PM

Share

ఆరోగ్యానికి సంబంధించిన కీలక సమాచారాన్ని మణికట్టుపైనే తెలుసుకోవాలనుకునే వారికి Apple Watch Series 12 ఆసక్తికరమైన గ్యాజెట్‌గా నిలవనుంది. Apple ఈ కొత్త వాచ్‌లో ప్రాసెసింగ్ సామర్థ్యంతో పాటు హెల్త్ ట్రాకింగ్ టెక్నాలజీని మరింత మెరుగుపరిచినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా హార్ట్ రేట్ మానిటరింగ్, రికవరీ అంచనా వంటి ఫీచర్లు ఈ వాచ్‌కు ప్రత్యేక గుర్తింపును తీసుకొస్తున్నాయి.

S11 చిప్.. ఆరోగ్యంపై మరింత నిఘా

Apple Watch Series 12లో అత్యాధునిక S11 చిప్‌ను ఉపయోగించినట్టు సమాచారం. ఇది వాచ్ పనితీరును వేగవంతం చేయడంతో పాటు మెరుగైన బ్యాటరీ సామర్థ్యాన్ని అందించడంలో కీలక పాత్ర పోషించనుంది. Siri వంటి ఫీచర్లతో పాటు AI ఆధారిత సామర్థ్యాలు మరింత వేగంగా పనిచేసే అవకాశం ఉంది.

హెల్త్ ట్రాకింగ్ విషయంలోనూ Apple ప్రత్యేక దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. Apple Watch Series 12లోని కొత్త హెల్త్ సెన్సింగ్ సిస్టమ్ హార్ట్ రేట్‌ను నిరంతరం పర్యవేక్షించడంతో పాటు మరింత కచ్చితమైన రీడింగ్స్ అందించేలా రూపొందించినట్టు సమాచారం. శరీరం రికవరీ అవుతున్న తీరును అంచనా వేసి Readiness Score అందించే ఫీచర్ కూడా ఇందులో ఉన్నట్టు తెలుస్తోంది. రోజువారీ ఆరోగ్య పరిస్థితిపై అవగాహన పెంచుకోవాలనుకునే వారికి ఇది ఉపయోగకరంగా ఉండనుంది.

సిరామిక్ డిజైన్.. ధర ఎంతంటే?

డిజైన్ విషయంలో Apple Watch Series 12 గత మోడళ్లకు దగ్గరగా ఉన్నప్పటికీ, కొత్త మెటీరియల్ ఆప్షన్లతో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. అల్యూమినియం, టైటానియం వేరియంట్లతో పాటు Pearl White, Night Blue రంగుల్లో సిరామిక్ కేస్ ఆప్షన్‌ను కూడా అందిస్తున్నట్టు సమాచారం. దీంతో ప్రీమియం లుక్ కోరుకునే వినియోగదారులకు మరిన్ని ఎంపికలు లభించనున్నాయి.

ధర విషయానికి వస్తే Apple Watch Series 12 ప్రారంభ ధర సుమారు $399గా ఉండొచ్చని అంచనా. భారత మార్కెట్లో ఇది దాదాపు రూ.56,900కు సమానంగా ఉంటుంది. సెప్టెంబర్ 18 నుంచి విక్రయాలు ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్టు సమాచారం. అయితే భారత మార్కెట్లో తుది ధర, లభ్యత వంటి వివరాలపై Apple అధికారిక ప్రకటనతోనే స్పష్టత రానుంది.

Follow Us