AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

యాపిల్‌ లవర్స్‌కు అదిరిపోయే సర్‌‌ప్రైజ్! ఫస్ట్‌ ఫోల్డబుల్‌ ఐఫోన్‌ Duo ధర తెలిస్తే షాకవుతారు

Apple iPhone Duo Foldable Phone.. ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో ఇప్పటివరకు శాంసంగ్ వంటి బ్రాండ్లదే ఆధిపత్యం కనిపించింది. అయితే ఇప్పుడు యాపిల్ కూడా ఈ సెగ్మెంట్‌లోకి అడుగుపెట్టినట్లు సమాచారం. iPhone Duo పేరుతో వచ్చిన ఈ బుక్‌స్టైల్ ఫోన్ ప్రీమియం డిజైన్, భారీ ఫోల్డింగ్ స్క్రీన్, పవర్‌ఫుల్ చిప్‌తో టెక్ ప్రపంచంలో ఆసక్తిని పెంచుతోంది.

యాపిల్‌ లవర్స్‌కు అదిరిపోయే సర్‌‌ప్రైజ్! ఫస్ట్‌ ఫోల్డబుల్‌ ఐఫోన్‌ Duo ధర తెలిస్తే షాకవుతారు
Apple Iphone Duo Foldable Phone
Nikhil
|

Updated on: Sep 13, 2026 | 8:50 PM

Share

ఐఫోన్ అంటేనే ప్రీమియం డిజైన్, అధునాతన టెక్నాలజీ గుర్తుకొస్తాయి. ఇప్పుడు ఆ అనుభూతికి ఫోల్డబుల్ డిజైన్ కూడా జతకానుంది. iPhone Duoలో పెద్ద ఫోల్డింగ్ డిస్‌ప్లే, A20 Pro చిప్, అధునాతన కెమెరాలు, Apple Intelligence ఫీచర్లు ఉన్నాయి. అయితే వీటి కంటే ఎక్కువగా దీని ధరే ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

టైటానియం ఫ్రేమ్..

iPhone Duo బుక్‌స్టైల్ డిజైన్‌తో వస్తోంది. ఫోన్ వెలుపల 5.4 అంగుళాల డిస్‌ప్లేను అందించారు. పరికరాన్ని విప్పితే ఏకంగా 7.6 అంగుళాల Super Retina XDR ఫోల్డింగ్ స్క్రీన్ కనిపిస్తుంది. Nano-texture finish, ProMotion technology కారణంగా వీడియోలు, గేమింగ్ సమయంలో స్మూత్ విజువల్ అనుభూతి లభించేలా రూపొందించారు. టైటానియం ఫ్రేమ్ ఫోన్‌కు ప్రీమియం లుక్‌తో పాటు బలాన్ని అందిస్తుంది.

పనితీరు కోసం ఇందులో A20 Pro చిప్‌సెట్‌ను ఉపయోగించారు. ఆరు కోర్ల CPU, ఏడు కోర్ల GPUతో పాటు డ్యూయల్ 16-కోర్ Neural Engine ఇందులో ఉంది. భారీ యాప్స్, గేమ్స్‌ను వేగంగా నిర్వహించేలా ఈ ప్రాసెసర్‌ను రూపొందించారు. కెమెరా విభాగంలో వెనుక భాగంలో 48MP కెమెరాలు రెండింటిని అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 12MP కెమెరా ఉంది. Apple Intelligence, Siri AI ఫీచర్లు కూడా ఇందులో భాగంగా ఉన్నాయి.

ధర మాత్రం భారీ షాక్!

ఫోల్డబుల్ ఫోన్లలో బ్యాటరీ బ్యాకప్‌పై ఉండే సందేహాలకు iPhone Duo సమాధానం ఇచ్చేలా కనిపిస్తోంది. బయటి స్క్రీన్‌తో 44 గంటల వరకు, లోపలి స్క్రీన్‌తో 31 గంటల వరకు వీడియో ప్లేబ్యాక్ లభిస్తుందని సమాచారం. దీంతో సాధారణ వినియోగంలో రోజంతా బ్యాటరీ గురించి ఆందోళన తగ్గే అవకాశం ఉంది.

అయితే ఈ ఫోన్‌ను సొంతం చేసుకోవాలంటే భారీ మొత్తాన్ని ఖర్చు చేయాల్సిందే. 256GB బేసిక్ మోడల్ ధర రూ.2,99,900గా ఉండగా, 2TB టాప్ మోడల్ ధర రూ.4,49,900 వరకు ఉంది. Star White, Night Sky రంగుల్లో లభించనుంది. అక్టోబర్ 16 నుంచి ప్రీ ఆర్డర్లు ప్రారంభం కాగా, అక్టోబర్ 23 నుంచి అధికారిక సేల్ మొదలవుతుందని సమాచారం. ఫోల్డబుల్ iPhone కోసం ఎదురుచూస్తున్న వారికి ఇది ఖరీదైనప్పటికీ ప్రత్యేకమైన ఆప్షన్‌గా నిలవనుంది.

Follow Us