Nothing Phone 1: నథింగ్‌ ఫోన్‌పై ఊహకందని ఆఫర్‌.. రూ. 5 వేలకే సొంతం చేసుకునే అవకాశం.

|

Jan 31, 2023 | 7:21 PM

ఈకామర్స్‌ సైట్స్‌ ఇటీవల భారీగా ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ముఖ్యంగా స్మార్ట్‌ ఫోన్‌ల విషయంలో భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. పాత ఫోన్‌లను ఎక్స్చేంజ్‌ చేసుకోవడం ద్వారా కొత్త ఫోన్‌లపై డిస్కౌంట్స్‌ను అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా ప్రముఖ స్మార్ట్‌ ఫోన్‌ దిగ్గజం నథింగ్ మంచి ఆఫర్‌ను అందుస్తోంది...

Nothing Phone 1: నథింగ్‌ ఫోన్‌పై ఊహకందని ఆఫర్‌.. రూ. 5 వేలకే సొంతం చేసుకునే అవకాశం.
Nothing Phone 1
Follow us on

ఈకామర్స్‌ సైట్స్‌ ఇటీవల భారీగా ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ముఖ్యంగా స్మార్ట్‌ ఫోన్‌ల విషయంలో భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. పాత ఫోన్‌లను ఎక్స్చేంజ్‌ చేసుకోవడం ద్వారా కొత్త ఫోన్‌లపై డిస్కౌంట్స్‌ను అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా ప్రముఖ స్మార్ట్‌ ఫోన్‌ దిగ్గజం నథింగ్ మంచి ఆఫర్‌ను అందుస్తోంది. అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌లో ప్రత్యేకమైన డిస్కౌంట్‌ను అందిస్తోంది.

అమెజాన్‌లో నథింగ్‌ ఫోన్‌ (1) ప్రారంభ ధర రూ. 28,999గా ఉంది. అయితే ఆఫర్‌లో భాగంగా పాత ఫోన్‌ను ఎంక్సేంజ్‌ చేయడం ద్వారా గరిష్టంగా రూ. 25000 వరకు డిస్కౌంట్‌ను పొందొచ్చు. అలాగే వీటితో పాటు కొనుగోలు చేసే సమయంలో పలు బ్యాంకులపై అదనంగా డిస్కౌంట్‌ పొందొచ్చు. ఇక ఫ్లిప్‌కార్ట్ విషయానికొస్తే ఇందులో నథింగ్ ఫోన్‌ (1) బేస్‌ ధర రూ. 26,749గా ఉంది. ఎక్స్జేంజ్‌లో భాగంగా గరిష్టంగా రూ. 21,400 డిస్కౌంట్‌ పొందొచ్చు. వీటితో పాటు కొటక్‌, ఫ్లిప్‌కార్ట్‌, యాక్సిస్‌ వంటి కార్డులపై అదనంగా డిస్కౌంట్‌ పొందొచ్చు. ఈ లెక్కన అన్ని ఆఫర్లు కలుపుకొని ఈ ఫోన్‌ను రూ. 5 వేలలోపే సొంతం చేసుకోవచ్చు.

నథింగ్‌ ఫోన్‌ (1) ఫీచర్లు..

ఇక ఈ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో.. 6.55 ఇంచెస్‌ ఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. 1080 x 2400 పిక్సెల్స్‌ ఈ డిస్‌ప్లే సొంతం. ఆండ్రాయిడ్‌ 12 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేసే ఈ స్మార్ట్‌ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్‌ రెయిర్‌ కెమెరాతో పాటు, 16 మెగాపిక్సెల్‌ ఫ్రంట్‌ కెమెరాను అందించారు. 128 జీబీ స్టోరేజ్‌ + 8 జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్‌ + 12 జీబీ ర్యామ్‌ వేరియంట్స్‌లో ఈ ఫోన్‌ను తీసుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..