Iphone 14: ఐఫోన్‌ లవర్స్‌ ఊపిరిపీల్చుకోండి.. మీ ఎదురు చూపులకు ఫుల్‌స్టాప్‌ పడ్డట్లే.. ఐఫోన్‌ 14 వచ్చేది ఎప్పుడంటే..

|

Aug 11, 2022 | 4:10 PM

Iphone 14: యాపిల్‌.. ఈ బ్రాండ్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రేజ్‌ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా ఈ బ్రాండ్‌ నుంచి వచ్చే ఐఫోన్‌లకు దేశాలకు అతీతంగా ఆదరణ ఉంటుంది. ఐఫోన్‌ కొత్త మోడల్‌ కోసం యాపిల్‌ లవర్స్‌ వేయి కళ్లతో ఎదురుచూస్తుంటారు...

Iphone 14: ఐఫోన్‌ లవర్స్‌ ఊపిరిపీల్చుకోండి.. మీ ఎదురు చూపులకు ఫుల్‌స్టాప్‌ పడ్డట్లే.. ఐఫోన్‌ 14 వచ్చేది ఎప్పుడంటే..
Follow us on

Iphone 14: యాపిల్‌.. ఈ బ్రాండ్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రేజ్‌ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా ఈ బ్రాండ్‌ నుంచి వచ్చే ఐఫోన్‌లకు దేశాలకు అతీతంగా ఆదరణ ఉంటుంది. ఐఫోన్‌ కొత్త మోడల్‌ కోసం యాపిల్‌ లవర్స్‌ వేయి కళ్లతో ఎదురుచూస్తుంటారు. ప్రతీ ఏటా కొత్త మోడల్‌ను విడుదల చేస్తుంటుంది యాపిల్‌. ఈ క్రమంలోనే తాగాజా ఐఫోన్‌ 14ను విడుదల చేసేందుకు రంగం సిద్ధమవుతోంది.

అయితే ఐఫోన్‌ 14 విడుదల ఆలస్యం కానుందని గత కొన్ని రోజులుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. చైనా, తైవాన్‌ల మధ్య నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఐఫోన్‌ 14 ఆలస్యంగా రానుందని పుకార్లు షికార్లు చేశాయి. దీనికి కారణం చైనాలో తయారయ్యే యాపిల్ ఫోన్లలో ఉపయోగించే చిప్స్‌ ఎక్కువ శాతం తైవాన్‌లో తయారు కావడమే.
అయితే తాజా సమాచారం ప్రకారం ఐఫోన్‌ 14 విడుదల వాయిదా పడడం లేదని అనుకున్న సమయానికే వచ్చేస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే నెలలోనే ప్రపంచవ్యాప్తంగా కొత్త ఫోన్‌ రిలీజ్‌ ఉండనున్నట్లు తెలుస్తోంది.

యాపిల్‌ ఈ సిరీస్‌లో భాగంగా ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్రొ, ఐఫోన్ 14 మ్యాక్స్, ఐఫోన్ 14 ప్రొ మ్యాక్స్ లాంచ్‌ చేయనున్నట్లు టాక్‌. సరిగ్గా చెప్పాల్సి సెప్టెంబర్‌ 6వ తేదీని ఐఫోన్‌ 14 లాంచ్‌ కానున్నట్లు ప్రముఖ టిప్‌స్టర్ మాక్స్ వైన్‌బాచ్ వెల్లడించారు. అయితే భారత్‌లో మాత్రం సెప్టెంబర్‌ 16 నుంచి అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే 14 సిరీస్‌తో పాటు యాపిల్‌ వాచ్‌ సిరీస్‌ 8ని కూడా లాంచ్‌ చేసే అవకాశాలున్నాయని టాక్‌. ఇదిలా ఉంటే ఐఫోన్‌ 14 ప్రారంభం ధర మన కరెన్సీలో రూ. 63,395 కాగా, 14 ప్రో రూ. 87,191, ప్రో మ్యాక్స్‌ ధర రూ. 95,131 ఉండనున్నట్లు సమాచారం.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..