ఏపీ సర్కార్‌కు చుక్కెదురు.. పంచాయితీ ఎన్నికలకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్

ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికలకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఏపీ సర్కార్‌కు చుక్కెదురు.. పంచాయితీ ఎన్నికలకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Jan 25, 2021 | 2:58 PM

supreme court on ap local body elections: ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికలకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌సు సుప్రీంకోర్టు కొట్టి వేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ సంఘాలు దాఖలు చేసిన పిటిషన్లను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు ధర్మాసనం.

జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ హృషికేశ్ రాయ్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం సోమవారం తీర్పు వెలువరించింది. ఎన్నికలు రాజ్యాంగ ప్రక్రియలో భాగమని, కరోనా ఉన్నప్పుడు ఎన్నికలు కావాలన్నారన్న విషయాన్ని గుర్తు చేశారు. ఈసీని తప్పుబడుతూ దురుద్దేశాలు ఆపాదిస్తున్నారని, ఎన్నికలు ప్రతీసారి వాయిదా పడుతున్నాయని జస్టిస్‌ కౌల్‌ పేర్కొన్నారు. ఉద్యోగ సంఘాలు చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయని పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా ఎన్నికలు జరగట్లేదా? అని ప్రశ్నించారు.

ఇదిలావుంటే.. పంచాయతీ ఎన్నికలు జరపాల్సిందే…వెనక్కి తగ్గేదిలేదంటూ రాష్ట్ర ఎన్నికల సంఘం అడుగులు వేసేస్తోంది. మరోవైపు ఎట్టిపరిస్థితుల్లో ఎన్నికలకు సిద్ధంగా లేదంటోంది రాష్ట్ర ప్రభుత్వం. హైకోర్టు గ్రీన్ సిగ్నల్ తో తొలి విడుత పంచాయతీ ఎన్నికలకు ఎస్ఈసీ నోటిఫికేషన్ ఇవ్వగా… ఏపీ ప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించింది. ప్రభుత్వ వాదనలు వినేముందు తమ వాదనలు కూడా విని తీర్పు ఇవ్వాలంటూ నిమ్మగడ్డ రమేశ్.. కేవియట్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఇవాళ తీర్పు వెలువరించింది.

Read Also… AP Local polls Live Updates : మెగా మండే లోకల్ ఎలక్షన్.. ఏపీలో ‘పంచాయతీ’కి లైన్ క్లియర్ అయ్యేనా..? సుప్రీంకోర్టులో తీర్పు ఎవరి వైపు..?