ఫేక్ న్యూస్ సర్క్యులేట్ చేస్తే జైలుశిక్ష..శ్రీలంక కొరడా

Fake news after easter attack, ఫేక్ న్యూస్ సర్క్యులేట్ చేస్తే జైలుశిక్ష..శ్రీలంక కొరడా

ఫేస్ బుక్, వాట్సాప్ , ట్విటర్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా ఫేక్ న్యూస్ ని స్ప్రెడ్ చేస్తే శ్రీలంకలో ఇక కఠిన శిక్షలే.. ఇలాంటి తప్పుడు సమాచారాన్ని సర్క్యులేట్ చేసిన పక్షంలో.. వారికి ఐదేళ్ల జైలుశిక్ష, రూ. 10 లక్షల జరిమానా విధించనున్నారు. ఆ మధ్య ఈస్టర్ పండుగ రోజున కొలంబోలో జరిగిన వరుస బాంబు దాడుల్లో అనేకమంది మరణించగా..పలువురు గాయపడ్డారు. దీంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇప్పటికైనా సోషల్ మీడియా ద్వారా తప్పుడు సమాచారం పంపేవారి పట్ల కఠిన చర్యలు తీసుకోవాలని సర్కార్ నిర్ణయించింది. తాజా శిక్షల తాలూకు ప్రతిపాదనను తాత్కాలిక న్యాయశాఖ మంత్రి ప్రవేశపెట్టగా దాన్ని మంత్రి మండలి ఆమోదించింది. కొత్త శిక్షలను అమలు చేసేందుకు పీనల్ కోడ్ ను సవరిస్తామని ప్రభుత్వం పేర్కొంది. ఏళ్ళ తరబడి జాతి విద్వేషాలు రగులుతున్న ఈ దేశంలో సామాజిక మాధ్యమాల ద్వారా ఇంకా తప్పుడు, ద్వేష పూరితమైన, రెచ్చగొట్టే సమాచారాన్ని సర్క్యులేట్ చేస్తున్నారన్న ఆరోపణలతో ప్రభుత్వం కళ్ళు తెరచింది. దేశ రాజధానిలో గత మార్చి నెలలో ముస్లిం వ్యతిరేక బృందాలు పెద్ద ఎత్తున హింసకు దిగడంతో సర్కార్ ఇంటర్నెట్ పై ఆంక్షలు విధించింది.దాన్ని బ్యాన్ చేసింది. కాగా-సింగపూర్ పార్లమెంటు కూడా ఫేక్ న్యూస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేయాలని నిర్ణయించి ఇలాంటివారికి 10 ఏళ్ళ జైలుశిక్ష విధించేందుకు ఉద్దేశించిన బిల్లును ఆమోదించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *