Babita Blessed With Babyboy: ఈ ఏడాది ఆరంభమే అదిరిందిగా.. క్రీడాకారుల జీవితంలోకి కొత్త వెలుగులు.. పండంటి బిడ్డకు జన్మనిచ్చిన బబిత ఫోగట్

ఈ ఏడాది ఆరంభమే క్రీడాకారుల జీవితంలో కొత్త వెలుగులు నింపుతుంది. వారి జీవితంలో మధుర క్షణాలను తీసుకొచ్చింది. రెజ్లర్ బబితా ఫోగట్. వివేక్ సుహాగ్ ల జీవితంలోకి కొత్త అతిథి విచ్చేశాడు. ఈ దంపతులు తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందారు. బబితా ఫోగట్, వివేక్ సుహాగ్..

Babita Blessed With Babyboy: ఈ ఏడాది ఆరంభమే అదిరిందిగా.. క్రీడాకారుల జీవితంలోకి కొత్త వెలుగులు.. పండంటి బిడ్డకు జన్మనిచ్చిన బబిత ఫోగట్

Updated on: Jan 12, 2021 | 11:09 AM

Babita Blessed With Babyboy: ఈ ఏడాది ఆరంభమే క్రీడాకారుల జీవితంలో కొత్త వెలుగులు నింపుతుంది. వారి జీవితంలో మధుర క్షణాలను తీసుకొచ్చింది. రెజ్లర్ బబితా ఫోగట్. వివేక్ సుహాగ్ ల జీవితంలోకి కొత్త అతిథి విచ్చేశాడు. ఈ దంపతులు తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందారు. బబితా ఫోగట్, వివేక్ సుహాగ్ దంపతులకు జనవరి 11 సోమవారం పడంటి బిడ్డకు జన్మనిచ్చారు. ఈ నేపథ్యంలో తమ సంతోషం అభిమానులతో పంచుకుంటూ మాకు పుత్రోత్సాహం కలిగింది . కలలు సహాకారం అయ్యాయి. నీలం రంగు దుస్తులతో మా ఆశయం కనిపిస్తోంది” అంటూ బబితా ఫోగట్ తన కుమారుడు,భర్తతో దిగిన ఫోటోలను ట్విట్టర్‌లో షెర్ చేసింది.

హర్యానా కు చెందిన బబితా కుమారి ప్రముఖ భారతీయ మహిళా కుస్తీ క్రీడాకారిణి. 2010 కామన్ వెల్త్ క్రీడల్లో రజత పతకం గెలుచుకున్నారు ఆమె. 2012 ప్రపంచ కుస్తీ చాంపియన్ షిప్ క్రీడల్లో కాంస్య పతకం, కామన్ వెల్త్ క్రీడల్లో బంగారు పతకం సాధించారు బబితా. కామన్ వెల్త్ క్రీడల్లో మొట్టమొదటిసారి బంగారు పతకం గెలిచిన మహిళా కుస్తీ క్రీడాకారిణి గీతా ఫోగట్ చెల్లెలు, మాజీ కుస్తీ క్రీడాకారుడు మహవీర్ సింగ్ ఫోగాట్ కుమార్తె. ఈ ఇద్దరు అక్కాచెల్లెళ్లు గ్రామంలో ఉన్న అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.

Also Read: కరోనా పాజిటివ్ తో థాయ్‌లాండ్‌ ఓపెన్‌ నుంచి భారత్ స్టార్ షట్లర్ ఔట్ 

 

Loading...
Unable to load recommendations.
Follow Us