టెస్టుల్లో కోహ్లీసేనకు మైనస్ అదేనా.?

|

Nov 17, 2019 | 5:36 PM

టీమిండియా… ప్రస్తుతం టెస్టుల్లో విధ్వంసకరమైన జట్టుల్లో ఒకటిగా అవతరించి.. అద్భుతమైన విజయాలు అందుకుంటోంది.  ప్రత్యర్ధులు ఎవరైనా భారత్ ముందు తలవంచాల్సిందే. విరాట్ కోహ్లీ ఎప్పుడైతే సారధ్య బాధ్యతలను చేపట్టాడో.. అప్పటి నుంచి జట్టు కూడా దూకుడుగానే ఉంటూ మిగతా జట్లన్నింటికి చమటలు పట్టిస్తోంది. ప్రస్తుతం భారత్- బంగ్లాదేశ్ మధ్య టెస్ట్ సిరీస్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇక తొలి టెస్ట్‌లో టీమిండియా ఇన్నింగ్స్ 130 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. అంతేకాకుండా మ్యాచ్ మొత్తం వన్ […]

టెస్టుల్లో కోహ్లీసేనకు మైనస్ అదేనా.?
Follow us on

టీమిండియా… ప్రస్తుతం టెస్టుల్లో విధ్వంసకరమైన జట్టుల్లో ఒకటిగా అవతరించి.. అద్భుతమైన విజయాలు అందుకుంటోంది.  ప్రత్యర్ధులు ఎవరైనా భారత్ ముందు తలవంచాల్సిందే. విరాట్ కోహ్లీ ఎప్పుడైతే సారధ్య బాధ్యతలను చేపట్టాడో.. అప్పటి నుంచి జట్టు కూడా దూకుడుగానే ఉంటూ మిగతా జట్లన్నింటికి చమటలు పట్టిస్తోంది.

ప్రస్తుతం భారత్- బంగ్లాదేశ్ మధ్య టెస్ట్ సిరీస్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇక తొలి టెస్ట్‌లో టీమిండియా ఇన్నింగ్స్ 130 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. అంతేకాకుండా మ్యాచ్ మొత్తం వన్ సైడెడ్‌గానే నడిచిందని చెప్పాలి. మొదట బ్యాటింగ్ దిగిన భారత్‌.. మయాంక్ అగర్వాల్(243)తో పాటుగా రహానే(86), పుజారా(54), జడేజా(60)లు చెలరేగిపోవడంతో భారీ స్కోర్‌ను సాధించింది. అటు బంగ్లాదేశ్ ఏమాత్రం పోటీ ఇవ్వకుండా పూర్తిగా చేతులెత్తేసిందని చెప్పాలి. ఇక ఇదంతా ఒక ఎత్తయితే.. కొందరి మనసులో మెదులుతున్న ఓ ప్రశ్న మాత్రం మరోసారి ఆసక్తికరమైన చర్చకు దారి తీస్తోంది.

 

 

 

 

టీమిండియా.. అద్భుతమైన టెస్ట్ జట్టేనా.. లేదా బలహీనమైన ప్రత్యర్ధులతో తలబడుతోందా..? అని కొంతమంది నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. మనం ఈ విషయాన్ని పరిశీలిస్తే.. టీమిండియాకి గతంలో కంటే.. ఇప్పుడు బలమైన ఓపెనింగ్ కాంబినేషన్ దొరికిందని చెప్పాలి. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మ ఒక వైపు ఉంటే.. మయాంక్ మరోవైపు నుంచి తనలోని అసాధారణమైన ప్రతిభను వెలికితీస్తున్నాడు. అంతేకాకుండా మిడిల్ ఆర్డర్‌లో పుజారా, విరాట్ కోహ్లీ, రహానే వంటి వారు ఎలాగో ఉన్నారు. టెస్టుల్లో ఆల్‌రౌండర్ ఖాతాను జడేజా పూర్తిగా భర్తీ చేశాడని చెప్పొచ్చు. బౌలింగ్ విషయానికి వస్తే.. ఇషాంత్, ఉమేష్, షమీ, అశ్విన్‌లతో బలమైన లైనప్ ఉంది.

 

ఒకప్పుడు ఇండియా ఓవర్సీస్ పిచ్‌ల్లో విజయాల కోసం వెంపర్లాడుతుండేది. కానీ ఇప్పుడు అంతా మారిపోయింది. కోహ్లీసేన టెస్టుల్లో అద్భుతమైన విజయాలు అందుకోవడమే కాకుండా ప్రత్యర్థులను భయపెడుతోంది. ఇప్పటివరకు టీమిండియా తలబడినది చిన్న జట్టులతో కావచ్చు. కానీ ఖచ్చితంగా ఈసారి ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ వంటి జట్లను కూడా వణికిస్తుందని చెప్పవచ్చు.

అయితే ఇంతటి భీకరమైన జట్టులో కూడా లోపం లేకపోలేదు. ఇప్పుడు సెంచరీల మీద సెంచరీలు కొడుతున్న ఓపెనర్లు.. విదేశీ పిచ్‌లపై ఎంతవరకు తమ ప్రతాపం చూపించగలరో చెప్పలేం. విరాట్ కోహ్లీ, రహానే, జడేజా, అశ్విన్ వంటి వారి అనుభవంతోనే జట్టు ముందుకు నడవాలి. అంతేకాకుండా గతంలో ఆస్ట్రేలియా మాదిరిగా టీమిండియాలో ప్లేయర్స్ సంవత్సరాల తరబడి జట్టులో ఉండలేరు. కాబట్టి అది కూడా పెద్ద మైనస్ అని చెప్పాలి.

ఆస్ట్రేలియా లెజెండ్ రికీ పాంటింగ్ సారధ్యంలో అప్పటి జట్టు అంతర్జాతీయ క్రికెట్‌లోనే భయంకరమైన జట్టుగా అవతరించింది. ఇది అందరికి తెలిసిన విషయమే. కోహ్లీ కూడా అదే ఫార్ములా పాటిస్తే.. ఖచ్చితంగా టీమిండియాకు కూడా ఎదురు ఉండదు.