ఆర్మీ సర్వీసు ముగిసింది.. ధోనీ ? మరి నెక్స్ట్ ఏంటి ?

టీమిండియా మాజీ కెప్టెన్ ఎం. ఎస్. ధోనీ ఆర్మీ సర్వీసు ముగిసింది. వెస్టిండీస్ పర్యటనలో కోహ్లీ జట్టుకు దూరంగా ఉన్న ఈ క్రికెటర్ సైనిక దళాల్లో తన విధులు ముగించుకున్నాడు. క్రికెట్ కు రెండు నెలలు బ్రేక్ ఇచ్చి.. జమ్మూ కాశ్మీర్ వెళ్లిన ధోనీ.. చటుక్కున జైపూర్ లో ప్రత్యక్షమయ్యాడు. కాశ్మీర్లో గౌరవప్రదమైన లెఫ్టినెంట్ కల్నల్ హోదాలో… టెరిటోరియల్ ఆర్మీలో సేవలందించి తిరిగి వచ్చాడు. గతవారమే ఇతని ‘ జవాన్ ‘ కెరీర్ పూర్తి కావడంతో మళ్ళీ […]

ఆర్మీ సర్వీసు ముగిసింది.. ధోనీ  ? మరి నెక్స్ట్ ఏంటి ?

Updated on: Aug 25, 2019 | 4:59 PM

టీమిండియా మాజీ కెప్టెన్ ఎం. ఎస్. ధోనీ ఆర్మీ సర్వీసు ముగిసింది. వెస్టిండీస్ పర్యటనలో కోహ్లీ జట్టుకు దూరంగా ఉన్న ఈ క్రికెటర్ సైనిక దళాల్లో తన విధులు ముగించుకున్నాడు. క్రికెట్ కు రెండు నెలలు బ్రేక్ ఇచ్చి.. జమ్మూ కాశ్మీర్ వెళ్లిన ధోనీ.. చటుక్కున జైపూర్ లో ప్రత్యక్షమయ్యాడు. కాశ్మీర్లో గౌరవప్రదమైన లెఫ్టినెంట్ కల్నల్ హోదాలో… టెరిటోరియల్ ఆర్మీలో సేవలందించి తిరిగి వచ్చాడు. గతవారమే ఇతని ‘ జవాన్ ‘ కెరీర్ పూర్తి కావడంతో మళ్ళీ నార్మల్ లైఫ్ తప్పదు మరి ! జైపూర్ లో న్యూ లుక్ లో కనబడిన ఇతని వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ధోనీ తదుపరి ‘ కార్యాచరణ ‘ పై అప్పుడే ఇతని అభిమానులు చర్చించుకుంటున్నారు. మరి.. తిరిగి క్రికెట్ బ్యాట్ ఝళిపిస్తాడా ? మరికొద్ది రోజుల్లో తేలనుంది.
https://twitter.com/DHONIism/status/1165210596171603968

Loading...
Unable to load recommendations.
Follow Us