FIFA World Cup 2022: స్టేడియంలో ఆ జట్టు ఫ్యాన్స్ చేసిన పనేంటో తెలిస్తే.. వారికి మీరు అభిమానులవుతారు

| Edited By: Ram Naramaneni

Nov 24, 2022 | 4:44 PM

ఖతర్ వేదికగా జరుగుతున్న ఫీఫా ప్రపంచకప్‌‌లో భాగంగా బుధవారం జర్మనీ, జపాన్ తలపడ్డాయి. ఈ ఫుట్‌బాల్ మ్యాచ్‌లో జర్మనీపై జపాన్ 12 తేడాతో విజయం సాధించింది. అది అందరికీ తెలిసినదే. అయితే మ్యాచ్ ముగిసిన తర్వాత..

FIFA World Cup 2022:  స్టేడియంలో ఆ జట్టు ఫ్యాన్స్ చేసిన పనేంటో తెలిస్తే.. వారికి మీరు అభిమానులవుతారు
The Jkapanese Fans
Follow us on

ఖతర్ వేదికగా జరుగుతున్న ఫీఫా ప్రపంచకప్‌‌లో భాగంగా బుధవారం జర్మనీ, జపాన్ తలపడ్డాయి. ఈ ఫుట్‌బాల్ మ్యాచ్‌లో జర్మనీపై జపాన్ 12 తేడాతో విజయం సాధించింది. అది అందరికీ తెలిసినదే. అయితే మ్యాచ్ ముగిసిన తర్వాత ఆ మైదానంలో జపాన్ అభిమానులు చేసిన ఓ పని అందరినీ ఆశ్యర్యపరిచింది. అంతేనా వారు చేసిన పనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో జర్మనీని షాక్‌కు గురిచేసేలా జపాన్ జట్టు విజయం సాధించింది. దీంతో జపాన్ అభిమానుల సంతోషానికి హద్దులు లేనంతగా  సంబరాలు జరుపుకున్నారు. కానీ ప్రతి సారీ మ్యాచ్ ముగిసిన తర్వాత వారు తప్పని సరిగా చేసే పనిని మరిచిపోలేదు.

అది ఏమిటంటే.. వారి కారణంగా పడిన చెత్తను సేకరించి, ఆ ప్రాంతాన్ని శుభ్రంగా తీర్చిదిద్దడం. ఖలీఫా ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో జర్మన్ జట్టును జపాన్ ఓడించింది. తర్వాత ‘బ్లూ బ్రిగేడ్’ అభిమానులు తాము కూర్చున్న స్థలాన్ని విడిచి వెళ్లేముందుగా చెత్తను సేకరించి..  చెత్త బ్యాగ్‌లలోకి తీసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఈ వీడియోలో.. జపాన్ అభిమానులు తమ ప్రదేశంలో చెత్తను సేకరించి సంచులలో వేయడాన్ని మనం చూడవచ్చు.

ఇవి కూడా చదవండి


నాలుగేళ్ల క్రితం రష్యాలో జరిగిన 2018 ప్రపంచకప్‌లో కూడా వారు ఇదే తరహాలో చెత్తను సేకరించారు. అప్పుడు బెల్జియంపై 3-2 తేడాతో జపాన్ పరాజయం పాలయింది. అప్పటికీ.. జపాన్ అభిమానులు వారి కారణంగా పడిన చెత్తను శుభ్రం చేయడం మర్చిపోకుండా ఆ ప్రాంతమంంతా శుభ్రపరిచారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..