Olympics 2021: అథ్లెట్‌ గొప్ప మనసు.. చిన్నారి చికిత్సకు ఒలింపిక్‌ మెడల్‌ వేలం..!

|

Aug 20, 2021 | 7:37 AM

Olympics 2021: ఎనిమిది నెలల చిన్నారి గుండె ఆపరేషన్‌ కోసం తాను గెలిచిన ఒలింపిక్‌ పతకాన్నే వేలానికి పెట్టింది ఓ అథ్లెట్‌. టోక్యో ఒలింపిక్స్‌లో తాను సాధించిన రజత పతకాన్ని

Olympics 2021: అథ్లెట్‌ గొప్ప మనసు.. చిన్నారి చికిత్సకు ఒలింపిక్‌ మెడల్‌ వేలం..!
Poland Olympian Maria
Follow us on

Olympics 2021: ఎనిమిది నెలల చిన్నారి గుండె ఆపరేషన్‌ కోసం తాను గెలిచిన ఒలింపిక్‌ పతకాన్నే వేలానికి పెట్టింది ఓ అథ్లెట్‌. టోక్యో ఒలింపిక్స్‌లో తాను సాధించిన రజత పతకాన్ని వేలానికి పెట్టి దాని ద్వారా వచ్చిన మొత్తంతో ఆ చిన్నారి వైద్యం చేయించేందుకు ముందుకువచ్చింది. ఇంతకీ ఆ అథ్లెట్‌ ఎవ్వరు..? ఇప్పుడు తెలుసుకుందాం.. పోలాండ్‌కు చెందిన మరియా అండ్రెజెక్‌ జావెలిన్‌ త్రోయర్‌ క్రీడాకారిణి. టోక్యో వేదికగా జరిగిన ఒలింపిక్స్‌లో పాల్గొంది. మన హీరో నీరజ్‌ చోప్రా స్వర్ణం సాధించిన క్రీడ జావెలిన్‌ త్రో మహిళల విభాగంలో 64.61 మీటర్ల దూరం విసిరి.. రెండో స్థానంలో నిలిచింది. రజత పతకం సొంతం చేసుకుంది. అయితే, ఇటీవల 8 నెలల వయసున్న మలీసా అనే పాప అరుదైన గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతోందని తెలుసుకున్న మరియా ఆవేదనకు లోనైంది.

ఆ పాప చికిత్సకు అవసరమైన ఖర్చును తాను పెట్టలేని స్థితిలో ఉండడంతో తన రజత పతకాన్ని వేలం పెట్టాలని నిర్ణయించుకుంది మరియా. ఈ మేరకు ఫేస్‌బుక్‌లో ఓ ప్రకటన విడుదల చేసింది. ఆన్‌లైన్‌‌లో ఆ మెడల్‌ను వేలం వేసింది. ఈ మెడల్‌ను సూపర్‌ మార్కెట్‌ దిగ్గజ సంస్థ జాబ్కా ఆ పతకాన్ని 1.25 లక్షల డాలర్లకు దక్కించుకుంది. అయితే బిడ్‌ గెలిచిన జాబ్కా.. డబ్బును మరియాకు అందజేసింది. అదే సమయంలో మెడల్‌ను తిరిగి ఇచ్చేసి ఆశ్చర్యానికి గురిచేసింది. మెడల్‌ను తన వద్దే ఉంచుకోవాలని, మరియా పెద్ద మనసుకు చలించిపోయిన జాబ్కా యాజమాన్యం అభినందనలు తెలిపింది.

కాగా, మిలోజ్ మాలిసా అనే ఎనిమిది నెలల చిన్నారి గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతోంది. చిన్నారికి అమెరికాలో చికిత్స అందిస్తున్నారు. ఆమెకు శస్త్రచికిత్స చేయాల్సి ఉంది. అయితే, పెద్ద మొత్తంలో డబ్బులు అవసరం అయ్యింది. అంత డబ్బు తమ వద్ద లేకపోవడంతో.. మిలోజ్ తల్లిదండ్రులు సోషల్ మీడియా వేదికగా సాయం చేయాలంటూ దాతలను వేడుకున్నారు. శస్త్ర చికిత్స చేయకపోతే.. చనిపోయే ప్రమాదం ఉందంటూ బోరున విలపించారు. వీరి అభ్యర్థనకు ఒలింపిక్స్ మెడల్ విన్నర్ మరియా చలించింది. నిధుల సమీకరణకు ప్రయత్నించింది. ఇందులో భాగంగానే ఆమె తాను సాధించిన మెడల్‌ను వేలం వేసింది. ఇక మరియా అభిమానులు సైతం ఆమెకు బాసటగా నిలిచారు. చిన్నారికి శస్త్రచికిత్స కోసం దాదాపు 76,500 డాలర్ల నిధులు సమీకరించారు. ఆ నిధులను మిలోజ్ తల్లిదండ్రులకు అప్పగించారు.

Also read:

Naveen Polishetty: మరో ప్రాజెక్ట్‏కు నవీన్ పోలిశెట్టి గ్రీన్ సిగ్నల్, డైరెక్టర్ ఎవరంటే..

Brushing: బ్రష్ చేయకుండా బెడ్ కాఫీ, బ్రేక్‌ఫాస్ట్ తినే అలవాటుందా.. అయితే మీరు ఆరోగ్యాన్ని పణంగా పెడుతున్నారని తెలుసా

Traffic Violations: కొత్త ట్రాఫిక్‌ నిబంధనలు.. రూల్స్‌ పాటించని వాహనదారులకు15 రోజుల్లోగా నోటీసులు