Bundesliga Women 2024: హోఫెన్‌హీమ్ ధాటికి తేలిపోయిన పోట్స్‌డామ్‌ మహిళలు.. 6-0 తేడాతో ఘోర పరాజయం

|

Oct 19, 2024 | 8:52 AM

TSG Hoffenheim vs FFC Turbine Potsdam: బుండెస్లిగా మహిళల ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో 12 జర్మన్ జట్లు పోటీపడుతున్నాయి. ఈ టోర్నమెంట్‌లో బలమైన జట్టుగా గుర్తింపు పొందిన ఐన్‌ట్రాక్స్ ఫ్రాంక్‌ఫర్ట్ ఆడిన 6 మ్యాచ్‌లలో 5 గెలిచి 1 డ్రా చేసుకుంది. తద్వారా మొత్తం 16 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది.

Bundesliga Women 2024: హోఫెన్‌హీమ్ ధాటికి తేలిపోయిన పోట్స్‌డామ్‌ మహిళలు.. 6-0 తేడాతో ఘోర పరాజయం
Tsg Hoffenheim Women Vs Ffc Turbine Potsdam
Follow us on

Bundesliga Women 2024, TSG Hoffenheim vs FFC Turbine Potsdam: జర్మనీలో జరుగుతున్న బుండెస్లిగా మహిళల ఫుట్‌బాల్ టోర్నీ 37వ మ్యాచ్‌లో హాఫెన్‌హైమ్ జట్టు అద్భుత విజయం సాధించింది. శుక్రవారం డైట్‌మార్-హాప్-స్టేడియంలో హోఫెన్‌హీమ్, పోట్స్‌డామ్ మధ్య మ్యాచ్ జరిగింది. ఆరంభం నుంచి ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్‌లో హోఫెన్‌హీమ్ మహిళలు అన్ని దశల్లోనూ ఆధిపత్యం ప్రదర్శించారు. ఫలితంగా 21వ నిమిషంలో ఎరెటా మెమెటి అందివచ్చిన అవకాశాన్ని గోల్‌గా మలిచింది.

దీంతో 34వ నిమిషంలో జియా కార్లే మరో గోల్‌ చేసింది. 36వ నిమిషంలో, మెలిస్సా కోస్లర్ కార్లే మరో గోల్‌తో ఆకట్టుకుంది. తొలి అర్ధభాగంలో 3-0తో ఆధిక్యంలో నిలిచిన హోఫెన్‌హీమ్ ద్వితీయార్థంలోనూ ఆకట్టుకుంది. హోఫెన్‌హీమ్ జట్టు అద్భుత ప్రదర్శనతో పోట్స్‌డామ్ ఆటగాళ్ళు ఒత్తిడికి లోనయ్యారు. ఈ క్రమంలో తప్పులమీద తప్పులు చేస్తూ.. ఓటమికి దారులు వెతుక్కున్నారు.

దీన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకున్న హాఫెన్‌హీమ్‌కు చెందిన జూలియా 63వ నిమిషంలో 4వ గోల్‌ చేసింది. ఆ తర్వాత మెలిస్సా కోస్లర్ (64వ నిమిషం) మరో గోల్ చేసి గోల్స్ సంఖ్యను 5కి పెంచింది.

67వ నిమిషంలో అత్యుత్తమ పురోగతి సాధించిన జియా కార్లే.. గోల్ కీపర్‌ను బురిడీ కొట్టించి గోల్ చేసింది. దీంతో హోఫెన్‌హీమ్ జట్టు 6-0 తేడాతో పోట్స్‌డామ్‌పై విజయం సాధించింది.

ఈ విజయంతో బుండెస్లిగా మహిళల టోర్నీలో హాఫెన్‌హీమ్ జట్టు పాయింట్ల పట్టికలో 5వ స్థానానికి ఎగబాకింది. ఇంట్రాక్స్ ఫ్రాంక్‌ఫర్ట్ జట్టు ఆడిన 6 మ్యాచ్‌ల్లో 5 విజయాలు, 1 డ్రాతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది.

హోఫెన్‌హీమ్, పోట్స్‌డామ్ మధ్య మ్యాచ్..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..