D Gukesh: ప్రపంచ ఛాంపియన్‌కు తమిళనాడు సీఎం ఘన సన్మానం.. హోమ్ ఆఫ్ చెస్ అకాడమీ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్

|

Dec 18, 2024 | 8:22 AM

Tamil Nadu Chief Minister M K Stalin Felicitates D Gukesh: ఈ ఏడాది సెప్టెంబర్ 10 నుంచి 23 వరకు బుడాపెస్ట్‌లో చెస్ ఒలింపియాడ్ నిర్వహించారు. ఓపెన్‌, మహిళల విభాగాల్లో భారత్‌ చాంపియన్‌గా నిలిచింది. ఓపెన్‌ కేటగిరీలో గుకేశ్‌ ఆఖరి గేమ్‌లో విజయం సాధించి భారత్‌కు విజయాన్ని అందించాడు.

D Gukesh: ప్రపంచ ఛాంపియన్‌కు తమిళనాడు సీఎం ఘన సన్మానం.. హోమ్ ఆఫ్ చెస్ అకాడమీ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్
Tn Cm Felicitates Gukesh
Follow us on

Tamil Nadu Chief Minister M K Stalin Felicitates D Gukesh: ప్రపంచ చెస్ ఛాంపియన్ డి గుకేశ్ భారత్‌కు తిరిగొచ్చాడు. సోమవారం చెన్నై విమానాశ్రయంలో ఆయనకు ఘన స్వాగతం లభించింది. డిసెంబర్ 12న సింగపూర్‌లో జరిగిన ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్ టైటిల్‌ను 18 ఏళ్ల భారత గ్రాండ్‌మాస్టర్ డి గుకేష్ గెలుచుకున్నాడు. ప్రపంచంలోనే అత్యంత పిన్న వయస్కుడైన చెస్ ఛాంపియన్ డి గుకేష్‌ను తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తదితరులు మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సత్కరించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున రూ. 5 కోట్ల చెక్కును, శాలువాను ఆయనకు అందించిన ముఖ్యమంత్రి.. రాష్ట్రంలోని ప్రతిభను ప్రోత్సహించేందుకు రాష్ట్ర క్రీడా శాఖ ద్వారా హోం ఆఫ్ చెస్ అకాడమీని ఏర్పాటు చేయనున్నట్లు ఆయన ప్రకటించారు.

భారతదేశంలోని 85 మంది చెస్ గ్రాండ్‌మాస్టర్‌లకుగానూ 31 మంది గ్రాండ్‌మాస్టర్‌లను కలిగి ఉన్న చరిత్ర తమిళనాడుకు ఉంది. ఈ సత్కారం కేవలం గుకేష్‌కి మాత్రమే కాదు.. ఈ ఫీల్డ్‌లో రాణించాలని కోరుకునే వారందరికీ అని ప్రకటించారు. ప్రతిభను ప్రోత్సహించడానికి, సాధకులను తీర్చిదిద్దేందుకు ఒక హోం ఆఫ్ చెస్ అకాడమీని ఏర్పాటు చేయనున్నారు ముఖ్యమంత్రి తెలిపారు.

ఇవి కూడా చదవండి

అతను ఫైనల్‌లో చైనాకు చెందిన డిఫెండింగ్ ఛాంపియన్ డింగ్ లిరెన్‌ను 7.5–6.5తో ఓడించాడు. ప్రపంచంలోనే ఇంత చిన్న వయసులో టైటిల్ నెగ్గిన తొలి ఆటగాడు గుకేష్. అంతకుముందు 1985లో రష్యాకు చెందిన గ్యారీ కాస్పరోవ్ 22 ఏళ్ల వయసులో ఈ టైటిల్‌ను గెలుచుకున్నాడు.

14వ గేమ్‌లో చైనా ఆటగాడిని ఓడించి గుకేశ్ టైటిల్ గెలుచుకున్నాడు. ఛాంపియన్‌షిప్ ఫైనల్స్ నవంబర్ 25న ప్రారంభమయ్యాయి. డిసెంబర్ 11 వరకు ఇద్దరి మధ్య 13 గేమ్‌లు జరిగాయి. ఇక్కడ స్కోరు 6.5-6.5తో సమమైంది. గుకేశ్ 14వ గేమ్‌ను గెలిచి ఒక పాయింట్‌తో ఆధిక్యంలోకి వెళ్లి స్కోరును 7.5-6.5గా చేశాడు.

విశ్వనాథన్ ఆనంద్ తర్వాత చెస్‌లో ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన రెండో భారతీయ ఆటగాడిగా గుకేశ్ నిలిచాడు. విశ్వనాథన్ ఆనంద్ 2012లో చెస్ ఛాంపియన్ అయ్యాడు. గుకేశ్ 17 ఏళ్ల వయసులో ఫిడే క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్‌ను కూడా గెలుచుకున్నాడు. ఆ తర్వాత ఈ టైటిల్‌ను గెలుచుకున్న అతి పిన్న వయస్కుడైన ఆటగాడిగా కూడా నిలిచాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..