SFA Championships: భారత్‌లో ఆర్చరీ జోరు.. అద్భుత ప్రతిభను చాటిన విద్యార్థులు..

|

Oct 17, 2024 | 7:54 PM

ఆర్చరీ క్రీడ పట్ల భారత్‌లో ఆదరణ పెరుగుతోంది. యువతలో ట్యాలెంట్‌ను వెలికితీసి, వారిని ప్రోత్సహించే లక్ష్యంతో ఎస్ఏఫ్ఏ ఛాంపియన్‌షిప్ 2024ను నిర్వహించారు. దేశ నలుమూల నుంచి పలు క్రీడా విభాగాల్లో స్కూలు విద్యార్థులు ఈ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొని తమ సత్తా చాటారు.

SFA Championships: భారత్‌లో ఆర్చరీ జోరు.. అద్భుత ప్రతిభను చాటిన విద్యార్థులు..
SFA Championships 2024
Follow us on

ఆర్చరీ.. కొంతకాలం క్రితం వరకు కొందరికే పరిమితమైన క్రీడ. అయితే ఇప్పుడు ఆర్చరీ పట్ల విద్యార్థులు, యువకులు ఆకర్షితులవుతున్నారు. విద్యార్థి దశలోనే ఆర్చరీలో శిక్షణ పొందుతూ.. దేశ, అంతర్జాతీయ వేదికలపై సత్తాచాటుతున్నారు. వీరిలోని నైపుణ్యాన్ని వెలికితీసేందుకు స్పోర్ట్స్ ఫర్ ఆల్ (SFA) ఛాంపియన్‌షిప్ 2024 ఓ అద్భుతమైన వేదికగా నిలిచింది. హైదరాబాద్‌ వేదికగా జరిగిన ఆర్చరీ పోటీల్లో దేశ నలుమూలల నుంచి విద్యార్థులు తలపడ్డారు. ఇతర ఆర్చర్లతో కలిసి పోటీపడేందుకు ఎస్ఎఫ్ఐ ఓ చక్కటి అవకాశం కల్పించిందని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ -నాగర్‌గుల్‌కి చెందిన 11 ఏళ్ల అర్జున్ కార్తిక్ సంతోషం వ్యక్తంచేశాడు. ఆర్చీరీలో రాణించేందుకు స్కూల్ కోచ్ శివ్‌రాజ్, ఆర్చరీ కోస్ నాగరాజు ఎంతగానో ప్రోత్సహించారని కృతజ్ఞతలు తెలిపాడు. ఆర్చరీ క్రీడ లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం, లక్ష్యంపై ఫోకస్ చేయడం, ఏకాగ్రత, మానసిక స్థిరత్వానికి దోహదపడుతున్నట్లు చెప్పారు. చదవుల్లోనూ రాణించేందుకు ఆర్చరీ క్రీడ సాయపడుతున్నట్లు వివరించాడు.

వీడియో చూడండి..

ఒలంపిక్స్‌లో అర్చరీలో రాణించిన భారత్..

గత కొన్నేళ్లుగా ఆర్చరీలో భారత క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయి ప్రతిభను కనబరుస్తుండటం విశేషం. 2024 పారిస్ ఒలంపిక్స్ గేమ్స్‌లో ఆర్చరీ విభాగంలో భారత్ మెరుగైన ప్రదర్శన కనబరిచింది. పూర్తి స్థాయిలో ఆరుగురు ఆర్చర్లతో భారత్ రంగంలోకి దిగింది. పారిస్ ఒలంపిక్స్‌లో భారత ఆర్చర్లు దీపిక కుమారి, తరుణ్‌దీప్ రాయ్, ప్రవీణ్ జాదవ్, అంకిత భకత్, తెలుగు కుర్రాడు ధీరజ్ బొమ్మదేవరలు వ్యక్తిగత విభాగంలో ప్రాతినిధ్యంవహించారు. అలాగే ఒలంపిక్స్ గేమ్స్‌ ఆర్చరీ మిక్సిడ్ కాంపౌండ్ టీమ్ ఈవెంట్‌లో భారత్‌కు చెందిన 17 ఏళ్ల షీతల్ దేవి, రాకేష్ కుమార్‌తో కలిసి కాంస్య పతకాన్ని సాధించి చరిత్ర సృష్టించారు. పారాలింపిక్‌లోనూ పతకాన్ని సాధించి షీతల్ దేవి.. ఈ ఘనత సాధించి అతి పిన్న భారత అర్చర్‌గా గుర్తింపు సాధించారు. చేతులు లేకుండానే అర్చరీలో రాణిస్తూ అందరి దృష్టిని ఆకర్షించారు.