Indonesia Open 2022: ఇండోనేషియా ఓపెన్‌లో అదరగొట్టిన హెచ్‌ఎస్ ప్రణయ్.. క్వార్టర్ ఫైనల్‌లోకి ఎంట్రీ..

|

Jun 16, 2022 | 8:01 PM

HS Prannoy: భారత బ్యాడ్మింటన్ క్రీడాకారుడు హెచ్‌ఎస్ ప్రణయ్ ఇండోనేషియా ఓపెన్ 2022లో అద్భుత ప్రదర్శన చేస్తూ క్వార్టర్-ఫైనల్‌లో చోటు సంపాదించాడు.

Indonesia Open 2022: ఇండోనేషియా ఓపెన్‌లో అదరగొట్టిన హెచ్‌ఎస్ ప్రణయ్.. క్వార్టర్ ఫైనల్‌లోకి ఎంట్రీ..
Hs Prannoy
Follow us on

HS Prannoy Indonesia Open 2022: భారత బ్యాడ్మింటన్ క్రీడాకారుడు హెచ్‌ఎస్ ప్రణయ్ ఇండోనేషియా ఓపెన్ 2022లో అద్భుత ప్రదర్శన చేస్తూ క్వార్టర్-ఫైనల్‌లో చోటు సంపాదించాడు. అతను హాంకాంగ్ ప్లేయర్ అంగ్ కా లాంగ్ అంగస్‌ను ఓడించాడు. ప్రణయ్‌ 21-11, 21-18తో ఈ మ్యాచ్‌లో గెలిచాడు. ఈ విజయంతో క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నాడు. హాంకాంగ్ ప్లేయర్ అంగస్‌తో జరిగిన మ్యాచ్‌లో ప్రణయ్ శుభారంభం చేశాడు. ఆ తర్వాత దానిని నిలబెట్టుకున్నాడు. ఈ మ్యాచ్‌లో ప్రణయ్ 21-11 21-18 తేడాతో విజయం సాధించాడు. ఆ తర్వాత అతను డెన్మార్క్‌కు చెందిన రాస్మస్ గెమ్కే లేదా ఫ్రాన్స్‌కు చెందిన బ్రైస్ లెవెర్డెజ్‌తో క్వార్టర్ ఫైనల్స్‌లో ఆడనున్నాడు. మరో మ్యాచ్‌లో భారత ఆటగాడు సమీర్ వర్మ ప్రపంచ ఐదో ర్యాంకర్ లీ జి జియా చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించాడు.

ప్రపంచ మాజీ 11వ ర్యాంకర్ సమీర్‌ను ఆరో సీడ్ లీ 21-10, 21-13తో ఓడించాడు. లీతో జరిగిన ఏడు మ్యాచ్‌ల్లో సమీర్‌కు ఇది ఐదో ఓటమి. అశ్విని పొన్నప్ప, ఎన్ సిక్కి రెడ్డి కూడా 16-21, 13-21తో టాప్ సీడ్స్ చెన్ క్వింగ్ చెన్, జియా యి ఫాన్‌ల చేతిలో ఓడిపోయారు. ఎంఆర్ అర్జున్, ధృవ్ కపిల 19-21, 15-21తో చైనాకు చెందిన యు చెన్, యు జువాన్ చేతిలో ఓడిపోయారు.

ఇవి కూడా చదవండి

పురుషుల సింగిల్స్‌లో ప్రణయ్ తొలి అర్ధభాగంలో ఆధిపత్యం ప్రదర్శించి 11-3తో ఆధిక్యంలో నిలిచాడు. విరామం తర్వాత, అతను సులువైన తప్పిదాలు చేశాడు. దీని వల్ల ఆంగ్ లాంగ్ కొన్ని పాయింట్లు సాధించాడు. అయితే దీని తర్వాత, క్రాస్‌కోర్ట్‌లో అద్భుతమైన స్మాష్‌లు, బేస్‌లైన్‌లో మంచి నిర్ణయాల ఆధారంగా ప్రణయ్ మళ్లీ ఆధిపత్యం చెలాయించాడు. ప్రణయ్ కదలిక చాలా బాగుంది. అతను ప్రత్యర్థి తప్పిదాలను పూర్తిగా ఉపయోగించుకున్నాడు.