17 ఏళ్ల వయసులో విశేష్ భృగువంశీ(Vishesh Bhriguvanshi) తొలిసారిగా భారత జాతీయ జట్టు డ్రెస్‌ను ధరించగానే, భారత బాస్కెట్‌బాల్(Basketball)లో కొత్త అధ్యాయానికి నాంది పలికినట్లైంది. వారణాసిలో జన్మించిన ఈ అథ్లెట్..కఠోర శ్రమ, పట్టుదలతో భారత జాతీయ జట్టులో చేరాడు. ఆ తర్వాత భారత జాతీయ బాస్కెట్‌బాల్ జట్టుకు అతి పిన్న వయస్కుడైన కెప్టెన్‌గా మారాడు. తన 13 ఏళ్ల కెరీర్‌లో ఎన్నో అద్భుతాలు సాధించిన ఈ ఆటగాడు.. భారత బాస్కెట్‌బాల్ చరిత్రలో సరికొత్త చరిత్రను లిఖించాడు. చెన్నైలో ఇటీవల ముగిసిన సీనియర్ జాతీయ బాస్కెట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో 30 ఏళ్ల అతను మాస్టర్‌క్లాస్ సాధించడంతో అంతా ఆశ్చర్యపోయారు. భృగువంశీ ఉత్తరాఖండ్‌ను ఫైనల్‌కు తీసుకెళ్లడంలో విఫలమయ్యాడు. అయితే భారతీయ రైల్వేస్‌పై వారి విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇందులో భృగువంశీ 48 పాయింట్లతో అద్భుత ప్రదర్శన చేశాడు. దీంతో ఇప్పటికీ దేశంలో అత్యుత్తమ హూప్‌స్టర్‌గా మిగిలిపోయాడనడంలో సందేహం లేదు. ఈ సందర్భంగా News9 స్పోర్ట్స్‌తో ప్రత్యేకంగా మాట్లాడి, తన అనుభవాలు పంచుకున్నాడు. భారతీయ బాస్కెట్‌బాల్ అభివృద్ధి, భవిష్యత్తు గురించి ఎన్నో విషయాలు మాట్లాడాడు. జాతీయ జట్టుతో సుమారు 10 పతకాలు, ఆరు జాతీయ బంగారు పతకాలను గెలుచుకున్న భృగువంశీ.. ఇండియన్ నేషనల్ బాస్కెట్‌బాల్ లీగ్ (INBL) రాబోయే షెడ్యూల్‌తోపాటు, అతని వ్యక్తిగత లక్ష్యాల గురించి కూడా ముచ్చటించాడు. అవేంటో ఇప్పుడు చూద్దాం..
ఇటీవల ముగిసిన సీనియర్ నేషనల్ ఛాంపియన్‌షిప్‌లో మీ ప్రదర్శన ఎలా ఉంది?
నేను నేషనల్స్‌లో బాగా ఆడాను. కానీ, నా జట్టు (ఉత్తరాఖండ్)ను ఫైనల్‌కు చేర్చలేకపోయాను. మేం క్వార్టర్-ఫైనల్‌లో ఓడిపోయాం. నేను ఫలితంతో కలత చెందాను. కానీ, వచ్చే ఏడాది మేం పతకం సాధిస్తామని ఆశిస్తున్నాను. తమిళనాడు నిజంగా బాగా ఆడింది. టోర్నమెంట్ అంతటా అజేయంగా నిలిచింది. ఆ జట్టులో చాలా మంచి ఆటగాళ్లు ఉన్నారు. వారిలో నలుగురు దేశం కోసం ఆడారు. కాబట్టి, భవిష్యత్తులో, పోటీ స్థాయి నిజంగా ఎక్కువగా ఉంటుంది.
భారతదేశానికి చాలా కీలకమైన అంతర్జాతీయ క్యాలెండర్ రాబోతోంది. రాబోయే FIBA ఆసియా కప్ క్వాలిఫైయర్స్, ఆసియా కప్‌పై మీ అంచనాలు ఎలా ఉన్నాయి?
మేం రెండవ రౌండ్‌లో ఉన్నాం. ఫిలిప్పీన్స్‌తో జరిగే తదుపరి గేమ్‌లో, మేం వారిపై మా అవకాశాలను తిరిగి పొందాలని కోరుకుంటున్నాం. మేం చివరి గేమ్‌ను బాగా ఆడాం. ప్రస్తుత జాతీయ జట్టు ఫిలిప్పీన్స్‌పై విజయాన్ని నమోదు చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఆసియా కప్‌లో న్యూజిలాండ్, లెబనాన్‌లతో కలిసి మరోసారి ఫిలిప్పీన్స్‌తో ఆడాల్సి ఉంది.
ఆసియా విభాగంలోకి ఓషన్ కంట్రీస్‌ను చేర్చడం వల్ల ఇప్పటికే ఉన్న ఆసియా దేశాల పరిస్థితి ఎలా ఉంటుంది?
ఓషియన్ కంట్రీస్ నిజంగా బలంగా ఉన్నాయి. ఈ విభాగంలో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లను చేర్చిన తర్వాత ఏ ఆసియా దేశమూ.. ఆసియా కప్‌లో విజయం సాధించలేదు. ఆ దేశాలతో ఆడడం వల్ల మనకు ఎక్స్‌పోజర్, అనుభవం కూడా లభిస్తాయి. ఇది ఆసియా జాతీయ జట్లకు నిజంగా మంచిది. గత ఆసియా కప్‌లో లెబనాన్, ఇరాన్‌లపై న్యూజిలాండ్ ఓటమిని చవిచూసింది. కాబట్టి, మనం ఓషియానిక్ దేశాలపై గెలవలేమని కాదు.. కానీ, అవి నిజంగా బలమైన జట్లు. వారి జట్టులోని చాలా మంది ఆటగాళ్ళు NBA (నేషనల్ బాస్కెట్‌బాల్ అసోసియేషన్)లో ఆడతారు. మరికొందరు NBL (నేషనల్ బాస్కెట్‌బాల్ లీగ్)లో ఆడతారు. ఇది కూడా ప్రపంచంలోని అతిపెద్ద లీగ్‌లలో ఒకటి. కాబట్టి, వారి జట్టులో చాలా అనుభవజ్ఞులైన, ఎలైట్ ప్లేయర్లు ఉన్నారు. ఆ జట్లతో ఆడడం వల్ల మనం మరింత మెరుగయ్యేలా ప్రేరేపిస్తుంది.
INBL రాబోయే లీగ్‌పై మీ అభిప్రాయం ఏమిటి, ఇది భారత బాస్కెట్‌బాల్‌కు గేమ్-ఛేంజర్‌గా మారుతుందని మీరు అనుకుంటున్నారా?
ఇది బాస్కెట్‌బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నుంచి ఒక పెద్ద అడుగు. భారత్‌కు సొంతంగా బాస్కెట్‌బాల్ లీగ్ ఉండాలని నేను చాలా కాలంగా అడుగుతున్నాను. INBLని నిజం చేసినందుకు K గోవింద్‌రాజ్ (BFI అధ్యక్షుడు), చందర్ ముఖి శర్మ (BFI సెక్రటరీ జనరల్)కి నేను చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈ లీగ్‌ను ప్రవేశపెట్టడం వల్ల బాస్కెట్‌బాల్‌లో భారతదేశ భవిష్యత్తు గొప్పగా ఉండబోతోంది. భారతీయ బాస్కెట్‌బాల్ వృద్ధికి సహాయపడే విదేశీ ఆటగాళ్లతో మరిన్ని మ్యాచ్‌లు ఆడతాం.
INBLలో మీ వ్యాపారాన్ని కొనసాగిస్తారా లేదా విదేశాలలో శిక్షణ పొందాలనుకుంటున్నారా?
నేను ఖచ్చితంగా ఐఎన్‌బీఎల్‌లో ఆడతాను. ఎందుకంటే ఇది భారతదేశానికి చెందిన స్వంత లీగ్. లీగ్‌లో భారత ఆటగాళ్లే కాకుండా విదేశీ ఆటగాళ్లు కూడా ఆడుతున్నారు. భారతదేశం చాలా పెద్ద మార్కెట్‌ను కలిగిఉంది. ప్రతి ఒక్కరూ ఇక్కడ ఉండాలని కోరుకుంటారు. ప్రో కబడ్డీ లీగ్ (PKL), ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (PBL), ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL), ఇండియన్ సూపర్ లీగ్ (ISL)లను ప్రజలు ఎలా స్వీకరించారో, ఆ లీగ్‌లు ఎంతగా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయో మనకు తెలిసిందే. INBL కూడా అదే వేగంతో అభివృద్ధి చెందుతుందని నేను భావిస్తున్నాను. భారతదేశంలో బాస్కెట్‌బాల్ చాలా ప్రజాదరణ పొందిన క్రీడ. దేశంలోని దాదాపు ప్రతి పాఠశాల, కళాశాలలో బాస్కెట్‌బాల్ కోర్ట్ ఉంది. కాబట్టి INBL ప్రారంభించాక ఇది ఎంతగానో ప్రజాదరణ పొందబోతోంది.
10ఏళ్లకుపైగా సాగుతోన్న మీ కెరీర్‌లో, భారతీయ బాస్కెట్‌బాల్ వృద్ధిపై ఎలాంటి రేటింగ్ ఇస్తారు?
దేశంలో బాస్కెట్‌బాల్ వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఇంతకుముందు, మేం ఎప్పుడూ ఆసియాలోని టాప్ ఎనిమిది జట్లలో ఉండేవాళ్లం. ఈ విభాగంలో ఓషియానిక్ దేశాలను చేర్చడం, కోవిడ్-19 వ్యాప్తి, కొంతమంది కీలక జాతీయ జట్టు ఆటగాళ్లకు గాయాలు భారత బాస్కెట్‌బాల్‌ను వెనక్కి నెట్టాయి. ప్రస్తుతం మరోసారి మేం సరైన మార్గంలో ఉన్నాం. తర్వలోనే భారత్ కోల్పోయిన ర్యాంక్‌ను చేరుకుంటుంది.
మీ వయస్సు 30 సంవత్సరాలు, ఇది అథ్లెట్‌కు గరిష్ట వయస్సుగా పరిగణిస్తున్నారు. ప్రస్తుతం మీ లక్ష్యాలు ఎలా ఉన్నాయి?
ప్రస్తుతం, నేను నా ఫిట్‌నెస్‌పై దృష్టి సారిస్తున్నాను. రోజు వారీ ప్రాతిపదికన నా ఆటను మెరుగుపరచుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. నేర్చుకోవడం ఎప్పుడూ ముగించను. నేను ఎల్లప్పుడూ కొత్త విషయాలను నేర్చుకోవాలనే ఆసక్తిని కలిగి ఉంటాను. బాస్కెట్‌బాల్ ప్రతిరోజూ అభివృద్ధి చెందుతోంది. నేర్చుకోవలసిన విషయాలు చాలా ఉన్నాయి. నేను అత్యున్నత స్థాయిలో ఆడుతున్నంత వరకు, నా అనుభవం, ఆట గురించిన పరిజ్ఞానంతో నా దేశానికి సహాయం చేస్తూనే ఉంటాను.
క్రీడల నిర్వహణ వైపు మీకు ఆసక్తి ఉందా?
ఇలాంటి వాటి గురించి నేనెప్పుడూ ఆలోచించలేదు. ప్రస్తుతం, నేను ఆటగాడిని. నా పూర్తి దృష్టి ఆడటంపైనే ఉంది. నేను నా కెరీర్‌ను ముగించిన తర్వాత, నేను ఖచ్చితంగా ఇతర విషయాలపై ఆలోచిస్తాను.
వెసెలిన్ మాటిక్ (భారత జాతీయ బాస్కెట్‌బాల్ జట్టు కోచ్) పనితీరును ఎలా ఉంది? అతను తీసుకువచ్చిన మార్పులు ఎలా ఉన్నాయి?
మాటిక్ 2019లో భారత జట్టుతో చేరారు. అతను ప్రపంచంలోని అత్యుత్తమ కోచ్‌లలో ఒకడు. అతను లెబనాన్, ఇరాన్, సిరియా వంటి జట్లతో సంబంధం కలిగి ఉన్నాడు. అతను ఆసియాలోని దాదాపు అన్ని అగ్రశ్రేణి జట్లకు కోచ్‌గా పనిచేశాడు. ఇరాన్‌తో కలిసి అతను రెండు ఆసియా ఛాంపియన్‌షిప్‌లను గెలుచుకున్నాడు. మాటిక్ ఎల్లప్పుడూ మంచి ఫలితాలను అందించాడు. ప్రస్తుతం అతను భారత జాతీయ జట్టుతో కలిసి పనిచేస్తున్నాడు. ఇది మాకు నిజంగా మంచిది. అతను మా ఆటను మెరుగుపరచడంలో మాకు సహాయం చేస్తాడు.
చాలా మంది యువ ఆటగాళ్లు అమెరికా వెళ్లి బాస్కెట్‌బాల్ ఆడుతున్నారు. అది భారత బాస్కెట్‌బాల్‌కు ఎలా ఉపయోగపడుతుంది?
విదేశాలకు వెళ్లి చదువుకునేందుకు, ఆడేందుకు వెళ్తున్న ఆటగాళ్లలో ఎక్కువ మంది ఎన్‌బీఏ ఇండియా అకాడమీకి చెందిన వారే. యూఎస్ వెళ్లి కాలేజీల్లో ఆడడం విశేషం. వారు భారతదేశానికి తిరిగి వచ్చి జాతీయ జట్టులో చేరిన తర్వాత, ఆటగాళ్లు సిద్ధంగా ఉంటారు. అప్పుడు వారి ఆట మెరుగుపడుతుంది. భారత బాస్కెట్‌బాల్‌కు ఇది నిజంగా శుభసూచకం.
భారతదేశంలో బాస్కెట్‌బాల్‌కు ప్రసిద్ధి చెందిన నగరం ఏది?
తమిళనాడులో చాలా మంచి క్రీడాకారులు, పాఠశాలలు, కళాశాలలు ఉన్నాయి. కానీ పంజాబ్‌లో, లూథియానా బాస్కెట్‌బాల్ అకాడమీ ఉంది. ఇది నిరంతరం ఆటగాళ్లను తయారు చేస్తోంది. ప్రతి సంవత్సరం, అకాడమీ అంతర్జాతీయ ఆటగాళ్లను రూపొందించే పనిలో నిమగ్నమైంది. కాబట్టి నాకు, భారత బాస్కెట్‌బాల్‌కు లూథియానా హార్ట్‌లా మారింది.
భారతదేశంలో కీర్తితోపాటు డబ్బు పొందగలిగే క్రీడలలో బాస్కెట్‌బాల్ లేదు. మరి మీరు ఈ క్రీడనే ఎంచుకోవడానికి కారణమేమిటి?
మా సోదరుడు నన్ను బాస్కెట్‌బాల్‌కు పరిచయం చేశాడు. అతను ఎప్పుడూ నేను దేశం కోసం ఆడాలని కోరుకున్నాడు. ఒకసారి నేను భారతదేశం తరపున ఆడినప్పుడు, మా సోదరుడు, ‘దేశం కోసం ఎవరైనా ఒకసారి ఆడవచ్చు. కానీ, నిరంతరం ఆడేవాడే ప్రధాన ఆటగాడు’ అని చెప్పాడు. ఒకటి లేదా రెండుసార్లు ఆడటం అదృష్టం మాత్రమే, కానీ భారత జట్టులో సాధారణ సభ్యుడిగా మారినప్పుడు, అది గొప్ప విజయం అవుతుంది.
మనదేశంలో బాస్కెట్‌బాల్ ఆట ఎలాంటి ప్రభావం చూపిస్తుంది?
అగ్రశ్రేణి ఆటగాళ్లందరూ టాప్ లీగ్‌లో ఉన్నారు. ISLలో ఎవరూ లేరు. కానీ, ప్రస్తుతం ISL కూడా బాగా ప్రాచుర్యం పొందింది. భారతదేశంలో చాలా మంది ప్రజలు ఫుట్‌బాల్‌ను అనుసరించడం ప్రారంభించారు. ప్రతిచోటా ఫుట్‌బాల్ అకాడమీలు ఉన్నాయి. పిల్లలు క్రీడలవైపు మొగ్గు చూపుతున్నారు. ఇది నెమ్మదిగా ప్రజాదరణ పొందుతోంది. గతంలో, కోల్‌కతా, గోవా లేదా కేరళ వంటి దేశంలోని కొన్నిచోట్ల ఫుట్‌బాల్ ప్రజాదరణ పొందింది. అయితే, ప్రస్తుతం దేశం మొత్తానికి ఈక్రీడ గురించి తెలుసు. భవిష్యత్తులో ఇది మరింత పెరుగుతుంది. INBL బాస్కెట్‌బాల్‌కు కూడా అదే చేస్తుంది. టీవీలో చూస్తున్నప్పుడు ప్రజలు మిమ్మల్ని అనుసరించడం ప్రారంభిస్తారు.
1980 మాస్కో ఒలింపిక్స్‌లో పాల్గొన్న అజ్మీర్ సింగ్ లాంటి ఆటగాళ్లతో మాట్లాడడం ఎలా ఉంది?
ఇటీవల ముగిసిన సీనియర్ బాస్కెట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌ల సందర్భంగా, ఒలింపియన్‌లతో సహా ఇతర మాజీ బాస్కెట్‌బాల్ ఆటగాళ్లతో పాటు నేను అజ్మీర్ సింగ్‌ను కలిశాను. వారి గురించి ఎవరికీ తెలియదు. నేను వారితో మాట్లాడిన సందర్భంలో వారు ఒలింపిక్స్‌లో ఆడారని తెలుసుకుని నేను ఆశ్చర్యపోయాను. నాకు వాళ్ళు తెలియదు. కానీ, ఒలింపిక్స్‌లో బాస్కెట్‌బాల్‌లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించింది వారు మాత్రమే. వారితో మాట్లాడటం గౌరవంగా ఉంది.
అర్జున అవార్డు వచ్చిన ఆ క్షణం ఎలా అనిపించింది?
అర్జున అవార్డు అందుకోవడం నా జీవితంలో మర్చిపోలేని రోజు. బాస్కెట్‌బాల్ ప్లేయర్‌గా, ఇది నాకు చాలా పెద్ద విషయం. ఎందుకంటే నేను అర్జున అవార్డు పొందాలని చిన్నప్పటి నుంచి కలలు కన్నాను. చివరగా 2020లో నేను అవార్డు అందుకున్నాను.
Also Read: Watch Video: ప్లీజ్.. మీ కాళ్లు మొక్కనివ్వండన్న జాంటీ రోడ్స్.. వద్దని వారించిన సచిన్.. వైరల్ వీడియో
IPL 2022: రూ. 30 లక్షల ప్లేయర్‌ను ఆడించండి.. ముంబై వరుస పరాజయాలకు బ్రేక్ పడొచ్చంటోన్న ఫ్యాన్స్..