Football: భారత ఫుట్‌బాల్‌లో ఫిక్సింగ్ కలకలం.. రంగంలోకి దిగిన సీబీఐ..

|

Nov 21, 2022 | 12:40 PM

All India Football Federation: భారత ఫుట్‌బాల్‌పై ఫిక్సింగ్ ఛాయలు అలుముకున్నాయి. ఓ అంతర్జాతీయ ఫిక్సర్ పేరు కూడా తెరపైకి వస్తోంది. ఈ వ్యవహారంపై సీబీఐ కూడా విచారణ ప్రారంభించింది.

Football: భారత ఫుట్‌బాల్‌లో ఫిక్సింగ్ కలకలం.. రంగంలోకి దిగిన సీబీఐ..
All India Football
Follow us on

ప్రస్తుతం ప్రపంచం అంతా ఫిఫా ప్రపంచ కప్‌ మ్యాచ్‌ల్లో మునిగిపోగా.. భారత్‌లో మాత్రం ఫుట్‌బాల్ కీడలో కలకలం రేగుతోంది. ఫిక్సింగ్ వ్యవహారం తెరపైకి వచ్చినప్పటి నుంచి ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలో కొన్ని క్లబ్‌ల పేర్లు కూడా తెరపైకి వస్తున్నాయి. ప్రస్తుతం ఫుట్‌బాల్ ఫిక్సింగ్ కేసులో సీబీఐ కూడా విచారణ ప్రారంభించింది. ఫుట్‌బాల్ ఫిక్సింగ్ కేసులో సీబీఐ ప్రాథమిక విచారణను నమోదు చేసింది. మరిన్ని వివరాల కోసం ఇటీవల ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ (AIFF) ప్రధాన కార్యాలయానికి చేరుకుంది. ఆధారాల ప్రకారం, ఫుట్‌బాల్‌లో ఆరోపించిన మ్యాచ్ ఫిక్సింగ్‌కు సంబంధించి ఓ జట్టు పెట్టుబడులపై కూడా సీబీఐ ఆరా తీసింది.

మీడియా కథనాల ప్రకారం, ఫిక్సింగ్ కేసులో 5 భారతీయ ఫుట్‌బాల్ క్లబ్‌ల పేర్లు తెరపైకి వస్తున్నాయి. అవి షెల్ సంస్థల ద్వారా సింగపూర్ ఫిక్సర్ నుంచి డబ్బు అందుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.

విచారణకు సహకరించాలంటూ ఆదేశాలు..

టైమ్స్ ఆఫ్ ఇండియా వార్తల ప్రకారం, AIFF ప్రధాన కార్యదర్శి షాజీ ప్రభాకరన్ మాట్లాడుతూ, మ్యాచ్ ఫిక్సింగ్ పట్ల సమాఖ్య జోరో ట్రాన్సపరెన్సీ విధానాన్ని అనుసరిస్తోంది. విచారణకు సహకరించాలని అన్ని క్లబ్‌లను ఫెడరేషన్ కోరినట్లు ప్రభాకరన్ తెలిపారు.

ఇవి కూడా చదవండి

షెల్ కంపెనీల పెట్టుబడులపై ఆందోళన..

షెల్ కంపెనీల ద్వారా ఫిక్సర్ చేసిన పెట్టుబడుల గురించి తాను ఆందోళన చెందుతున్నట్లు ప్రధాన కార్యదర్శి తెలిపారు. భారత ఫుట్‌బాల్‌కు మ్యాచ్‌ ఫిక్సింగ్‌తో సంబంధం ఉన్న ఏ వ్యక్తితోనూ సంబంధం ఉండకూడదని తాను కోరుకుంటున్నట్లు చెప్పుకొచ్చాడు.

క్లబ్‌ల నుంచి సమాచారం కోరిన సీబీఐ..

మీడియా నివేదికల ప్రకారం, CBI ఈ 5 క్లబ్‌లను కూడా సంప్రదించింది. క్లబ్‌తో అనుబంధానమైన విదేశీ ఆటగాళ్లు, విదేశీ సహాయక సిబ్బంది, స్పాన్సర్‌ల గురించి సమాచారం ఇవ్వాలని కోరింది. ఈ 5 క్లబ్‌లు ఐ-లీగ్‌కు చెందినవని కూడా వార్తలు వస్తున్నాయి. దేశంలోని రెండో అతిపెద్ద ఫుట్‌బాల్ టోర్నమెంట్ ఐ-లీగ్‌లోని 5 క్లబ్‌లపై కూడా విచారణ జరుగుతోంది. సంవత్సరం ప్రారంభంలో, గోవా ప్రో లీగ్‌లోని 6 మ్యాచ్‌లలో బెట్టింగ్ వ్యవహారం వెలుగుచూసింది. ఇది ఈ ఫిక్సింగ్‌కు అతిపెద్ద సంకేతంగా పరిగణిస్తున్నారు. దీంతో ఈ కేసు సీబీఐ చెంతకు చేరింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..