World Cup Final: గురి తప్పిన ‘దీపికా కుమారి’.. రజతంతో వెనుదిరిగి భారత స్టార్ ఆర్చర్..

|

Oct 21, 2024 | 10:43 AM

Deepika Kumari: దీపికా 2022లో కుమార్తె జన్మించడంతో వరల్డ్‌ కప్‌ నుంచి తప్పుకుంది. అయితే, ఈసారి మాత్రం సెమీస్‌ పోరు వరకు దూసుకొచ్చినా.. ఫైనల్‌ పోరులో మాత్రం గురి తప్పింది. తొమ్మిదిసార్లు వరల్డ్‌ కప్‌ ఫైనల్‌లో పోటీపడిన దీపికా.. ఐదు రజతాలను దక్కించుకుంది. మరో కాంస్య పతకం కూడా పొందింది.

World Cup Final: గురి తప్పిన దీపికా కుమారి.. రజతంతో వెనుదిరిగి భారత స్టార్ ఆర్చర్..
Deepika Kumari
Follow us on

Deepika Kumari: భారత స్టార్ ఆర్చర్ దీపికా కుమారి ఆర్చరీ ప్రపంచ కప్‌లో రజత పతకం గెలుచుకుంది. ఫైనల్స్‌కు చేరిన దీపికా చైనా క్రీడాకారిణి లి జియామన్‌పై ఓటమిపాలైంది. డిసెంబరు 2022లో తన కుమార్తె జన్మించిన మూడేళ్ల తర్వాత ప్రపంచ కప్ ఫైనల్‌కు తిరిగొచ్చిన దీపిక కుమారి.. ఆర్చరీ ప్రపంచ కప్‌లో మూడవ సీడ్‌గా నిలిచింది.

భారత ప్రీమియర్ రికర్వ్ ఆర్చర్ దీపికా కుమారి ప్రపంచ కప్ ఫైనల్‌లో చైనాకు చెందిన లీ జియామాన్‌తో జరిగిన సెమీస్ పోరులో 0-6 తేడాతో ఓడిపోయి తన ఐదో రజత పతకాన్ని గెలుచుకుంది. ప్రపంచకప్ ఫైనల్‌లో దీపిక తొమ్మిదోసారి పాల్గొంది. కాంస్యం కూడా కైవసం చేసుకుంది.

కాగా, డోలా బెనర్జీ దుబాయ్ 2007లో అగ్రస్థానంలో నిలిచి ప్రపంచ కప్ ఫైనల్‌లో స్వర్ణం సాధించిన ఏకైక భారతీయ ఆర్చర్‌గా నిలిచింది.

పురుషుల రికర్వ్ విభాగంలో, ధీరజ్ బొమ్మదేవర 4-2తో ఆధిక్యంలో ఉన్నప్పటికీ, దక్షిణ కొరియాకు చెందిన పారిస్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత లీ వూ సియోక్ నుంచి ధీటైన సవాలును ఎదుర్కొనలేకపోయాడు. దీంతో త్వరగానే నిష్క్రమించాల్సి వచ్చింది.

మెక్సికో క్రీడాకారిణి అలెజాండ్రా వాలెన్సియాతో జరిగిన సెమీఫైనల్‌లో అద్భుత విజయం సాధించిన తర్వాత దీపిక జోరును కొనసాగించలేకపోయింది. ముగ్గురు సభ్యుల భారత బృందం శనివారం తమ ప్రచారాన్ని ముగించుకుని రిక్తహస్తాలతో తిరిగి వచ్చారు. సెమీఫైనల్‌లో ఓటమి తర్వాత ప్రథమేష్ ఫుగే నాలుగో స్థానంలో నిలవగా, ప్రియాంష్, జ్యోతి సురేఖ వెన్నం పతక రౌండ్‌లకు చేరుకోలేకపోయారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..