HS Prannoy- Swetha Gomes: భారత స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ హెచ్ ఎస్ ప్రణయ్ (HS Prannoy) మరో రెండు రోజుల్లో తన బ్యాచిలర్ లైఫ్‌కు బైబై చెప్పనున్నాడు. తన ప్రియురాలు శ్వేతా గోమ్స్ కలిసి పెళ్లిపీటలెక్కనున్నాడు. మరో మూడు రోజుల్లో వీరి వివాహం జరగనుంది. ఈ శుభవార్తను ప్రణయే స్వయంగా సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకున్నాడు. ఈ సందర్భంగా ప్రి వెడ్డింగ్ ఫొటోలను పంచుకుంటూ ‘నువ్వు ఎప్పటికీ నాతోనే ఉండాలి’ అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. ఈ పోస్టుకు #3daystogo అని హ్యాష్ ట్యాగ్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. అభిమానులతో పాటు నెటిజన్లు ప్రణయ్- శ్వేతలకు శుభాకాంక్షలు, అభినందనలు తెలుపుతున్నారు. కాగా 30 ఏళ్ల ప్రణయ్ ఈ ఏడాది సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. మే నెలలో జరిగిన థామప్ కప్‌లో టీమిండియా బంగారు పతకం సాధించడంలో ప్రణయ్ కీలకపాత్ర పోషించాడు. అలాగే ఇటీవలే జరిగిన బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ ఛాంపియన్షిప్స్, జపాన్ ఓపెన్‌లోనూ ప్రణయ్ అద్భుతంగా ఆడాడు.
ప్రణయ్ స్వస్థలం కేరళలోని తిరువనంతపురం. అతను కూడా చాలామంది షట్లర్ల లాగే హైదరాబాద్‌లోని పుల్లెల గోపిచంద్ అకాడమీలో శిక్షణ తీసుకుని రాటుదేలాడు. ఈ ఏడాది జనవరిలో జరిగిన ఇండియా ఓపెన్‌లో క్వార్టర్స్‌కు చేరుకున్న ప్రణయ్.. అదే నెలలో సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్‌లో కూడా క్వార్టర్స్‌కు చేరుకున్నాడు. మార్చిలో జరిగిన జర్మన్ ఓపెన్‌లో క్వార్టర్‌ఫైనల్‌కు చేరుకున్నాడు. అదే నెలలో స్విస్ ఓపెన్‌లో రన్నరప్‌గా నిలిచాడు. కొరియా ఓపెన్, థాయ్‌లాండ్ ఓపెన్లలో విఫలమైనా జూన్‌లో జరిగిన ఇండోనేషియా ఓపెన్‌లో సెమీఫైనల్ వరకు చేరుకున్నాడు. మలేషియా మాస్టర్స్, జపాన్ ఓపెన్‌లోనూ సత్తాచాటాడు. ఇక భారత్ మొదటిసారి థామస్ కప్ గెలవడంలో ప్రణయ్ నిర్ణయాత్మక పాత్ర పోషించాడు. ఇక వధువు విషయానికొస్తే..శ్వేతాగోమ్స్ ప్రణయ్ చాలా రోజుల నుంచే ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆమె గురించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..