టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచ క్రికెట్ లో ధోనికి ఓ ప్రత్యేక స్థానం ఉంటుంది. ధోనీ తన నాయకత్వ ప్రతిభతో ఇండియాకు ఎన్నో విజయాలు అందించాడు. అందుకే ఈ కెప్టెన్ కూల్ కు అభిమానుల్లో ప్రత్యేక మైన క్రేజ్ ఉంది. తన కెరీర్ ముగింపు దశకు చేరుకున్నప్పటికీ.. 2024 ఐపీఎల్ (ఇండియన్ ప్రీమియర్ లీగ్) లో అదరగొడుతున్నాడు. నేటికి ఎంఎస్ ధోనీ ఫాలోయింగ్ ఏమాత్రం చెక్కు చెదరడం లేదు. అయితే ఇటీవల ధోనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
ఆదివారం విశాఖపట్నంలో ఢిల్లీ క్యాపిటల్స్ (డిసి) తో జరిగిన మ్యాచ్ లో ఎంఎస్ ధోని వింటేజ్ బ్యాటింగ్ తో అభిమానులను ఉర్రూతలూగించాడు. సీఎస్కే మాజీ కెప్టెన్ 16 బంతుల్లో నాలుగు బౌండరీలు, మూడు సిక్సర్ల సాయంతో అజేయంగా 37 పరుగులు చేశాడు. అయితే చెన్నై ఇటీవల జరిగిన మ్యాచ్ లో 20 పరుగుల తేడాతో ఓటమిపాలై సీజన్ లో తొలి ఓటమి చవిచూసింది. మ్యాచ్ ముగిసిన తర్వాత టీమిండియా మాజీ సహచరుడు ఇషాంత్ శర్మతో 42 ఏళ్ల ధోని సరదాగా మాట్లాడుతూ కనిపిస్తాడు.
డీసీకి చెందిన ఇషాంత్ శర్మతో మాట్లాడుతున్న సమయంలో ఓ అభిమాని ధోనిని హెల్మెట్ తొలగించాలని కోరుతాడు. ఈ విషయం గమనించిన ధోని వెంటనే అభిమాని కోరిక మేరకు హెల్మెట్ తీసి తన ఒత్తైన జుట్టుతో దర్శనమిస్తాడు. దీంతో అభిమాని థ్యాంక్స్ ధోనీ బాయ్ అంటూ కేకలు వేస్తాడు. గత రెండు రోజులుగా ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండటంతో ధోనిపై ప్రశంసలు కురిపిస్తున్నారు క్రికెట్ ఫ్యాన్స్.. దటీజ్ ధోనీ అంటూ.. అభిమానుల కోసం మాజీ కెప్టెన్ ఏదైనా చేస్తాడంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
Such a Sweet Gesture, Thala Dhoni Removes His Helmet when a Fan asks for it !! ❤️💛#MSDhoni #WhistlePodu #IPL2024 #CSK
🎥 via @Utkarsh60596795 pic.twitter.com/ihnw4DG9lH— TEAM MS DHONI #Dhoni (@imDhoni_fc) March 31, 2024
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి