Youngest Cricketer : భారత్ తరఫున టీ20ల్లో అరంగేట్రం చేసిన టాప్ 5 అత్యంత పిన్న వయస్కులైన ఆటగాళ్లు వీరే

Youngest Cricketer : భారత టీ20 క్రికెట్ చరిత్రలో సరికొత్త రికార్డు నమోదైంది. కేవలం 15 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసి సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలు కొట్టాడు వైభవ్ సూర్యవంశీ. టీ20ల్లో భారత్ తరఫున బరిలోకి దిగిన టాప్ 5 యంగెస్ట్ ప్లేయర్ల పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Youngest Cricketer : భారత్ తరఫున టీ20ల్లో అరంగేట్రం చేసిన టాప్ 5 అత్యంత పిన్న వయస్కులైన ఆటగాళ్లు వీరే
Vaibhav Suryavanshi

Updated on: Jul 07, 2026 | 6:31 PM

Youngest Cricketer : ఐపీఎల్ ఎంతో మంది యువ ఆటగాళ్లకు టీమిండియా తరఫున అంతర్జాతీయ టీ20ల్లో ఆడేందుకు అద్భుతమైన అవకాశాలను కల్పించింది. అయితే బ్లూ జెర్సీ వేసుకుని తన మొదటి మ్యాచ్ ఆడకముందే సోషల్ మీడియా నుంచి క్రికెట్ పండితుల వరకు అందరి దృష్టిని ఆకర్షించిన వండర్ కిడ్ ఎవరైనా ఉన్నారా అంటే.. దానికి సమాధానం ఒక్కరే, తనే వైభవ్ సూర్యవంశీ. ఎప్పుడెప్పుడా అని అందరూ ఎదురుచూస్తున్న ఈ 15 ఏళ్ల యువ బ్యాటింగ్ సంచలనం ఎట్టకేలకు అంతర్జాతీయ క్రికెట్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు. ఇటీవల జరిగిన ఐపీఎల్ 2026 సీజన్ లో తన అద్భుతమైన ఆటతీరుతో దుమ్మురేపినందుకు గాను, ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనలకు వెళ్లే భారత టీ20 జట్టులో ఈ చిన్నారికి చోటు లభించింది.

సరికొత్త చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ

ఖచ్చితంగా 15 సంవత్సరాల 99 రోజుల వయస్సులోనే వైభవ్ సూర్యవంశీ టీమిండియా తరఫున టీ20 ఇంటర్నేషనల్స్ ఆడి, భారతదేశం తరఫున ఈ ఫార్మాట్‌లో ఆడిన అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డులకెక్కాడు. 2026, జూలై 4న ఇంగ్లాండ్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా జరిగిన మ్యాచ్ ద్వారా ఆయన ఈ చారిత్రాత్మక అరంగేట్రం చేశాడు. ఈ క్రమంలో పురుషుల క్రికెట్‌తో పాటు ఓవరాల్ జాతీయ రికార్డులను కూడా వైభవ్ తిరగరాశాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి అత్యంత పిన్న వయసులోనే అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టిన పురుష ఆటగాడిగా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న 36 ఏళ్ల నాటి రికార్డును ఈ బీహార్ కుర్రాడు బద్దలు కొట్టడం విశేషం. అయితే, తన తొలి మ్యాచ్ లో వైభవ్ సాధారణ ఆరంభాన్ని మాత్రమే అందుకున్నాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన ఈ రెండో టీ20 మ్యాచ్‌లో 10 బంతులు ఎదుర్కొన్న వైభవ్ 14 పరుగులు చేశాడు. ఈ చిన్న ఇన్నింగ్స్‌లో రెండు భారీ సిక్సర్లు బాది తన పవర్ ఏంటో చూపించినప్పటికీ, ఆ తర్వాత క్రీజ్ వదిలి ముందుకు వచ్చి షాట్ ఆడబోయి స్టంప్ అవుట్‌గా వెనుదిరిగాడు.

భారత్ తరఫున టీ20ల్లో అరంగేట్రం చేసిన టాప్ 5 అత్యంత పిన్న వయస్కులు వీళ్లే

భారత క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు అత్యంత తక్కువ వయసులోనే టీ20 లలో అరంగేట్రం చేసిన టాప్ 5 ఆటగాళ్ల జాబితాను ఒకసారి పరిశీలిస్తే ఆసక్తికరమైన విషయాలు తెలుస్తాయి. ఈ లిస్టులో ప్రస్తుత స్టార్ ప్లేయర్ల నుంచి సీనియర్ బౌలర్ల వరకు ఎందరో ఉన్నారు.

రాహుల్ చాహర్ (20 సంవత్సరాల 2 రోజులు):

రాజస్థాన్‌కు చెందిన లెగ్ స్పిన్నర్ రాహుల్ చాహర్ 2019, ఆగస్టు 6న వెస్టిండీస్‌తో ప్రావిడెన్స్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ ద్వారా తన 20వ పుట్టినరోజు జరిగిన రెండు రోజులకే టీ20ల్లోకి అడుగుపెట్టాడు. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ జట్టు తరఫున టైటిల్ గెలిచిన సీజన్‌లో అద్భుత ప్రదర్శన చేయడంతో ఇతనికి జాతీయ జట్టులో అవకాశం దక్కింది. ఈ మ్యాచ్‌లో తన బంధువు దీపక్ చాహర్‌తో కలిసి ఒకేసారి బరిలోకి దిగడంతో చాహర్ కుటుంబానికి ఇది ఒక ఎమోషనల్ మూమెంట్‌గా నిలిచింది.

ఇషాంత్ శర్మ (19 సంవత్సరాల 152 రోజులు):

ఢిల్లీకి చెందిన 6 అడుగుల 4 అంగుళాల పొడవైన ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మ, 2008 ఫిబ్రవరి 1న ఆస్ట్రేలియాపై తన మొదటి టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడాడు. అరంగేట్రం చేసే సమయానికి అతని వయస్సు 19 సంవత్సరాల 152 రోజులు మాత్రమే.

రిషభ్ పంత్ (19 సంవత్సరాల 120 రోజులు):

భారత స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ 2017, ఫిబ్రవరి 1న టీమిండియా తరఫున టీ20ల్లో అరంగేట్రం చేశాడు. అప్పట్లో 19 సంవత్సరాల 120 రోజుల వయసులోనే బరిలోకి దిగిన పంత్, అప్పటివరకు ఇషాంత్ శర్మ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టి, భారతదేశం తరఫున టీ20 ఆడిన అత్యంత పిన్న వయస్కుడిగా నిలిచాడు.

వాషింగ్టన్ సుందర్ (18 సంవత్సరాల 80 రోజులు):

వైభవ్ సూర్యవంశీ రాకముందు వరకు భారత్ తరఫున టీ20ల్లో అత్యంత పిన్న వయస్కుడైన ఆటగాడిగా వాషింగ్టన్ సుందర్ రికార్డుల్లో మొదటి స్థానంలో ఉండేవాడు. 2017, డిసెంబర్ 24న కేవలం 18 సంవత్సరాల 80 రోజుల వయసులోనే సుందర్ భారత్ తరఫున అరంగేట్రం చేశాడు. తన తమిళనాడు సీనియర్ జట్టు సహచరుడు ఆర్. అశ్విన్ అడుగుజాడల్లో నడిచిన సుందర్, ఐపీఎల్‌లో రైజింగ్ పూణే సూపర్‌జెయింట్స్ జట్టులో గాయపడిన అశ్విన్ స్థానంలో వచ్చి అద్భుతంగా రాణించి అందరి దృష్టిని ఆకర్షించాడు. ప్రస్తుతం వైభవ్ సూర్యవంశీ (15 ఏళ్ల 99 రోజులు) మొదటి స్థానాన్ని ఆక్రమించడంతో వాషింగ్టన్ సుందర్ ఈ జాబితాలో రెండో స్థానానికి పడిపోయాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

 

Loading...
Unable to load recommendations.
Follow Us