WI vs IND 2023: క్రికెట్ లవర్స్‌కి శుభవార్త.. ఐపీఎల్ తరహాలోనే వెస్ట్‌ ఇండీస్ సిరీస్‌ కూడా..

WI vs IND Series: బుధవారం నుంచి ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ ఆడుతున్న టీమిండియా.. జూన్ నెలలో వెస్ట్ ఇండీస్ పర్యటనకు వెళ్లనుంది. ఆ దేశంలో భారత జట్టు కలిసి 2 టెస్టులు, 3 వన్డేలు, 5 టీ20 మ్యాచ్‌లు ఆడుతుంది. ఈ నేపథ్యంలో క్రికెట్ ప్రేమికులకు జియో సినిమా..

WI vs IND 2023: క్రికెట్ లవర్స్‌కి శుభవార్త.. ఐపీఎల్ తరహాలోనే వెస్ట్‌ ఇండీస్ సిరీస్‌ కూడా..
WI vs IND Series 2023

Updated on: Jun 07, 2023 | 5:40 PM

WI vs IND Series: బుధవారం నుంచి ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ ఆడుతున్న టీమిండియా.. జూన్ నెలలో వెస్ట్ ఇండీస్ పర్యటనకు వెళ్లనుంది. ఆ దేశంలో భారత జట్టు కలిసి 2 టెస్టులు, 3 వన్డేలు, 5 టీ20 మ్యాచ్‌లు ఆడుతుంది. ఈ నేపథ్యంలో క్రికెట్ ప్రేమికులకు జియో సినిమా ఓ తీపికబురు చెప్పింది. అదేమిటంటే.. జూన్ 12 నుంచి ప్రారంభం కానున్న ఈ సిరీస్‌ని జియో సినిమాలో ఉచితంగానే వీక్షించవచ్చు. ఈ సదుపాయం అన్ని మ్యాచ్‌లకు వర్తిస్తుందని కూడా రిలయన్స్‌ జియో ఇన్ఫోకామ్‌ అధినేత ఆకాశ్‌ అంబానీ స్వయంగా వెల్లడించారు.

కాగా, ఇటీవల ముగిసిన ఐపీఎల్ 16వ సీజన్‌‌లోని తొలి మ్యాచ్ నుంచి ఫైనల్ మ్యాచ్ వరకు లైవ్ స్ట్రీమింగ్‌ని జియో సినిమా ఉచితంగానే అందించింది. తద్వారా క్రికెట్ అభిమానులకు అంతకముందులా ఎటువంటి సబ్‌స్క్రిప్షన్ తీసుకునే భారం తగ్గిన సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి

టీమిండియా విండీస్‌‌ టూర్ షెడ్యూల్

  • తొలి టెస్ట్‌- జులై 12-16, డొమినికా
  • రెండో టెస్ట్‌- జులై 20-24, పోర్ట్‌ ఆఫ్‌ స్పెయిన్‌
  • జులై 27- తొలి వన్డే, బ్రిడ్జ్‌ టౌన్‌
  • జులై 29- రెండో వన్డే, బ్రిడ్జ్‌ టౌన్‌
  • ఆగస్ట్‌ 1- మూడో వన్డే, పోర్ట్‌ ఆఫ్‌ స్పెయిన్‌
  • ఆగస్ట్‌ 4- తొలి టీ20, పోర్ట్‌ ఆఫ్‌ స్పెయిన్‌
  • ఆగస్ట్‌ 6- రెండో టీ20, గయానా
  • ఆగస్ట్‌ 8- మూడో టీ20, గయానా
  • ఆగస్ట్‌ 12- నాలుగో టీ20, ఫ్లోరిడా
  • ఆగస్ట్‌ 13- ఐదో టీ20, ఫ్లోరిడా

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us