
రాయ్‌పూర్‌లో భారత్ మహిళల జట్టు, జింబాబ్వే మహిళల జట్టు మధ్య తొలి టీ20 మ్యాచ్ జరుగుతోంది. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ శుక్రవారం ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో ఇరు జట్ల ఆటగాళ్లు చేతులకు నల్ల బ్యాండ్లు ధరించి బరిలోకి దిగారు. ఇటీవల మరణించిన జింబాబ్వే మాజీ క్రికెటర్, అంపైర్ సారా దంబనేవానాకు నివాళిగా ఇరు జట్ల ఆటగాళ్లు నల్ల బ్యాండ్లు ధరించినట్లు తెలుస్తోంది.
జింబాబ్వే మాజీ క్రికెటర్, అంపైర్ సారా దంబనేవానా అక్టోబర్ 12, 2026న హరారేలో కన్నుమూశారు. ఆమె వయసు 36 సంవత్సరాలు. సారా మరణాన్ని జింబాబ్వే క్రికెట్ అధికారిక ప్రకటన ద్వారా ధృవీకరించింది.
2009 నుంచి 2014 వరకు సారా జింబాబ్వే తరపున ఫాస్ట్ బౌలర్‌గా ప్రాతినిధ్యం వహించింది. ఆ తర్వాత 2023 సెప్టెంబర్‌లో అంపైర్‌గా కొత్త ప్రయాణాన్ని ప్రారంభించింది. ఈ ఏడాది మార్చిలో వైద్య ప్రక్రియ చేయించుకున్న అనంతరం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు జింబాబ్వే క్రికెట్ తెలిపింది.
ఆమె మరణంతో భారత్, జింబాబ్వే మహిళల మధ్య రాయ్‌పూర్‌లో జరుగుతున్న తొలి టీ20లో ప్రత్యేక నివాళి అర్పించారు. సారా దంబనేవానా జ్ఞాపకార్థం ఇరు జట్ల ఆటగాళ్లు నల్ల బ్యాండ్లు ధరించి మ్యాచ్‌లో పాల్గొన్నారు.