Watch Video: 6, 6, 6, 6, 6, 6… వరుసగా 6 బంతుల్లో 6 సిక్సర్లు.. వన్డే క్రికెట్‌లో మళ్లీ సిక్సర్ల విధ్వంసం

Watch Video: టోబీ అల్బర్ట్ వన్డే క్రికెట్‌లో సంచలనం సృష్టించాడు. 21 పరుగుల వద్ద లైఫ్‌ పొందిన తర్వాత 37 బంతుల్లో 86 పరుగులతో చెలరేగాడు. రెండు ఓవర్లలో వరుసగా 6 సిక్సర్లు బాదాడు. హాంప్‌షైర్ భారీ స్కోర్ సాధించడంలో కీలక పాత్ర పోషించాడు.

Watch Video: 6, 6, 6, 6, 6, 6... వరుసగా 6 బంతుల్లో 6 సిక్సర్లు.. వన్డే క్రికెట్‌లో మళ్లీ సిక్సర్ల విధ్వంసం
Toby Albert

Updated on: Aug 10, 2026 | 5:30 PM

Watch Video: ఇంగ్లాండ్‌లో జరుగుతున్న మెట్రో బ్యాంక్ వన్డే కప్‌లో హాంప్‌షైర్ బ్యాటర్ టోబీ అల్బర్ట్ తన విధ్వంసకర బ్యాటింగ్‌తో సంచలనం సృష్టించాడు. మైదానంలో నాన్‌స్టాప్‌గా విరుచుకుపడిన అతను వరుసగా 6 బంతుల్లో 6 సిక్సర్లు బాది క్రికెట్ ప్రపంచం దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు. 21 పరుగుల వద్ద క్యాచ్ డ్రాప్ అయి లభించిన అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకుని కేవలం 37 బంతుల్లోనే 86 పరుగుల నాటౌట్ ఇన్నింగ్స్ ఆడి హాంప్‌షైర్ జట్టుకు భారీ స్కోరు అందించాడు.

రెండు వేర్వేరు ఓవర్లలో ఆరు సిక్సర్లు

క్రికెట్ చరిత్రలో హర్షెల్ గిబ్స్ (2007 వన్డే వరల్డ్ కప్), యువరాజ్ సింగ్ (2007 టీ20 వరల్డ్ కప్) ఒకే ఓవర్లో 6 సిక్సర్లు కొట్టి రికార్డు సృష్టించారు. అయితే టోబీ అల్బర్ట్ రికార్డు కాస్త భిన్నమైనది. ఇతను ఒకే ఓవర్లో కాకుండా రెండు వేర్వేరు ఓవర్లలో కలిపి ఈ వరుస 6 సిక్సర్ల ఘనతను సాధించాడు. మొదట నాంటెస్ ఓస్ట్హుయిజెన్ వేసిన ఓవర్ చివరి రెండు బంతులను సిక్సర్లుగా మలిచాడు. ఆ తర్వాత ఓలీ కిర్ట్లీ వేసిన తదుపరి ఓవర్లోని చివరి 4 బంతులను వరుసగా సిక్సర్లుగా మలచి వరుసగా 6 బంతుల్లో 6 సిక్సర్ల మార్కును అందుకున్నాడు.

క్యాచ్ డ్రాప్‌తో దొరికిన లైఫ్

టోబీ అల్బర్ట్ 21 పరుగుల వద్ద ఉన్నప్పుడు ససెక్స్ ఫీల్డర్లు అతనికి ఒక సులువైన క్యాచ్‌ను నేలపాలు చేసి లైఫ్ లైన్ ఇచ్చారు. అక్కడి నుంచి గేర్ మార్చిన టోబీ, మైదానం నలుమూలలా బౌండరీల వర్షం కురిపించాడు. కేవలం 37 బంతుల్లో 8 సిక్సర్లు, 5 ఫోర్ల సాయంతో 86 పరుగులు సాధించి నాటౌట్‌గా నిలిచాడు. టోబీ అల్బర్ట్ కంటే ముందు హాంప్‌షైర్ ఓపెనర్లు అలీ ఓర్ (105), బెన్ మేస్ (109) కూడా అద్భుతమైన సెంచరీలతో రాణించారు.

ససెక్స్‌పై హాంప్‌షైర్ ఘన విజయం

ఈ ముగ్గురు బ్యాటర్ల తుఫాను ఇన్నింగ్స్‌ల పుణ్యమా అని హాంప్‌షైర్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 383 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది. అనంతరం 384 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ససెక్స్ జట్టు, హాంప్‌షైర్ బౌలర్ల ధాటికి తట్టుకోలేక 332 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో హాంప్‌షైర్ జట్టు మ్యాచ్‌ను కైవసం చేసుకుంది.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us