AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

3.3 ఓవర్లలోనే మ్యాచ్‌ క్లోజ్.. 14 బంతుల్లో దూల తీర్చేసిన ప్లేయర్..!

Fastest T20 Chase: మెరుపు వేగంతో లక్ష్యాన్ని ఛేదించి కువైట్ అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో సంచలనం సృష్టించింది. ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ క్వాలిఫయర్స్‌లో మంగోలియా నిర్దేశించిన కనీస లక్ష్యాన్ని కువైట్ ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా కేవలం 21 బంతుల్లోనే ఛేదించి, 10 వికెట్ల తేడాతో విజయం నమోదు చేసింది.

3.3 ఓవర్లలోనే మ్యాచ్‌ క్లోజ్.. 14 బంతుల్లో దూల తీర్చేసిన ప్లేయర్..!
Kuwait Vs Mongolia T20 Match
Venkata Chari
|

Updated on: Oct 08, 2026 | 9:29 PM

Share

T20 Run Chase Record: అంతర్జాతీయ టీ20 క్రికెట్ చరిత్రలోనే అత్యంత ఏకపక్ష మ్యాచ్‌లలో ఒకదానికి కౌలాలంపూర్ సాక్ష్యంగా నిలిచింది. ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ ఆసియా సబ్-రీజనల్ క్వాలిఫయర్ ‘ఎ’ టోర్నమెంట్‌లోని ఆరో మ్యాచ్‌లో కువైట్, మంగోలియాను కేవలం 3.3 ఓవర్లలోనే ఓడించింది. కౌలాలంపూర్‌లోని బయుమాస్ ఓవల్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో, టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న మంగోలియా జట్టు నిర్ణయం పూర్తిగా తలక్రిందులైంది. కువైట్ బౌలర్ల క్రమశిక్షణతో కూడిన, ఘాటైన దాడికి తలొగ్గిన మంగోలియా బ్యాటర్లు పెవిలియన్‌కు తరలివెళ్లారు.

ఈలోగా, గాండెంబరెల్ గున్‌బోల్డ్ 21 పరుగులు సాధించాడు. ఈ ఇరవై ఒక్క పరుగుల సహాయంతో, మంగోలియా జట్టు 14.5 ఓవర్లలో కేవలం 42 పరుగులు మాత్రమే చేయగలిగింది. కువైట్ తరపున అత్యుత్తమ బౌలింగ్ దాడిని నడిపించిన కెప్టెన్ మహమ్మద్ అస్లాం, 4 ఓవర్లలో కేవలం 19 పరుగులకే 5 కీలక వికెట్లు పడగొట్టాడు. అతనికి చక్కగా సహకరించిన షిరాజ్ ఖాన్ 2 వికెట్లు తీసి రాణించాడు.

ఎక్కువమంది చదివినది: IND vs WI 2nd T20I: 2వ టీ20 నుంచి అతన్ని పీకేయాల్సిందే.. ఆ టీమిండియా డేంజరస్ ప్లేయర్ ఎంట్రీ?

ఇవి కూడా చదవండి

మ్యాచ్ 3.3 ఓవర్లలో ముగిసింది..!

కేవలం 43 పరుగుల సులువైన లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో, కువైట్ ఓపెనర్లు ఈ మ్యాచ్‌ను టీ20 ఇన్నింగ్స్ లా కాకుండా టీ10 శైలిలో ముగించారు. ఓపెనర్ రవిజ సందరువాన్ 14 బంతుల్లో 4 ఫోర్లు, 2 భారీ సిక్సర్లతో 30 పరుగులు చేయగా, అద్నాన్ ఇద్రిస్ 7 బంతుల్లో 13 పరుగులు సాధించాడు. దీంతో కువైట్ జట్టు కేవలం 3.3 ఓవర్లలో, అంటే 21 బంతుల్లోనే మ్యాచ్‌ను ముగించింది. మంగోలియాపై 10 వికెట్ల తేడాతో సాధించిన ఈ విజయంతో, కువైట్ తన నెట్ రన్ రేట్‌ను గణనీయంగా పెంచుకుని, టోర్నమెంట్ పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది.

ఇది ప్రపంచ రికార్డు కాదు..!

కువైట్ జట్టు మ్యాచ్‌ను కేవలం 3.3 బంతుల్లోనే ముగించినప్పటికీ, ఇది ప్రపంచ రికార్డు కాదు, ఎందుకంటే ఒక టీ20 క్రికెట్ మ్యాచ్ కేవలం 2 బంతుల్లోనే ముగిసిన చరిత్ర ఉంది. అత్యంత వేగవంతమైన పరుగుల ఛేదన: 2023లో ఐల్ ఆఫ్ మ్యాన్‌పై 11 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన తర్వాత స్పెయిన్ కేవలం 2 బంతుల్లో (0.2 ఓవర్లలో) సాధించిన విజయం, పురుషుల అంతర్జాతీయ టీ20 క్రికెట్ చరిత్రలో సర్వకాలిక ప్రపంచ రికార్డుగా నిలిచింది.

ఎక్కువమంది చదివినది: IND vs WI: రాంచీలో శ్రేయస్ సేన సరికొత్త చరిత్రకు సిద్ధం..? ఇప్పటి వరకు ఎవరూ సాధించని రికార్డ్‌పై కన్ను!

ఐసీసీ పూర్తి సభ్య దేశాల రికార్డు: 2024 టీ20 ప్రపంచకప్‌లో ఒమన్‌పై 48 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్ కేవలం 3.1 ఓవర్లలో (19 బంతుల్లో) ఛేదించి, పూర్తి సభ్య దేశాలలో అత్యంత వేగవంతమైన రన్ ఛేజ్‌ను నమోదు చేసింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us