ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్-18 మెగా వేలానికి ముందు, కొన్ని కీలక అప్‌డేట్‌లు వస్తున్నాయి. ఈ అప్‌డేట్‌లలో అత్యంత కీలకమైనది సూర్యకుమార్ యాదవ్ జట్టు మార్పు గురించి వస్తోంది. ఐపీఎల్ 2025లో ముంబై ఇండియన్స్ తరపున సూర్య ఆడడని అంటున్నారు. సూర్యకుమార్ యాదవ్ ముంబై ఇండియన్స్ జట్టు నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నాడని, వచ్చే సీజన్ మెగా వేలంలో కనిపించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గత సీజన్‌లో ముంబై ఫ్రాంచైజీ సూర్యను పక్కన పెట్టడం కూడా దీనికి ఒక కారణం. అంటే రోహిత్ శర్మ తర్వాత ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్సీ తనకు దక్కుతుందని సూర్యకుమార్ భావించాడు.
కానీ, ముంబై ఇండియన్స్ జట్టు నుంచి తప్పుకున్న హార్దిక్ పాండ్యాను మళ్లీ జట్టులోకి తీసుకుని నాయకత్వ బాధ్యతలు అందించారు. ఫ్రాంచైజీ నిర్ణయంపై సూర్యకుమార్ అసంతృప్తిగా ఉన్నాడు. దీంతో అతడిని ఈసారి ముంబై ఇండియన్స్ జట్టులో రిటైన్ చేయకూడదని నిర్ణయించుకున్నట్లు సమాచారం.
కొత్త కెప్టెన్ల ఎంపికపై పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ ఫ్రాంచైజీలు ఆసక్తిగా ఉన్నాయనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. దీంతో మెగా వేలంలో సూర్యకుమార్ యాదవ్ కనిపిస్తే కొత్త జట్టుకు కెప్టెన్‌గా ఎంపికవుతాడని చెప్పవచ్చు.
దీంతో ఇప్పుడు సూర్యకుమార్ యాదవ్ భారీ బిడ్డింగ్‌తో కొత్త జట్టుకు సారథ్యం వహించాలని ఎదురు చూస్తున్నాడు. అందుకే, ఐపీఎల్ మెగా వేలానికి ముందే సూర్య ముంబై ఇండియన్స్ జట్టును వీడి కొత్త జట్టులో చేరినా ఆశ్చర్యపోనవసరం లేదు.
ప్రస్తుతం భారత జట్టు లంక పర్యటనకు వెళ్లింది. ఈ పర్యటనలో 3 టీ20లు, 3 వన్డే మ్యాచ్‌లు ఆడనుంది. అయితే, హార్దిక్ పాండ్యాకు షాక్ ఇస్తూ.. బీసీసీఐ సెలెక్టర్లు సూర్యకుమార్ యాదవ్‌ను టీ20 సారథిగా నియమించారు. వన్డేలకు మాత్రం రోహిత్ శర్మనే సారథిగా ఉంచారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..