Sarfaraz Khan Maiden Test Hundre: శనివారం బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియంలో భారత్ – న్యూజిలాండ్ మధ్య జరుగుతోన్న తొలి టెస్టులో సర్ఫరాజ్ ఖాన్ తన తొలి అంతర్జాతీయ సెంచరీని నమోదు చేశాడు.
తొలి టెస్టు సెంచరీ కొట్టేందుకు సర్ఫరాజ్ ఖాన్‌కు ఏడు ఇన్నింగ్స్‌లు పట్టింది. సర్ఫరాజ్ ఖాన్ 110 బంతుల్లో 13 ఫోర్లు, 3 సిక్సర్లతో ఈ ఘనతను సాధించాడు.
శుభ్‌మన్ గిల్ గాయంతో భారత జట్టులో చోటు దక్కించుకున్న 26 ఏళ్ల సర్ఫరాజ్ ఖాన్.. ఈ ఏడాది రాజ్‌కోట్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టులో అరంగేట్రం చేశాడు. కివీస్‌తో జరిగిన మొదటి ఇన్నింగ్స్‌లో, అతను డకౌట్‌కి ఔటయ్యాడు. అయితే, రెండో ఇన్నింగ్స్‌లో అద్భుతంగా పునరాగమనం చేశాడు. విరాట్ కోహ్లితో మూడో వికెట్‌కు వందకుపైగా భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.
A moment Sarfaraz Khan will remember forever! ☺️
He is jubilant, Rishabh Pant applauds & the dressing room on its feet! 👏 👏
Live ▶️ https://t.co/8qhNBrrtDF#TeamIndia | #INDvNZ | @IDFCFIRSTBank pic.twitter.com/pwt12jHfND
— BCCI (@BCCI) October 19, 2024
ఈ నెల ప్రారంభంలో రెస్ట్ ఆఫ్ ఇండియాతో జరిగిన ఇరానీ కప్‌లో ముంబై తరపున సర్ఫరాజ్ డబుల్ సెంచరీ సాధించాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో 15 సెంచరీలు చేశాడు.
మూడో రోజు చివరి బంతికి విరాట్ కోహ్లీ (70 పరుగులు) ఔటయ్యాడు. గ్లెన్ ఫిలిప్స్ బౌలింగ్‌లో వికెట్ కీపర్ టామ్ బ్లండెల్ చేతికి చిక్కాడు. 52 పరుగుల వద్ద రోహిత్ శర్మ, 35 పరుగుల వద్ద యశస్వి జైస్వాల్ ఔట్ అయ్యారు. అజాజ్ పటేల్ 2 వికెట్లు, గ్లెన్ ఫిలిప్స్ 1 వికెట్ తీశారు. కోహ్లీ, సర్ఫరాజ్ మధ్య మూడో వికెట్‌కు 136 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది.
న్యూజిలాండ్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 402 పరుగులకు ఆలౌటైంది. దీంతో ఆ జట్టు 356 పరుగుల ఆధిక్యం సాధించింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో రెండో రోజు న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ను 46 పరుగులకు ఆలౌట్ చేసింది. వర్షం కారణంగా తొలిరోజు ఆట జరగలేదు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..