Akriti Agarwal : ఎవరీ ఆకృతి అగర్వాల్? పృథ్వీ షా మనసు దోచిన ముద్దుగుమ్మ తెలుగు హీరోయిన్ అంట

Prithvi Shaw Akriti Agarwal : భారత క్రికెటర్ పృథ్వీ షా, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ఆకృతి అగర్వాల్‌తో నిశ్చితార్థం చేసుకున్నారు. ఆకృతి త్వరలో త్రిముఖ అనే తెలుగు సినిమాతో హీరోయిన్‌గా పరిచయం కాబోతోంది. ఇన్ స్టాగ్రామ్‌లో ఆమెకు దాదాపు 34 లక్షల మంది ఫాలోయర్లు ఉన్నారు

Akriti Agarwal : ఎవరీ ఆకృతి అగర్వాల్? పృథ్వీ షా మనసు దోచిన ముద్దుగుమ్మ తెలుగు హీరోయిన్ అంట
Akriti Agarwal

Updated on: Mar 09, 2026 | 6:40 PM

Prithvi Shaw Akriti Agarwal : టీమిండియా డాషింగ్ ఓపెనర్ పృథ్వీ షా తన బ్యాటింగ్‌తో ఎంతగా అలరిస్తాడో, తన పర్సనల్ లైఫ్‌తోనూ అంతే వార్తల్లో ఉంటాడు. తాజాగా ఈ యంగ్ క్రికెటర్ తన లాంగ్ టైమ్ గర్ల్‌ఫ్రెండ్ ఆకృతి అగర్వాల్‎తో నిశ్చితార్థం చేసుకుని అందరినీ సర్ ప్రైజ్ చేశాడు. మార్చి 8, 2026న (మహిళా దినోత్సవం సందర్భంగా) వీరిద్దరూ ఉంగరాలు మార్చుకున్న ఫోటోలను షేర్ చేస్తూ, గ్రౌండ్‌లో సిక్సర్లు కొట్టడం నుంచి.. జీవితంలో పర్ఫెక్ట్ ఇన్నింగ్స్ మొదలుపెట్టే వరకు అంటూ రొమాంటిక్ క్యాప్షన్ ఇచ్చాడు. మరి ఈ పృథ్వీ షా కాబోయే భార్య ఆకృతి అగర్వాల్ ఎవరు? ఆమె బ్యాగ్రౌండ్ ఏంటి? అనే వివరాలు ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉన్నాయి.

ఆకృతి అగర్వాల్ కేవలం పృథ్వీ షా గర్ల్‌ఫ్రెండ్ మాత్రమే కాదు, ఆమె ఒక పాపులర్ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్, నటి. లక్నోలో పుట్టిన ఆకృతి, చదువు కోసం ముంబైకి షిఫ్ట్ అయింది. ఇన్ స్టాగ్రామ్‌లో ఆమెకు దాదాపు 34 లక్షల మంది ఫాలోయర్లు ఉన్నారు. ఫ్యాషన్, లైఫ్ స్టైల్, డ్యాన్స్ వీడియోలతో ఆమె నెటిజన్లను ఆకట్టుకుంటుంది. ఇక సినిమాల విషయానికి వస్తే.. రాజేష్ నాయుడు దర్శకత్వంలో వస్తున్న త్రిముఖ అనే తెలుగు సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ మూవీతో ఆమె హీరోయిన్‌గా వెండితెరకు పరిచయం కాబోతోంది.

ఆకృతి కేవలం గ్లామర్ ఫీల్డ్ లోనే కాదు, చదువులోనూ టాప్ అని చెప్పొచ్చు. ముంబైలోని నిర్మల మెమోరియల్ ఫౌండేషన్ కాలేజీ నుంచి ఆమె బ్యాచిలర్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్ పూర్తి చేసింది. సోషల్ మీడియా ద్వారా ఆమె భారీగానే సంపాదిస్తోంది. మీడియా నివేదికల ప్రకారం, ఆమె నికర విలువ సుమారు రూ.2 నుంచి 4 కోట్ల వరకు ఉంటుంది. కేవలం ఇన్‌స్టాగ్రామ్ బ్రాండ్ కొల్లాబరేషన్ల ద్వారానే నెలకు రూ.6 లక్షల వరకు ఆదాయం పొందుతున్నట్లు సమాచారం.

గత కొన్నాళ్లుగా ఫామ్, ఫిట్‌నెస్ సమస్యలతో సతమతమైన పృథ్వీ షా, 2026 ఐపీఎల్ సీజన్ ద్వారా మళ్ళీ ట్రాక్‌లోకి రావాలని చూస్తున్నాడు. 2025 సీజన్‌లో అతడిని ఏ టీమ్ కొనుగోలు చేయకపోవడంతో అందరూ షాక్ అయ్యారు. అయితే, 2026 మినీ వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ మళ్ళీ తన పాత ఆటగాడిపై నమ్మకం ఉంచి రూ.75 లక్షల బేస్ ప్రైస్‌కు కొనుగోలు చేసింది. పర్సనల్ లైఫ్ లో ఎంగేజ్‌మెంట్‌తో కొత్త ఇన్నింగ్స్ మొదలుపెట్టిన షా, గ్రౌండ్‌లో కూడా తన పాత బ్యాటింగ్ పవర్‌ను చూపిస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us