Video: భార్యతో విడాకులు.. క్లోజ్ ఫ్రెండ్‌తో ఎఫైర్ రూమర్స్.. కట్‌చేస్తే.. విధి రాతకే చెమటలు పట్టించేశాడుగా

Preity Zinta Give Hug and Player of the Match Award to Yuzvendra Chahal: కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన చేసిన యుజ్వేంద్ర చాహల్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. అలాగే, ప్రీతి జింటా నుంచి చాహల్ ఊహించని గిఫ్ట్ అందుకున్నాడు. మ్యాచ్ విన్నింగ్ ఆటతో అదరగొట్టిన చాహల్‌ను కౌగిలించుకుని ప్రశంసల వర్షం కురిపించింది ప్రీతి జింటా.

Video: భార్యతో విడాకులు.. క్లోజ్ ఫ్రెండ్‌తో ఎఫైర్ రూమర్స్.. కట్‌చేస్తే.. విధి రాతకే చెమటలు పట్టించేశాడుగా
Preity Zinta Give Hug To Yuzvendra Chahal

Updated on: Apr 16, 2025 | 11:08 AM

Preity Zinta Give Hug and Player of the Match Award to Yuzvendra Chahal: ఐపీఎల్ (IPL) 2025 లో ఏప్రిల్ 15 రాత్రి ఎవ్వరూ ఊహించనిది చోటు చేసుకుంది. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ 16 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టి ఐపీఎల్ చరిత్రలో అత్యల్ప స్కోర్ మ్యాచ్‌ను డిఫెండ్ చేసుకుంది. అది 111 పరుగుల స్కోరును కాపాడుకుని, కేకేఆర్‌ను 16 పరుగుల తేడాతో ఓడించింది. పంజాబ్ సాధించిన ఈ సంచలన విజయంలో యుజ్వేంద్ర చాహల్ హీరోగా ఎదిగాడు. ఓడిపోయే మ్యాచ్‌ను మలుపు తిప్పిన ఈ ప్లేయర్.. పంజాబ్‌కు అద్బుత విజయాన్ని అందించాడు. జట్టును గెలిపించిన ఈ మాంత్రికుడి ప్రదర్శనతో పంజాబ్ కింగ్స్ యజమాని ప్రీతి జింటా కూడా ఫుల్ ఖుషీ అయింది.

చాహల్ అద్భుతమైన ప్రదర్శనతో ప్రీతి జింటా సంతోషం..

కేకేఆర్‌తో మ్యాచ్‌కు ముందు, చాహల్ 5 మ్యాచ్‌ల్లో కేవలం 2 వికెట్లు మాత్రమే పడగొట్టాడు. కానీ, కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన ఒకే ఒక్క మ్యాచ్‌లో అతను దానిని భర్తీ చేసుకున్నాడు. చాహల్ అత్యుత్తమ ప్రదర్శన ఇస్తాడని జట్టు ఆశించిన మ్యాచ్ ఇది. మేనేజ్‌మెంట్ ఆశించినట్లే రాణించి, జట్టుకు మరిచిపోలేని విజయం అందించాడు. చాహల్ 4 ఓవర్లు బౌలింగ్ వేసి 28 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. అతను మొదట రహానేను అవుట్ చేయడం ద్వారా మ్యాచ్ గమనాన్ని మార్చేశాడు. ఆ తర్వాత అంగ్క్రిష్ రఘువంశీ, రింకూ సింగ్, రమణదీప్ సింగ్ కూడా అవుట్ చేశాడు.

చాహల్‌కు ఊహించని షాకిచ్చిన ప్రీతి జింటా?

కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన చేసిన యుజ్వేంద్ర చాహల్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. అలాగే, ప్రీతి జింటా నుంచి చాహల్ ఊహించని గిఫ్ట్ అందుకున్నాడు. మ్యాచ్ విన్నింగ్ ఆటతో అదరగొట్టిన చాహల్‌ను కౌగిలించుకుని ప్రశంసల వర్షం కురిపించింది ప్రీతి జింటా.

ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన బౌలర్ యుజ్వేంద్ర చాహల్ అని అందరికీ తెలిసిందే. చాహల్ మ్యాచ్ విన్నర్ అని ప్రపంచానికి కూడా తెలుసు. అతని సామర్థ్యాలను చూసే పంజాబ్ కింగ్స్ యజమాని ప్రీతి జింటా కూడా ఐపీఎల్ 2025 వేలంలో అతనికి రూ. 18 కోట్లు ఆఫర్ చేసింది. మంచి విషయం ఏమిటంటే, పంజాబ్ కింగ్స్‌కు అవసరమైన సమయంలో యుజ్వేంద్ర చాహల్ ఆ రూ. 18 కోట్ల ధరకు తగిన ఆటతో రుణం తీర్చుకున్నాడు.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..