PAK vs IND: టాస్ గెలిచిన పాకిస్తాన్.. భారత్ బౌలింగ్.. అందరి చూపు ఆ ఒక్కడిపైనే..!

Pakistan U19 vs India U19 Final: ఈ రెండు జట్లు ఇప్పటివరకు 31 యూత్ వన్డేలు ఆడాయి. భారత్ 17 మ్యాచ్‌లు గెలవగా, పాకిస్థాన్ 13 మ్యాచ్‌లు గెలుచుకుంది, ఒక మ్యాచ్ టైగా ముగిసింది. అయితే, టోర్నమెంట్‌లోని చివరి ఐదు మ్యాచ్‌లలో పాకిస్థాన్ మూడు, భారత్ రెండు గెలిచినట్లు తెలుస్తోంది.

PAK vs IND: టాస్ గెలిచిన పాకిస్తాన్.. భారత్ బౌలింగ్.. అందరి చూపు ఆ ఒక్కడిపైనే..!
Ind U19 Vs Pak U19 Records

Updated on: Nov 14, 2026 | 10:22 AM

Pakistan U19 vs India U19, Final, ACC Men’s U19 Asia Cup 2026: అండర్-19 ఆసియా కప్ ఫైనల్లో భాగంగా భారత, పాకిస్తాన్ అండర్-19 జట్లు తలపడేందుకు సిద్ధమయ్యాయి. టాస్ గెలిచిన పాకిస్తాన్ జట్టు ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో భారత్ బౌలింగ్ చేయనుంది. ఈ మ్యాచ్ ఒమన్‌లోని అల్ ఎమిరేట్స్ క్రికెట్ గ్రౌండ్‌లో మొదలైంది. ఈ టోర్నమెంట్‌లో ఈ రెండు జట్లు ఇదివరకే తలపడగా, ఆ గ్రూప్ దశ మ్యాచ్‌లో పాకిస్థాన్ 3 వికెట్ల తేడాతో భారత్‌ను ఓడించింది.

సెమీఫైనల్స్‌లో ఆఫ్ఘనిస్తాన్‌ను 8 వికెట్ల తేడాతో ఓడించి భారత్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. మరోవైపు, సెమీఫైనల్స్‌లో బంగ్లాదేశ్‌ను 9 వికెట్ల తేడాతో పాకిస్థాన్ ఓడించింది. ఈ టోర్నమెంట్‌లో ఇప్పటివరకు ఆ జట్టు అజేయంగా కొనసాగుతోంది.

ఇండియా ప్లేయింగ్ ఎలెవన్: లక్ష్య రాజేష్ రాయచందానీ (కెప్టెన్), ఆర్యవీర్ సెహ్వాగ్, వీకే వినీత్, అర్జున్ రాజ్‌పుత్, యశ్వర్ధన్ చౌహాన్, అన్వయ్ ద్రవిడ్ (వికెట్ కీపర్), మనల్ చౌహాన్, మోహిత్ ఉల్వా, ఆర్యన్ సావ్సాని, కావ్య పటేల్, సి వెంకట్.

ఇవి కూడా చదవండి

పాకిస్థాన్ ప్లేయింగ్ ఎలెవన్: ఉస్మాన్ ఖాన్, అబ్దుల్ ఖాదిర్, ఫర్హాన్ యూసుఫ్ (కెప్టెన్), అహ్మద్ హుస్సేన్, అలీ రజా, హమ్జా జహూర్ (వికెట్ కీపర్), హస్నైన్ అబ్బాస్ దార్, మహ్మద్ సయ్యామ్, రిజ్వానుల్లా, నికాబ్ షఫీక్, హయామ్ ఖాన్.

భారతదేశానిదే పైచేయి..

ఈ రెండు జట్లు ఇప్పటివరకు 31 యూత్ వన్డేలు ఆడాయి. భారత్ 17 మ్యాచ్‌లు గెలవగా, పాకిస్థాన్ 13 మ్యాచ్‌లు గెలుచుకుంది, ఒక మ్యాచ్ టైగా ముగిసింది. అయితే, టోర్నమెంట్‌లోని చివరి ఐదు మ్యాచ్‌లలో పాకిస్థాన్ మూడు, భారత్ రెండు గెలిచినట్లు తెలుస్తోంది.

భారత్ – పాకిస్తాన్ నాలుగోసారి ఫైనల్‌కు చేరాయి..

భారత్, పాకిస్తాన్ జట్లు అండర్-19 ఆసియా కప్ ఫైనల్‌లో నాలుగోసారి తలపడనున్నాయి. గతంలో ఈ రెండు జట్లు మూడుసార్లు ఫైనల్ పోరులో తలపడ్డాయి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us