Pakistan squad for T20 World Cup 2024: జూన్ 1 నుంచి 29 మధ్య యునైటెడ్ స్టేట్స్, కరేబియన్‌లలో జరగనున్న ICC T20 పురుషుల ప్రపంచ కప్ 2024 కోసం పాకిస్తాన్ తన 15 మంది సభ్యుల జట్టును ప్రకటించింది. బాబర్ ఆజం కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఈ మేరకు పీసీబీ ఓ ప్రకటన చేసింది. “ఇది చాలా ప్రతిభావంతులైన, సమతుల్యమైన జట్లు. ఇది యువత, సీనియర్ల మిశ్రమాన్ని కలిగి ఉంటుంది. ఈ ఆటగాళ్లు కొంతకాలంగా కలిసి ఆడుతున్నారు. వచ్చే నెలలో జరిగే ఈవెంట్‌కు బాగా సిద్ధమయ్యారు” అంటూ పీసీబీ తన ప్రకటనలో తెలిపింది.
ఫాస్ట్ బౌలర్ హారిస్ రౌఫ్ ఫిబ్రవరిలో పాకిస్తాన్ సూపర్ లీగ్ మ్యాచ్‌లో భుజం గాయంతో దూరమయ్యాడు. ఆ తర్వాత కోలుకుని తిరిగి ప్రపంచకప్ జట్టులోకి వచ్చాడు. అయితే ప్రపంచ కప్‌నకు ముందు ఐర్లాండ్ పర్యటనకు సెలక్ట్ చేసినా.. హసన్ అలీని మినహాయించడం విశేషం.
“హరిస్ రవూఫ్ పూర్తిగా ఫిట్‌గా ఉన్నాడు, నెట్స్‌లో బాగా బౌలింగ్ చేస్తాడు. అతను హెడ్డింగ్లీలో ఔటింగ్ పొంది ఉంటే బాగుండేది. కానీ, అతను T20 వరల్డ్‌లో ఇతర స్ట్రైక్ బౌలర్‌లతో కలిసి ఆడడంలో కీలక పాత్రను పోషిస్తాడు” అంటూ ప్రకటించింది.
భారతదేశం, ఐర్లాండ్, కెనడా, సహ-హోస్ట్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాతో పాకిస్తాన్ గ్రూప్ ఏలో ఉంది. జూన్ 6న డల్లాస్‌లో USAతో తన మొదటి గేమ్ ఆడుతుంది.
బాబర్ ఆజం (కెప్టెన్), అబ్రార్ అహ్మద్, ఆజం ఖాన్, ఫఖర్ జమాన్, హరీస్ రవూఫ్, ఇఫ్తీకర్ అహ్మద్, ఇమాద్ వసీం, మహ్మద్ అబ్బాస్ అఫ్రిది, మహ్మద్ అమీర్, మహ్మద్ రిజ్వాన్, నసీమ్ షా, సయీమ్ అయూబ్, షాదాబ్ ఖాన్, షాహీన్ షాహ్మాన్ అఫ్రిదీ, ఉస్వాన్ ఖాన్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..