
England vs South Africa, 20th Match: 2023 వన్డే ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌కి దక్షిణాఫ్రికా 400 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ముంబైలోని వాంఖడే మైదానంలో సౌతాఫ్రికా జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 399 పరుగులు చేసింది. హెన్రిచ్ క్లాసెన్ 61 బంతుల్లో సెంచరీ సాధించాడు. చివరి 10 ఓవర్లలో ఆ జట్టు 143 పరుగులు చేసింది.
దక్షిణాఫ్రికా తరపున రీజా హెండ్రిక్స్ 85, మార్కో జాన్సెన్ 75, రాస్సీ వాన్ డెర్ డస్సెన్ 60, ఐడెన్ మార్క్రామ్ 42 పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో రీస్ టాప్లీ 3 వికెట్లు పడగొట్టాడు. ఆదిల్ రషీద్, గుస్ అట్కిన్సన్ తలో 2 వికెట్లు తీశారు.
డస్సన్, హెండ్రిక్స్ మధ్య సెంచరీ భాగస్వామ్యం..
ఇన్నింగ్స్ రెండో బంతికి క్వింటన్ డి కాక్ ఔట్ అయిన తర్వాత, రీజా హెండ్రిక్స్, రస్సీ వాన్ డెర్ డుసన్ మధ్య మూడో వికెట్‌కు సెంచరీ భాగస్వామ్యం నెలకొంది. వీరిద్దరూ కలిసి 121 పరుగులు జోడించారు.
పవర్‌ప్లేలో దంచి కొట్టిన సౌతాఫ్రికా..
పవర్‌ప్లేలో సౌతాఫ్రికా ఒక వికెట్ కోల్పోయింది. కానీ, పరుగులు సాధించడంలో మాత్రం ఏమాత్రం వెనకడుగు వేయలేదు. ఇన్నింగ్స్ రెండో బంతికే క్వింటన్ డి కాక్ వికెట్ కోల్పోయాడు. ఆ తర్వాత, రీజా హెండ్రిక్స్, వాన్ డెర్ డస్సెన్ ఇన్నింగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. 5.9 రన్ రేట్ వద్ద పరుగులు చేశారు. పవర్‌ప్లే సమయంలో, రీస్ టాప్లీ వేసిన 7వ ఓవర్‌లో గరిష్టంగా 11 పరుగులు రాబట్టారు.
399/7 సౌతాఫ్రికా ముంబై 2023*
398/5 న్యూజిలాండ్ ది ఓవల్ 2015
389 వెస్టిండీస్ జార్జ్, 2019
387/5 భారత్, రాజ్‌కోట్ 2008
428/5 SA v SL ఢిల్లీ 2023
417/6 Aus v Afg పెర్త్ 2015
413/5 భారత్ v బెర్ముడా, పోర్ట్ ఆఫ్ స్పెయిన్ 2007
411/4 SA v Ire కాన్‌బెర్రా 2015
408/5 SA v WI సిడ్నీ 2015
399/7 SA v Eng ముంబై 2023*
ఇంగ్లాండ్: జోస్ బట్లర్ (కెప్టెన్ మరియు వికెట్ కీపర్), జానీ బెయిర్‌స్టో, డేవిడ్ మలన్, జో రూట్, బెన్ స్టోక్స్, హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్ (వికెట్ కీపర్/కెప్టెన్), డేవిడ్ విల్లీ, ఆదిల్ రషీద్, గుస్ అట్కిన్సన్, మార్క్ వుడ్, రీస్ టోప్లీ.
దక్షిణాఫ్రికా: ఐడెన్ మార్క్రమ్ (కెప్టెన్), క్వింటన్ డి కాక్ (వికెట్ కీపర్), రీజా హెండ్రిక్స్, రాస్సీ వాన్ డెర్ డస్సెన్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, మార్కో జాన్సెన్, గెరాల్డ్ కోయెట్జీ, కేశవ్ మహరాజ్, కగిసో రబడా, లుంగీ ఎన్గిడి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..