Pakistan: తొక్కలో స్టేడియాలు.. సీట్లు లేవు, బాత్రూంలు లేవు.. సొంత దేశంపైనే పీసీబీ ఛీప్ విమర్శలు..

|

Aug 20, 2024 | 4:49 PM

Pakistan Cricket: వచ్చే ఏడాది జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ సందర్భంగా లాహోర్‌లోని గడ్డాఫీ స్టేడియంలో కీలక మ్యాచ్‌లు నిర్వహించనున్నట్లు పీసీబీ చీఫ్ చెప్పారు. బృందాలకు ప్రయాణాన్ని సులభతరం చేయడానికి సమీపంలో ఒక హోటల్‌ను నిర్మించే ప్రణాళికలు కూడా ఆమోదించారు. అయితే, టోర్నీ సమయానికి ఇవి పూర్తవుతాయనే నమ్మకం లేదు.

Pakistan: తొక్కలో స్టేడియాలు.. సీట్లు లేవు, బాత్రూంలు లేవు.. సొంత దేశంపైనే పీసీబీ ఛీప్ విమర్శలు..
Pcb Chief Mohsin Naqvi
Follow us on

Pakistan Cricket: అంతర్జాతీయ ప్రమాణాలు, పాకిస్థాన్ స్టేడియంల మధ్య భారీ అంతరాన్ని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ అంగీకరించారు. అతను తన సొంత దేశం మైదానాలను బట్టబయలు చేశాడు. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం సన్నాహక సదుపాయాలను మెరుగుపరచడం PCB బాధ్యత అని నఖ్వీ అంగీకరించాడు. ఆయన ఇటీవల లాహోర్‌లోని గడాఫీ స్టేడియంను సందర్శించి మౌలిక సదుపాయాలను పరిశీలించారు. మొదటి నుంచి మొత్తం స్టేడియంను పునర్నిర్మించాలని నిర్ణయించుకుంటే బోర్డు ఎదుర్కొనే సవాళ్లను నఖ్వీ ఎత్తి చూపారు.

లోపాలను ఎత్తిచూపిన మొహ్సిన్ నఖ్వీ..

మొహ్సిన్ నఖ్వీ మాట్లాడుతూ, “మా స్టేడియం, ప్రపంచంలోని ఇతర స్టేడియంల మధ్య చాలా తేడా ఉంది. అవి ఏ విధంగానూ అంతర్జాతీయ స్టేడియంలు కావు. ఏ స్టేడియం కూడా అంతర్జాతీయంగా అర్హత పొందలేదు. సీట్లు లేవు, బాత్‌రూమ్‌లు లేవు, 500 మీటర్ల దూరం నుంచి చూస్తున్నట్లుగా ఉంది” అంటూ చెప్పుకొచ్చాడు. వచ్చే ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీని పాకిస్తాన్ నిర్వహించాలి. ఇందుకోసం స్టేడియంను సిద్ధం చేస్తున్న సంగతి తెలిసిందే.

స్టేడింయ పక్కనే హోటల్..

వచ్చే ఏడాది జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ సందర్భంగా లాహోర్‌లోని గడ్డాఫీ స్టేడియంలో కీలక మ్యాచ్‌లు నిర్వహించనున్నట్లు పీసీబీ చీఫ్ చెప్పారు. బృందాలకు ప్రయాణాన్ని సులభతరం చేయడానికి సమీపంలో ఒక హోటల్‌ను నిర్మించే ప్రణాళికలు కూడా ఆమోదించారు. అయితే, టోర్నీ సమయానికి ఇవి పూర్తవుతాయనే నమ్మకం లేదు. ఫ్రాంటియర్ వర్క్స్ ఆర్గనైజేషన్ (ఎఫ్‌డబ్ల్యుఓ) బృందం రాత్రి పగలు పనిచేస్తోందని, ప్రపంచంలోనే అత్యుత్తమ స్టేడియాల్లో ఒకటిగా తీర్చిదిద్దుతామని, స్టేడియాల్లో మౌలిక వసతులు కల్పించడం మా మొదటి ప్రాధాన్యత అని ఆయన అన్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..